హన్మకొండ అర్బన్ : జిల్లాను కరువు ప్రాం తంగా ప్రకటించి, ఈజీఎస్ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడం తోపాటు పెం డింగ్ నిధులు విడుదల చేయాలని కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయిని రా జేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ప్రతినిధులు బుధవారం కలెక్టర్ వాకాటి కరుణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకు లు మాట్లాడుతూ జిల్లాలో కరువు నివారణ చ ర్యలు చేపట్టాలని, రుణమా ఫీని పూర్తిగా అ మలు చేయాలన్నారు. గ్రామాల్లో వలసలను నివారించేందుకు కృషి చేయూలని కోరారు.
సోషల్ ఆడిట్‌పై అభినందనలు..
జిల్లాలో పీఆర్ రోడ్ల నిర్మాణంలో కలెక్టర్ ప్రత్యేక చొరవతో చేపడుతున్న సామాజిక తనిఖీ బాగుందని కాంగ్రెస్ నాయ కులు అన్నారు. ప్రజాధనం వృథాకాకుండా, అక్రమాలకు అడ్డుకట్ట వేసే విధంగా కలెక్టర్ చేపడుతున్న కార్యక్రమం అద్భుతమని వారు ప్రశంసించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రేటర్ వరంగల్ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్‌రావు, నాయకులు వెంకట్‌రాంరెడ్డి, డాక్టర్ బండా ప్రకాష్, ఈవీ శ్రీనివాస్‌రావు, బత్తినిశ్రీనివాస్‌రావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
వరంగల్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలి
Published Thu, Apr 28 2016 2:47 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM
Advertisement