తెలంగాణ భౌగోళిక స్వరూపం
29వ రాష్ట్రంలో రాజధాని మినహా ప్రతీ జిల్లాకు పొరుగు రాష్ట్రమే సరిహద్దు
29వ రాష్ట్రం
విస్తీర్ణం: 1.14లక్షల చదరపు కిలోమీటర్లు
జనాభా: 3,50,05,836
జిల్లాలు: 10
గ్రామాలు: 8,400
మండలాలు: 459
దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో రాజధాని నగరమైన హైదరాబాద్ జిల్లా మినహా అన్ని జిల్లాలకు రాష్ట్రాలే సరిహద్దులుగా ఉండడం విశేషం. ఆదిలాబాద్ నుంచి మొదలుకొని మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం వరకు ప్రతిజిల్లాకు ఏదో ఒక రాష్ట్రం సరిహద్దుగానే ఉంది. 1.14 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో, 3,50,05,836 మంది జనాభాతో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. తెలంగాణలో మొత్తం జనాభా 3,51,93,978 మంది ఉన్నప్పటికీ ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాల్లోని 275 రెవెన్యూ గ్రామాలకు చెందిన దాదాపు 1,88,142 మందిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపారు.
రాజకీయ ముఖచిత్రం
లోక్‌సభ స్థానాలు 17
అసెంబ్లీ స్థానాలు 119
జెడ్పీటీసీలు 443
ఎంపీటీసీలు 6,525
1.రాష్ట్ర విభజనలో భాగంగా ఖమ్మం జిల్లాలోని వేలేరుపాడు, కుక్కునూరు, చింతూరు, వీఆర్‌పురం, భద్రాచలం, బూర్గంపాడు, కూన వరం మండలాలు, మరికొన్ని గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌లో కలుస్తున్నాయి.
2.ఖమ్మం జిల్లాలకు ఛత్తీస్‌గఢ్‌తోపాటు కొంత ఒడిశా సరిహద్దు ఉన్నా.. సీలేరు బేసిన్ పరిధిలోని ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో కలుస్తుండటం వల్ల ఒడిశా సరిహద్దు ఆంధ్రప్రదేశ్‌లోకి వెళ్తోంది.
సరిహద్దులివీ...
- ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు మహారాష్ట్ర
- ఖమ్మంకు ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్
- వరంగల్‌కు ఛత్తీస్‌గఢ్
- మహబూబ్‌నగర్‌కు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక
- రంగారెడ్డి, మెదక్ జిల్లాలకు కర్ణాటక, నల్లగొండకు ఆంధ్రప్రదేశ్