Boundary
-
మహాకాళేశ్వరం గోడ కూలి ఇద్దరు మృతి
ఉజ్జయిని: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి మహాకాళేశ్వరం ప్రహరీ గోడ కూలి ఇద్దరు మృతిచెందారు. ఆలయానికున్న గేట్ నంబర్ నాలుగుకు ముందు మహాకాళ్ లోక్ ఫేజ్ టూ సమయంలో నిర్మించిన గోడపై మరొక గోడను నిర్మిస్తున్నారు. భారీ వర్షానికి ఈ గోడ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారని, గోడలోని కొంత భాగం కూలిపోగా, దాని కింద నలుగురు సమాధి అయ్యారని ఉజ్జయిని కలెక్టర్ నీరజ్ కుమార్ సింగ్ తెలిపారు. వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించి, బాధితులను శిథిలాల నుంచి రక్షించి జిల్లా ఆస్పత్రికి తరలించారన్నారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరిని చికిత్స నిమిత్తం ఇండోర్‌కు తరలించారని తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు చొప్పున, క్షతగాత్రులకు చికిత్స నిమిత్తం రూ.50 వేలు చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. మృతులను ఫర్హీన్ (22), అజయ్ యోగి (27)గా గుర్తించినట్లు సీఎంహెచ్వో ఏకే పటేల్ తెలిపారు. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ సంతాపం వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. నిర్మాణ పనుల్లో జరిగిన అవకతవకలపై విచారణకు ఆదేశించారు.ఇది కూడా చదవండి: ‘కేజ్రీవాల్ జైల్లో ఎందుకు రాజీనామా చేయలేదు?’ -
గౌరవ మర్యాదలు
మర్యాద అనే మాటకి హద్దు, చెలియలికట్ట అనే అర్థాలున్నాయి. వ్యవహారంలో గౌరవమర్యాదలని కలిపి జంటపదాలుగా వాడుతాము. ఇతరుల చేత చెప్పించుకోకుండా తన హద్దుల్లో తాను ఉండటం మర్యాద. చెలియలికట్ట అంటే సముద్రానికి ఒడ్డు. నదులు, చెరువులు మొదలైన వాటికి ఒక ఒడ్డు ఉంటుంది. అవి కొన్ని సార్లు ఒడ్డుని తెగ కొట్టి విజృంభించటం చూస్తాం. కాని, సముద్రానికి ఎవరు ఒక ఒడ్డుని తయారు చేయలేదు. ‘ఈ గీత దాటవద్దు’ అని ఎవరూ కట్టడి చేయలేదు. అయినా ఎటువంటి సమయంలోనూ చెలియలికట్టని దాటి సముద్రుడు భూభాగంలో ప్రవేశించటం చూడం మనం. మనిషి విషయం కూడా అంతే! కొన్ని రకాలైన రీతి, రివాజులని, తీరు తెన్నులని ప్రవర్తనా నియమావళిని నేర్పే పద్ధతులు అనేకం ఉన్నాయి. చిన్నతనంలో ఇంట్లో పెద్దలు ఏం చేయాలి? ఏం చేయకూడదు? మొదలైన విషయాలని కొన్ని మాటలతోనూ, కొన్ని చేతలతోనూ నేర్పిస్తారు. కొన్ని చదువుకోటం వల్ల తెలుస్తాయి. కొన్ని ఎవరూ చెప్పరు. చెప్పాలని కూడా తెలియదు. ప్రతివ్యక్తి తనంతట తానుగా తెలుసుకుని అమలు చేయవలసి ఉంటాయి. ఎదుటి వారికి ఆ విషయం చెప్పటానికి ఇబ్బందిగా ఉంటుంది. అవతలి వారిని ఇబ్బంది పెట్టకుండా ధర్మబద్ధంగా ఉండే ప్రవర్తనని మర్యాద అనవచ్చునేమో! ఎవరి చేతా చెప్పించుకోకుండా తన పరిమితుల్లో తాను ఉండటం మర్యాద. సముద్రం గట్టు లేకపోయినా తన హద్దు తాను దాటనట్టు. ఉదాహరణకి – ఒక గదిలోకి ప్రవేశించాం అనుకోండి. ముందు వెళ్ళిన వారు లోపలికి వెళ్ళాలి. వెనక నున్న వారు అప్పుడే కదా లోపలికి అడుగు పెట్టటానికి వీలు కలిగేది. అదే కాస్త పదవో, అధికారమో ఉన్న వాళ్ళు అయితే, కదలమని చెప్పలేరు. బహుళ అంతస్థుల భవనాల్లో లిఫ్ట్ దగ్గర తరచూ ఎదుర్కొనే సమస్య ఇది. చెపితే,‘‘మాకు తెలియదా? మీరు చెప్పాలా? జరుగుతాం లెండి. అంత తొందర ఎందుకు?’’ అని పెద్ద బోధ చేస్తారు. నిజానికి చెప్పించుకున్నామే, అని సిగ్గుపడాలి. ముందు లోపలికి వెళ్ళిన వారు వెనక ఉన్న వారికి అవకాశం కలిగించాలనే నియమం ఎక్కడా రాసి లేదు. అయినా పాటించాలని తెలుసు కనకనే నీది తప్పు అనలేక ఎదురు దాడికి దిగటం. ఎవరైనా నిద్రపోతూ ఉంటే గట్టిగా పాటలో, టీవీనో పెట్టుకోవటం గురించి ఎక్కడా ప్రస్తావన లేదు కనక నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అనటం మూర్ఖత్వం అవుతుందా? కాదా? నలుగురి మధ్యలో ఉన్నప్పుడు చికాకు కలిగించే చేష్టలు, శబ్దాలు చేయటం, జుగుప్సావహంగా ప్రవర్తించటం ఆమోదయోగ్యం కాదు కదా! వెకిలి చేష్టలు ఎప్పుడైనా, ఎక్కడైనా అమర్యాదగా పరిగణించ బడతాయి. సభల్లో, సమావేశాలలో కొన్ని పాటించవలసిన పద్ధతులు నిర్దేశించ బడతాయి. కొన్ని పేర్కొనక పోయినా అమలు జరుగుతూ ఉంటాయి. సమాజంలో కూడా అంతే! ఉదాహరణకి పెద్దలు మాట్లాడుకుంటుంటే పిల్లలు మధ్యలో కలిగించుకో కూడదు. అసలు ఆ ప్రాంతంలో ఉండకూడదు. ఒక వేళ ఉండటం తటస్థిస్తే, పేరు పెట్టి పిలిచి మాట్లాడమంటే తప్ప నోరు విప్పకూడదు. రామాయణంలో రాముడు బాలకాండ మొత్తం మీద మాట్లాడిన మాటలు వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. మర్యాదాపురుషోత్తముడు కదా! సభల్లో కూడా ఇదే పాటించ వలసిన నియమం. మర్యాద ప్రవర్తన వల్ల లభిస్తుంది. అడిగితే రాదు. కనుకనే మర్యాద గౌరవంతో జత కలిసి ఉంటుంది. సున్నితమైన విషయాలు ప్రస్తావించక పోవటం ఒక మర్యాద. ఏ విషయం ప్రస్తావిస్తే బాధ కలుగుతుందో దానిని తనంత తాను ఎత్తక పోవటం మర్యాదస్తుల లక్షణం. మర్యాద ఇచ్చి పుచ్చుకోవలసినది. వస్త్రధారణ, మాటతీరు, నడతలలో మర్యాద వ్యక్తమౌతుంది. మర్యాదస్తులకి మాత్రమే సమాజంలో గౌరవం లభిస్తుంది. – డా. ఎన్. అనంతలక్ష్మి -
రీ సర్వేలో సర్కారు స్పీడు
సాక్షి, అమరావతి: భూముల రీ సర్వేతో కొత్త చరిత్రను లిఖిస్తున్న ప్రభుత్వం మరో రికార్డు సృష్టించింది. తొలి విడత రీ సర్వే పూర్తయిన 2 వేల గ్రామాల్లో సరిహద్దు రాళ్లు పాతే కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. వ్యవసాయ భూముల సరిహద్దులను చూపుతూ రాళ్లు వేసినప్పుడు మాత్రమే సమగ్ర భూ సర్వే పూర్తయినట్లని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేయటంతో సర్వే శాఖ వేగంగా దాన్ని పూర్తి చేసింది. గత నెలాఖరుకి 13 లక్షల రాళ్లు పాతిన యంత్రాంగం ఆ తర్వాత 20 రోజుల్లోనే రికార్డు స్థాయిలో 12.80 లక్షలకుపైగా రాళ్లు పాతి, కొత్త రికార్డు సృష్టించింది. ఈ నెల 20వ తేదీకల్లా 2 వేల గ్రామాల్లో రాళ్లు పాతే పని పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నా మూడు రోజుల ముందే ఆ పని పూర్తి చేశారు. ఇందుకోసం సర్వే శాఖ వెయ్యి రోవర్లను సమకూర్చుకొంది. మరికొన్నింటిని అద్దెకు తీసుకొంది. రోజుకు సగటున 40 నుంచి 50 వేల రాళ్లను పాతారు. 2 వేల గ్రామాల్లో అన్ని దశల సర్వే పూర్తి రాష్ట్రంలోని 17 వేలకుపైగా గ్రామాలకుగాను తొలి విడతగా 2 వేల గ్రామాల్లో రీ సర్వే అన్ని దశలు పూర్తయింది. ఈ గ్రామాలకు కొత్త రెవెన్యూ రికార్డులు (ఆర్ఓఆర్) సైతం తయారయ్యాయి. ఆ గ్రామాలకు చెందిన 7.50 లక్షల మంది రైతులకు భూ హక్కు పత్రాలను జారీ చేశారు. చివరిగా రైతుల భూముల సరిహద్దుల్లో సర్వే రాళ్లు పాతడం కూడా పూర్తి చేయడం ద్వారా ఈ 2 వేల గ్రామాలను రీసర్వే మోడల్ గ్రామాలుగా తీర్చిదిద్దారు. ఖర్చంతా ప్రభుత్వానిదే సాధారణంగా రైతులు భూమిని సర్వే చేయించుకుని రాళ్లు పాతించడం పెద్ద ప్రయాస. ఖర్చు ఎక్కువ. అయితే, ప్రభుత్వం రైతులపై పైసా కూడా భారం పడకుండా మొత్తం తానే భరించింది. సర్వే పూర్తి చేసి ఉచితంగా రాళ్లు పాతి రైతులకు భూములు అప్పగించింది. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా ఇందుకోసం అవసరమైన రాళ్లను కోట్ల ఖర్చుతో తయారు చేయించింది. రాళ్ల తయారీకి ప్రత్యేకంగా యూనిట్లు పెట్టి మరీ అవసరమైన సైజుల్లో రాళ్లను తయారు చేసింది. 25 లక్షలకు పైగా రాళ్లు సర్వే పూర్తయిన 2 వేల గ్రామాల్లో మొత్తం 25 లక్షలకు పైగా రాళ్లను పాతారు. మూడు గ్రామాలు కలిసే చోట (ట్రై జంక్షన్) ఏ క్లాస్ పెద్ద రాళ్లు 6,970 పాతారు. ప్రతి భూకమతం హద్దుల్లో బి క్లాస్ చిన్న రాళ్లు 25.73 లక్షలు పాతారు. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలోని 354 గ్రామాల హద్దుల్లో 4.48 లక్షల రాళ్లు పాతారు. విజయనగరం జిల్లాలో 179 గ్రామాల్లో 2.48 లక్షలు, పల్నాడు జిల్లాలో 70 గ్రామాల్లో 2.08 లక్షలు, కాకినాడ జిల్లాలో 121 గ్రామాల్లో 1.86 లక్షలు, చిత్తూరు జిల్లాలోని 134 గ్రామాల్లో 1.44 లక్షల రాళ్లు పాతారు. ఆయా ప్రాంతాల భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా గ్రానైట్, శాండ్ స్టోన్, లైమ్ స్టోన్, నాప రాళ్లను వినియోగించారు. 70 శాతానికిపైగా గ్రానైట్ రాళ్లనే పాతారు. -
హై స్కోరింగ్ మ్యాచ్‌ల కోసం ఇంత దిగజారాలా?
వుమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL 2023)G తొలి ఎడిషన్ అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. శనివారం(మార్చి 4న) గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ వుమెన్స్ 143 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోరు చేసింది. హర్మన్‌ప్రీత్ 14 ఫోర్లతో 35 బంతుల్లోనే 65 పరుగుల సుడిగాలి ఇన్నింగ్స్ ఆడింది. హేలీ మాథ్యూస్ నాలుగు సిక్సర్లతో 31 బంతుల్లోనే 47 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. పూర్తి ఓవర్లు ఆడకుండానే 64 పరుగులకే కుప్పకూలింది. అయితే సాధారణంగా అంతర్జాతీయ టి20 మ్యాచ్‌ల్లో బౌండరీ లైన్‌ను కాస్త ముందుకు జరపడం చూస్తుంటాం. ఐపీఎల్‌లోనూ ఇదే తంతు కొనసాగుతుంది. కేవలం పెద్ద స్కోర్లు రావాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తుంటారు. అయితే డబ్ల్యూపీఎల్ విషయంలో బీసీసీఐ మరింత ముందుకెళ్లింది. హై స్కోరింగ్ మ్యాచ్‌లు నమోదవ్వాలనే ఉద్దేశంతో బౌండరీ లైన్‌ను బాగా తగ్గించేసింది. కేవలం 60 మీటర్ల దూరంలోనే బౌండరీ లైన్‌ను ఉంచింది. అందుకే ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ సమయంలో బ్యాటర్లు అవలీలగా బౌండరీలు కొట్టేశారు. ఒక్క హర్మన్‌ప్రీత్ ఏకంగా 14 బౌండరీలు బాదగా.. మాథ్యూస్ అయితే నాలుగు సిక్సర్లు కొట్టిపారేసింది. అయితే చేధనలో చతికిలపడ్డ గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్‌లో బౌండరీలు ఎక్కువగా రానప్పటికి వాళ్లు కూడా బంతులను అవలీలగా బౌండరీ దాటించేశారు. మహిళల ప్రీమియర్ లీగ్ తొలి ఎడిషన్ కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. కేవలం 60 మీటర్ల దూరంలోనే బౌండరీని ఏర్పాటు చేసింది. ఇటీవలే ముగిసిన మహిళల టి20 ప్రపంచకప్‌లో బౌండరీ లైన్‌ను 65 మీటర్ల దూరంలో ఉంచారు. బౌండరీలైన్‌ను తగ్గించడం ద్వారా హై స్కోరింగ్లకు ఎక్కువ అవకాశం ఉంటుందని.. మ్యాచ్ చూస్తే అభిమానులకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని బీసీసీఐ పేర్కొంది. అయితే బీసీసీఐ చేసిన పనిని కొంతమంది తప్పుబట్టారు. హైస్కోరింగ్ మ్యాచ్‌ల కోసం ఇంత దిగజారుతారా అంటూ కామెంట్స్ చేశారు. 𝑾𝒉𝒐 𝒆𝒍𝒔𝒆? @ImHarmanpreet brings up the first 5️⃣0️⃣ of #TATAWPL 👏🏼 More of her in action in #GGvMI 👉🏼 LIVE on #JioCinema & #Sports18 📺📲#CheerTheW #TATAWPLonJioCinema #TATAWPLonSports18 pic.twitter.com/16SxnLpZup — JioCinema (@JioCinema) March 4, 2023 చదవండి: సీఎస్కే కెప్టెన్‌గా బెన్ స్టోక్స్!? WPL 2023: క్రికెటర్‌పై వేటు.. ఆరంభంలోనే వివాదం -
ఆస్పత్రి పాలైన డుప్లెసిస్
అబుదాబి: దక్షిణాఫ్రికా సీనియర్ ఆటగాడు ఫాఫ్ డు ప్లెసిస్ గాయపడ్డాడు. బౌండరీ లైన్ దగ్గర మరో ఆటగాడిని గట్టిగా ఢీ కొట్టడంతో స్పృహ కోల్పోయాడు. అబుదాబి షేక్ జాయెద్ స్టేడియంలో శనివారం ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో డు ప్లెసిస్ కళ్లు తిరిగి పడిపోగా.. అతన్ని ఆస్పత్రికి తరలించారు. పాకిస్థాన్ సూపర్‌లీగ్ టోర్నీలో భాగంగా క్వెట్టా గ్లాడియేటర్స్, పెషావర్ జల్మి జట్ల మధ్య మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. బంతిని బౌండరీ వద్ద డైవ్‌చేసి అడ్డుకునే క్రమంలో మరో ఆటగాడు మహమ్మద్ హస్నెయిన్ను ఢీ కొట్టాడు. హసనెయిన్ మోకాలి చిప్ప బలంగా తాకడంతో డు ప్లెసిస్ కళ్లు తిరిగి పడిపోయాడు. దీంతో అందరిలో టెన్షన్ నెలకొంది. ఆ వెంటనే వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. BREAKING - Faf du Plessis has been sent to hospital for a check-up after he collided with Mohammad Hasnain while fielding in PSL game.#FafduPlessis #PSL pic.twitter.com/QGMnvCCPG6 — AIPWA@ANI (@AIPWAANI5) June 12, 2021 డు ప్లెసిస్ గాయపడ్డ సంగతి తెలిసిన అభిమానులు.. అతను త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే ఆస్పత్రి నుంచి డిశ్చార్చి అయిన డు ప్లెసిస్.. తిరిగి హోటల్ రూమ్‌కి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్‌లో డు ప్లెసిస్ జట్టు క్వెట్టా గ్లాడియేటర్స్ ఓటమి పాలైంది. ఇక శనివారమే డెన్మార్క్ ఫిన్లాండ్ ఫుట్ బాల్ మ్యాచ్ సందర్భంగా క్రిస్టియన్ ఎరిక్సెన్ మైదానంలోనే కుప్పకూలి ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. చదవండి: కుప్పకూలిన ఫుట్‌బాల్ ప్లేయర్ -
నేపాల్ దూకుడుకు భారత్ గట్టి కౌంటర్
న్యూఢిల్లీ: లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాల కోసం భారత్, నేపాల్‌ల మధ్య నెలకొన్న వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఈ మూడు ప్రాంతాలను తమకు అప్పగించాలని భారత్‌ను డిమాండ్ చేస్తూ.. అందుకు సంబంధించిన తీర్మానాన్ని నేపాల్ అధికార కమ్యూనిస్ట్ పార్టీ పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఈ భూభాగాలను తమ దేశంలోని ప్రాంతాలుగా పేర్కొంటూ కొత్త మ్యాప్‌ను కూడా విడుదల చేసింది. కాగా నేపాల్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్.. ఆ దేశం నిర్ణయాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. నేపాల్ రూపొందించిన మ్యాప్‌కు చారిత్రక ఆధారాలు లేవని.. కృత్రిమంగా చేపట్టిన సరిహద్దు మార్పులు చెల్లవని తేల్చిచెప్పింది. (కాలాపానీ మాదే.. భారత్ నుంచి తీసుకుంటాం) ఈ విషయం గురించి విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. నేపాల్ ప్రభుత్వ ఏకపక్ష చర్యను అంగీకరించబోమన్నారు. ‘‘ఈ విషయంలో భారత్ వైఖరి ఏమిటో నేపాల్‌కు స్సష్టమైన అవగాహన ఉంది. ఇకనైనా ఇలాంటి అన్యాయపూరితమైన పటాలు విడుదల చేయడం ఆపేయాలని నేపాల్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. భారత సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని కోరుతున్నాం. నేపాలీ అధినాయకత్వం సానుకూల వాతావరణంలో ద్వైపాక్షిక చర్చల ద్వారా సరిహద్దు వివాదాలను పరిష్కరించుకునేందుకు సహకరిస్తుందని ఆశిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.(భారత్‌పై నేపాల్ ప్రధాని షాకింగ్ కామెంట్లు!) కాగా మే 11న భారత రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉత్తరాఖండ్ మీదుగా లిపులేఖ్ వరకూ మానస సరోవర్ యాత్రకెళ్లేవారి సౌకర్యార్థం నిర్మించిన రహదారికి శంకుస్థాపన చేసిన నాటి నుంచి నేపాల్ భారత్‌పై అసహనం వ్యక్తం చేస్తోంది. ఈ విషయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన నేపాల్.. భారత రాయబారికి నోటీసులు పంపడం సహా ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి భారత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత రాజముద్రలో ఉండే మూడు సింహాల ముందు ‘సత్యమేవ జయతే’ అని ఉంటుందని, ఆ దేశం దానికి కట్టుబడి ఉంటుందో, సింహమేవ జయతే అనుకుంటుందో చూడాలంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. (నేపాల్ కన్నెర్ర) 200 ఏళ్ల నాటి వివాదం భారత్-నేపాల్-చైనా సరిహద్దులో గల లిపులేఖ్ భారత్‌కు వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైంది. ఈ సరిహద్దు వివాదం 200 ఏళ్ల క్రితమే మొదలైంది. ఇరు దేశాల మధ్య 1816 మార్చి 4న సరిహద్దులకు సంబంధించి తొలిసారి సుగౌలీ ఒప్పందం కుదిరింది. అప్పటి బ్రిటిష్ పాలకులు భారత్ తరఫున సంతకాలు చేయగా... ఆ ప్రాంతంలో ప్రవహిస్తున్న మెచ్చి, మహాకాళి, నారాయణి నదీ తీరాలను గీటురాళ్లుగా తీసుకుని సరిహద్దుల్ని నిర్ణయించడం పెద్ద సమస్యగా మారింది. ఆ నదుల గమనం ఈ రెండు శతాబ్దాల్లో అనేకసార్లు మారడం వల్ల ఎవరు ఎవరి భూభాగంలోకి చొచ్చుకొచ్చారన్న విషయంలో స్పష్టత లేకుండా పోయింది. తాజాగా నేపాల్ కొత్త మ్యాపులు విడుదల చేయడంతో వివాదం తారస్థాయికి చేరింది. -
తెలంగాణ భౌగోళిక స్వరూపం
29వ రాష్ట్రంలో రాజధాని మినహా ప్రతీ జిల్లాకు పొరుగు రాష్ట్రమే సరిహద్దు 29వ రాష్ట్రం విస్తీర్ణం: 1.14లక్షల చదరపు కిలోమీటర్లు జనాభా: 3,50,05,836 జిల్లాలు: 10 గ్రామాలు: 8,400 మండలాలు: 459 దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో రాజధాని నగరమైన హైదరాబాద్ జిల్లా మినహా అన్ని జిల్లాలకు రాష్ట్రాలే సరిహద్దులుగా ఉండడం విశేషం. ఆదిలాబాద్ నుంచి మొదలుకొని మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం వరకు ప్రతిజిల్లాకు ఏదో ఒక రాష్ట్రం సరిహద్దుగానే ఉంది. 1.14 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో, 3,50,05,836 మంది జనాభాతో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. తెలంగాణలో మొత్తం జనాభా 3,51,93,978 మంది ఉన్నప్పటికీ ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాల్లోని 275 రెవెన్యూ గ్రామాలకు చెందిన దాదాపు 1,88,142 మందిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపారు. రాజకీయ ముఖచిత్రం లోక్‌సభ స్థానాలు 17 అసెంబ్లీ స్థానాలు 119 జెడ్పీటీసీలు 443 ఎంపీటీసీలు 6,525 1.రాష్ట్ర విభజనలో భాగంగా ఖమ్మం జిల్లాలోని వేలేరుపాడు, కుక్కునూరు, చింతూరు, వీఆర్‌పురం, భద్రాచలం, బూర్గంపాడు, కూన వరం మండలాలు, మరికొన్ని గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌లో కలుస్తున్నాయి. 2.ఖమ్మం జిల్లాలకు ఛత్తీస్‌గఢ్‌తోపాటు కొంత ఒడిశా సరిహద్దు ఉన్నా.. సీలేరు బేసిన్ పరిధిలోని ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో కలుస్తుండటం వల్ల ఒడిశా సరిహద్దు ఆంధ్రప్రదేశ్‌లోకి వెళ్తోంది. సరిహద్దులివీ... - ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు మహారాష్ట్ర - ఖమ్మంకు ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ - వరంగల్‌కు ఛత్తీస్‌గఢ్ - మహబూబ్‌నగర్‌కు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక - రంగారెడ్డి, మెదక్ జిల్లాలకు కర్ణాటక, నల్లగొండకు ఆంధ్రప్రదేశ్