సాక్షి, హైదరాబాద్: చరిత్రాత్మక సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు ఈ ఏడాది వరుసగా 3 ప్రతిష్టాత్మక అవార్డులు లభించాయి. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన స్వచ్ఛ రైల్వేస్టేషన్‌లలో సికింద్రాబాద్ మొదటి స్థానంలో నిలవగా, అలాగే పర్యావరణ పరిరక్షణ, ఇంధన వనరుల సద్వినియోగంలో ప్రతిష్టాత్మక ఇండియన్ గ్రీన్‌బిల్డింగ్స్ సొసైటీ నుంచి ప్లాటినమ్ సర్టిఫికెట్ దక్కింది. తాజాగా జాతీయ పర్యాటక అవార్డును సొంతం చే సుకుంది. ప్రయాణికుల సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణ, ప ర్యాటకులను ఆకట్టుకోవడంలోనూ సికింద్రాబాద్ దేశంలోని అన్ని రైల్వేస్టేషన్‌ల కంటే ముందంజలో నిలిచింది.
నిత్యం సుమారు 210 రైళ్లు, లక్షా 80 వేల మందికి పైగా ప్రయాణికుల రాకపోకలతో దక్షిణమధ్య రైల్వేలో అతి ప్రధానమైన రైల్వేస్టేషన్‌గా నిలిచిన సికింద్రాబాద్.. ఇంధన వనరుల వినియోగంలోనూ గణనీయమైన పురోగతిని సాధించింది. పది ప్లాట్‌ఫామ్‌లు, 15 విశ్రాంతి గదులు, మరో రెండు విశాలమైన వెయిటింగ్ హాళ్లు, ఒక ప్లాట్‌ఫామ్ నుంచి మరో ప్లాట్‌ఫామ్‌కు వెళ్లేందుకు వీలుగా ఏర్పాటు చేసిన లిఫ్టులు, ఎస్కలేటర్లు, తాగునీరు, టాయిలెట్లు తదితర సదుపాయాలతో నిత్యం లక్షన్నర మందికి పైగా ప్రయాణికులకు అవసరమైన సదుపాయాలను అందిస్తున్న ఈ స్టేషన్ పర్యాటక ప్రియమైన స్టేషన్‌గా జాతీయ స్థాయి అవార్డును అందుకుంది. దేశ, విదేశాలకు చెందిన పర్యాటకులకు ప్రయాణ సదుపాయానికి సికింద్రాబాద్ ఎంతో అనుకూలంగా ఉన్నట్లు జాతీయ పర్యాటక సంస్థ గుర్తించింది.
పర్యావరణం, పర్యాటకంలో నం.1
Published Wed, Oct 3 2018 2:17 AM | Last Updated on Wed, Oct 3 2018 2:17 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment