ఉట్నూర్ (ఆదిలాబాద్) : విహారయాత్ర ఓ కుటుంబంలో విషాదం నింపింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు బాలికలు, ఒక యువకుడు నీట మునిగి మృత్యువాతపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన దాదాపు 15 మంది సభ్యులు సోమవారం ఉదయం సమీపంలోని కన్నాపూర్ వాగు వద్దకు వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తు ఎస్‌కే రేష్మా(9), ఎస్‌కే నసీమాబాను(15), ఎస్‌కే ముజాహిద్(18)లు వాగులో పడిపోయారు. రక్షించేలోగానే వారు నీట మునిగి చనిపోయారు.