రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం
జి.తిర్మలగిరి(చివ్వెంల):వేర్వేరు రోడ్డు ప్రమదాల్లో ముగ్గురు దుర్మరణం చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలు జిల్లాలోని చివ్వెంల, చౌటుప్పల్, చిలుకూరు మండలాల పరిధిలో శనివారం చోటు చేసుకున్నాయి. వివరాలు.. పెన్‌పహాడ్ మండలం భ క్తాళపురం ఆవాసం ఎర్రంశెట్టిగూడేనికి చెందిన ఎర్రంశెట్టి లిం గయ్య(54), ఆతడి భార్య సుక్కమ్మ బైక్‌పై ఉదయం చివ్వెంల మండలం వల్లభాపురం ఆవాసం ఉండ్రుగొండ శివారు శ్రీ ఎచ్చెర్ల ముత్యాలమ్మ ఆలయానికి వచ్చారు. అక్కడ ఓ శుభకార్యంలో పాల్గొన్నారు. తిరుగు ప్రయాణంలో తిర్మలగిరి వద్ద రోడ్డు దాటుతుండగా విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వేగంగా వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లింగయ్య, సుక్కమ్మలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు చికిత్స నిమిత్తం సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. లింగయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తీసుకెళ్లగా మృతిచెందాడు. సంఘటన స్థలాన్ని హెడ్ కానిస్టేబుల్ ఆర్.వెంకటేశ్వర్లు పరిశీలించారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని..
చౌటుప్పల్: మండలంలోని చిన్నకొండూరు గ్రామానికి చెందిన కొండూరు సంతోష్‌కుమార్(22) చౌటుప్పల్‌లోని హోటల్‌లో సప్లయర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి పనిముగించుకొని ఇంటికి వెళ్లేందుకు, బస్టాండ్ ఎదుట రోడ్డు దాటుతున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా, మార్గమధ్యంలో తుఫ్రాన్‌పేట వద్ద మృతిచెందాడు. పోలీస్ ఇన్‌స్పెక్టర్ భూపతి గట్టుమల్లు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రెండు బైక్‌లు ఢీకొనడంతో..
చిలుకూరు : హుజూర్‌నగర్‌కు చెందిన లింగయ్య పని నిమిత్తం బైక్‌పై కోదాడ వైపు వస్తున్నాడు. మండల పరిధిలోని సీతరాంపురం గోదాముల వద్దకు రాగానే వేగంగా వస్తున్న కోదాడకు చెందిన షేక్ అబ్జల్(30) తనబైక్‌తో వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అబ్జల్ అక్కడికక్కడే మృతిచెందగా లింగయ్యకు తీవ్ర గాయాలయ్యా యి. క్షతగాత్రుడిని స్థానికులు 108 సిబ్బంది హుటాహుటిన కోదాడ ప్రభుత్వ ఆస్పత్రి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఖమ్మంకు తీసుకెళ్లారు. అబ్జల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజూర్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చీకటి కావడం, వర్షం పడుతుం డడం, బైక్‌లు వేగగంగా ఉండడం అదుపుతప్పి ప్రమా దం జరిగిందని స్థానికులు భావిస్తున్నారు.