
సాక్షి, హైదరాబాద్: ఏప్రిల్, మే, జూన్‌లలో రాష్ట్రంలో తీవ్రమైన ఎండలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. భారత వాతావరణ హెచ్చరికల కేంద్రం తాజా అంచనాలను బుధవారం విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ హీట్ వేవ్ జోన్‌లో ఉందని హెచ్చరించింది. ప్రతి ప్రాంతంలో 0.5 డిగ్రీల నుంచి 1 డిగ్రీ ఉష్ణోగ్రత పెరుగుతుందని పేర్కొంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు మించి నమోదు అవుతాయని హెచ్చరికలు జారీచేసింది.
హైదరాబాద్‌లో 40, కొత్తగూడెం, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. ఇదిలా వుండగా బుధవారం ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్‌ల్లో 41 డిగ్రీల అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. మెదక్‌లో 40 డిగ్రీలు నమోదైందని ఆయన వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment