సాక్షి, నిర్మల్: రాష్ట్రంలో ప్రముఖ టైగర్ కన్జర్వేషన్ జోన్ కవ్వాల్ అభయారణ్యంలో తాజాగా పెద్దపులి కనిపించింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ రేంజ్‌లో పెద్దపులి సంచరిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ మేరకు పెద్దపులి సంచారాన్ని దాదాపు ఏడాది తర్వాత గుర్తించారు. పెద్దపులి కదలికలు కెమెరా కంటికి చిక్కాయి. కవ్వాల్ అటవీ ప్రాంతంలో మనుషులు, పశువుల సంచారం నియంత్రించడం.. గడ్డిక్షేత్రాలు భారీగా పెంచడంతో సత్ఫలితాలు ఇచ్చిందని అటవీ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment