
శాంతాపూర్ అటవీ ప్రాంతంలో జాతీయ రహదారిని దాటుతున్న పెద్ద పులి
సాక్షి, నిజాంసాగర్(జుక్కల్): నాందేడ్–సంగారెడ్డి జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి పెద్దకొడప్‌గల్, బిచ్కుంద మండలాల పరిధిలోని శాంతాపూర్ గండి పరిసరాల్లో పెద్ద పులి సంచరించింది. నేషనల్ హైవే పై పెట్రోలింగ్ కోసం వెళ్లిన జుక్కల్ పోలీసులకు పెద్దపులి కనిపించడంతో 15 నిమిషాల పాటు వాహనాన్ని రోడ్డుపై నిలిపివేశారు. పెద్దపులి రోడ్డు దాటేంత వరకు పోలీసులు వాహనంలోనే ఉన్నారు. జుక్కల్, బిచ్కుంద, పెద్దకొడప్‌గల్ మండలాల్లోని అడవుల్లో రాత్రి వేళ ప్రయాణించే ద్విచక్రవాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని జుక్కల్ ఎస్సై ఎండీ. రఫీయోద్దిన్ సూచించారు. జాతీయ రహదారిపై పెద్దపులి సంచరించడంతో ప్రయాణికులు, వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment