Tiger wandering
-
నిర్మల్ జిల్లాలో పెద్దపులి కలకలం
-
పొలంలో పులి.. ఎవుసం చేస్తుందా!
-
దర్జాగా తిరుగుతున్న పులి.. చిక్కేదేలే.. తగ్గేదేలే.. సీసీ కెమెరాల్లో దృశ్యాలు
ప్రత్తిపాడు రూరల్(కాకినాడ జిల్లా): ప్రత్తిపాడు పరిసర ప్రాంతాల్లో పులి దర్జాగా తిరుగుతోంది. రెండు రోజులుగా బోనులను ఏర్పాటు చేసినా పరిస్థితులను పసిగట్టిన పులి చిక్కకుండా తప్పించుకుంటోంది. శనివారం రాత్రి అది బోను వరకూ వెళ్లినా చిక్కలేదు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. సీసీఎఫ్ఓ శరవణన్, డీఎఫ్ఓ ఐకేవీ రాజు, వైల్డ్ లైఫ్ డీఎఫ్ఓ సెల్వం, సబ్ డీఎఫ్ఓ సౌజన్య, స్క్వాడ్ డీఎఫ్ఓ ఎంవీ ప్రసాదరావు, ఐఎఫ్ఎస్ ట్రైనీ భరణి, రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు, వైల్డ్ లైఫ్ రేంజర్ వరప్రసాద్, డీఆర్ఓ రామకృష్ణ, సెక్షన్ ఆఫీసర్ రవిశంకర్‌నాగ్, ఎన్ఎస్టీఆర్ బృందాల సారధ్యంలో అటవీ శాఖ సిబ్బంది గాలిస్తున్నారు. చదవండి: 20 పులులను చంపిన చిట్టిరాజు.. అసలు ఆ కథేమిటంటే..? నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వు (ఎన్ఎస్టీఆర్) బృందాలను పులిని ట్రాప్ చేసేందుకు రంగంలోకి దింపారు. పులి సంచరిస్తున్న పరిసర ప్రాంతాలు, ట్రాప్ కెమెరాల్లో చిత్రాలను అధికారుల బృందం క్షుణంగా పరిశీలించింది. ఆయా ప్రాంతాల్లో ఏకకాలంలో ఎనిమిది బోనులను ఆదివారం రాత్రి ఏర్పాటు చేశారు. పులి వ్యవహరిస్తున్న తీరును బట్టి ఎన్ని బోనులు ఏర్పాటు చేసినా చిక్కే పరిస్థితి కనిపించడం లేదు. లేకుంటే ఆఖరి ప్రయత్నంగా ట్రాంక్విలైజర్ గన్‌తో పులికి మత్తు మందు ఇచ్చి బంధించే అవకాశం ఉంది. బోనులు ఏర్పాటు చేస్తున్న అధికారులు ఆచితూచి అడుగులు ట్రాంక్విలైజర్ గన్‌తో ఇచ్చే మత్తు మందు మోతాదు అటు, ఇటు అయితే పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. మోతాదు ఎక్కువైతే చనిపోయే ప్రమాదం ఉంది. అదే తక్కువైతే ప్రశాంతంగా ఉన్న పులిని రెచ్చగొట్టినట్లు అవుతుంది. ఆ సమయంతో పులి క్రూరంగా తయారై ప్రజలకు హాని కలిగించే పరిస్థితి ఉంది. అందుకే అధికారులు పులిని బంధించే విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అధికారుల ఆలోచనలను చిత్తు చేస్తూ బోనులకు చిక్కకుండా అది దర్జాగా తప్పించుకొంటూ తిరుగుతోంది. అటుగా వెళ్లనీయకుండా.. పులి సంచరిస్తున్న ప్రాంతాన్ని పూర్తిగా అధికారులు తమ అ«దీనంలోకి తీసుకున్నారు. ఆ ప్రాంతంలోకి పశువులు, జనాలు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. తద్వారా పులికి ప్రశాంత వాతావరణాన్ని కల్పించి అటవీ ప్రాంతం వైపు తరలించే దిశగా చర్యలు చేపడుతూనే బోనులను ఏర్పాటు చేశారు. ఇందులో ఏది జరిగినా పులి గండం నుంచి గట్టెక్కినట్టే అవుతుంది. గత 15 రోజులు ప్రజలు సహకరించారని, మరికొద్ది రోజులు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. పులిని తరలించేందు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఒమ్మంగి, పొదురుపాక, పోతులూరు, ఉత్తరకంచి, పాండవులపాలెం ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. -
క్రాక్!.. మొదటి నుంచీ ఆ పులిది విచిత్ర ప్రవర్తన
సాక్షి, మంచిర్యాల: రెండు నెలలుగా ఆసిఫాబాద్ అటవీ అధికారులకు చిక్కకుండా మహారాష్ట్రకు వెళ్లిపోయిన పులిది విచిత్ర ప్రవర్తన. మొదటి నుంచీ జనావాసాల్లోనే సంచరిస్తూ ప్రజలపై దాడి చేసేది. తడోబా అంధేరి టైగర్ రిజర్వుకు చెందిన ఈ మగ పులి గతేడాది ఏప్రిల్ నెలలో ఆసిఫాబాద్ మీదుగా కవ్వాల్ టైగర్ కారిడార్లోకి అడుగుపెట్టింది. ఇదే సమయంలో మరో మగ పులి రాగా మంచిర్యాల జిల్లా చెన్నూరు, నీల్వాయి, కోటపల్లి అడవుల్లో సంచరించి ఎవరికీ హానీ చేయకుండా తిరిగి మహారాష్ట్రకు వెళ్లిపోయింది. ఈ రెండింటికీ ఏ1, ఏ2గా నామకరణం చేశారు. నాలుగేళ్ల వయస్సున్న ఏ2 ఎనిమిది నెలలుగా ఇక్కడే సంచరిస్తూ.. తోటి పులుల ఆవాసాలను డిస్టబ్ చేయడమే కాక తన ప్రవర్తనతో అటవీ అధికారులు, సామాన్యుల్లోనూ భయం పుట్టించింది. ఈ మగ పులి జన్మస్థలం చంద్రాపూర్ జిల్లాలో చంద్రాపూర్ థర్మల్ విద్యుత్ కేంద్రం పరిసర అడవులు. ఈ పులితోపాటు మరో ఆడపులికి తన తల్లి జన్మనివ్వగా.. ఆ పులి ప్రస్తుతం అక్కడే ఉంది. ఈ మగ పులి చిన్నప్పటి నుంచే భిన్న ప్రవర్తనను కలిగి ఉన్నట్లు అక్కడి అధికారులు గుర్తించారు. మానవ సంచార ప్రదేశాలకు తరచూ వస్తూ జనాలను బెంబేలెత్తించేది. పలుమార్లు అక్కడ కూడా మనుషులపై దాడికి ప్రయత్నించింది. (చదవండి: పులిపై మత్తు ప్రయోగం.. రంగంలోకి షూటర్లు) అలా ఆవాసం వెతుక్కుంటూ తెలంగాణలోకి చేరింది. మొదటగా ఏప్రిల్‌లో ఆసిఫాబాద్ జిల్లా ఖైరీగూడ ఓపెన్ కాస్టుల్లో, బెల్లంపల్లి పట్టణానికి సమీప ప్రాంతంలోకి రావడంతోపాటు అడవులకు ఆనుకుని ఉన్న గ్రామాల వరకు వచ్చి అనేక మందికి ప్రత్యక్షంగా కనిపించింది. మొదటిసారి దిగిడలో ఓ యువకుడిపై దాడి చేసింది. రెండోసారి 18 రోజుల వ్యవధిలోనే యువతిపై దాడి జరగడంతో అధికారులు ఈ మగ పులి ప్రవర్తనను మహారాష్ట్ర అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ పులిని బంధించి జూకు తరలించడమే ఉత్తమమని భావించి చివరకు మత్తు మందు ప్రయోగం వరకు వెళ్లినా ఫలితం రాలేదు. అడవిలో మానవ అలికిడి, శబ్దాలను పసిగట్టిన పులి తన ‘సొంతూరు’కు వెళ్లిపోయింది. రెండురోజుల క్రితం బెజ్జూరు రేంజీ తలాయి, పెంచికల్‌పేట రేంజీ పెద్దవాగు తీరం వెంట ప్రాణహిత నది దాటి మహారాష్ట్రలోని తడోబా అడవుల్లోకి అడుగుపెట్టినట్లు అధికారులు గుర్తించారు. అయితే టైగర్ కారిడార్‌లో పులుల రాకపోకలు సాధారణమే అయినప్పటికీ ఈ పులి ప్రవర్తన స్థానిక అధికారులను ముచ్చెమటలు పట్టించింది. మళ్లీ ఎప్పుడైనా ఇటువైపు రావొచ్చని అధికారులు చెబుతున్నారు. అప్పుడు ఎవరికీ హాని చేయకుండా ముందు జాగ్రత్తతో బంధిస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. -
పులిపై మత్తు ప్రయోగం.. రంగంలోకి షూటర్లు
సాక్షి, మంచిర్యాల : ఇద్దరిని హతమార్చిన పులిని బంధించేందుకు అటవీశాఖ అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఇటీవల ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం దిగిడలో ఓ యువకుడిని, పెంచికల్‌పేట మండలం కొండపల్లికి చెందిన ఓ యువతిపై పులి దాడి చేసి చంపేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలతో పులిని బంధించాలని ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. దీంతో అటవీశాఖ అధికారులు నెల రోజులుగా పులి రాకపోకలను గమనిస్తూ.. బెజ్జూరు, పెంచికల్‌పేట అడవుల్లో 10 బోన్లు, 100కు పైగా సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. ఎర వేసిన పశువులను తింటున్న పులి.. బోనులోకి మాత్రం వెళ్లడం లేదు. దీంతో మత్తు మందు ప్రయోగించి బంధించాలని నిర్ణయించారు. ఇందుకు చంద్రాపూర్ ర్యాపిడ్ యాక్షన్ టీంకు చెందిన ఆరుగురు అధికారులు, హైదరాబాద్ నుంచి షూటర్లను రప్పించి ఆపరేషన్ ప్రారంభించారు. కవ్వాల్ టైగర్ రిజర్వు ఫారెస్టు డైరెక్టర్ వినోద్‌కుమార్ సహా జిల్లా అటవీ అధికారి శాంతారాం, కాగజ్‌నగర్ ఎఫ్‌డీవో విజయ్‌కుమార్, 100 మంది వరకు అటవీ అధికారులు ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు. మరోవైపు పులిని బంధించడంపై అధికారులు పూర్తి గోప్యత పాటిస్తున్నారు. చదవండి: బోరు వేయని బోరిగాం.. అదెలా సాధ్యమంటారు? మంచెపై ఉంటూ మత్తు ప్రయోగం పులి తరచూ సంచరించే బెజ్జూరు రేంజ్ తలాయి బీట్ పరిధిలోని కంది భీమన్న అటవీ ప్రాంతంలో ఎరగా ఓ పశువును చెట్టుకు కట్టేసి ఉంచారు. ఎరపై పులి ఈ నెల 11న దాడి చేసి ఆకలి తీర్చుకుంది. మరోమారు మిగిలిన మాంసం తినేందుకు వచ్చింది. రెండుసార్లు అక్కడికి వచ్చినప్పటికీ పక్కనే బోనులోకి మాత్రం వెళ్లడం లేదని అధికారులు గుర్తించారు. ఇదే ప్రాంతానికి మళ్లీ పులి వచ్చేలా బుధవారం మరో పశువును ఎరగా ఉంచారు. ఎర ఉన్న ప్రాంతానికి 20 మీటర్ల దూరంలోనే తాత్కాలిక మంచె ఏర్పాటు చేశారు. ఈ మంచెలో షూటర్లు ఉంటూ పులి రాగానే తుపాకీతో మత్తు మందు వదిలేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం అడవిలో రాత్రి వేళల్లోనూ మంచెపైనే ఉంటూ పర్యవేక్షిస్తున్నారు. మత్తు మందు ఇచ్చాక స్పృహ కోల్పోయినట్లు నిర్ధారించుకున్నాకే పులిని ప్రత్యేక వాహనంలో వేరే ప్రాంతానికి తరలించనున్నారు. చదవండి: ఏ పులి ఎక్కడ తిరుగుతుందో! -
పెద్ద పులి వేటకు రంగం సిద్ధం
సాక్షి, అదిలాబాద్ : ఉమ్మడి జిల్లాలో పెద్ద పులుల దాడులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. తాజాగా అసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం పెద్ద వాగు సమీపంలో దిగిడ గ్రామానికి చెందిన సిడాం విఘ్నేష్(22) అనే ఆదివాసీ యువకుడిపై పెద్ద పులి దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. విఘ్నేష్‌ను నోట కరుచుకున్న పులి అడవిలోకి లాక్కెళ్లింది. పులి దాడిలో గిరిజన యువకుడు విఘ్నేష్ మృతి చెందగా మరో ఇద్దరు 12లోపు పిల్లలు నవీన్, శ్రీకాంత్ పులి నుంచి దూరంగా పరుగులు తీసి ప్రాణాలను దక్కించుకున్నారు. అనంతరం జిల్లా అటవీశాఖ అధికారి శాంతారాం, కాగజ్‌నగర్ డీఎఫ్‌వో విజయ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దివిడ గ్రామాన్ని నేడు ఎస్పీ సత్యనారాయణ సందర్శించారు. మరోవైపు పెద్ద పులిని అదుపులోకి తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ క్రమంలో నేడు పులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు బోను ఏర్పాటు చేయనున్నారు. చదవండి: పులి దాడిలో యువకుడి మృతి ఇదిలా ఉండగా పెద్ద పులి దాడిలో మరణించిన విఘ్నేశ్ కుటుంబానికి ప్రభుత్వం 15లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు హరీష్ రావు డిమాండ్ చేశారు. దిగిడాలో పెద్ద పులి దాడిలో మరణించిన విఘ్నేష్ కుటుంబాన్ని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పరామర్శించారు. కాగా ఇప్పటి వరకు అదిలాబాద్‌లోని పలు మండలాల్లో గొర్రెలు, మేకలు వంటి పశువులపై పెద్ద పులు దాడి చేశాయి గానీ.. ఇప్పటి వరకు మనుషులపై దాడి చేసిన ఘటనలు అరుదు. అయితే మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి ప్రాణహిత నది దాడి పులులు వస్తుండటంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కాగా మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా తడోబా అందేరీ అభయారణ్యంలో 160 పులులు ఉండగా.. ఈ ఏడాది పులుల దాడిలో ఇప్పటి వరకు 20 మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. తరుచూ పులులు దాడి చేస్తున్న క్రమంలో 50 పులులను ఇతర ప్రాంతాల్లోకి తరలించేందుకు మహారాష్ట్ర అటవీశాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. తడొబా అభయారణ్యంలో ఆవాసాలు ఇరుకుగా మారడంతో తెలంగాణలోకి పులు అడుగు పెడుతున్నట్టు సమాచారం. తెలంగాణలోని కవ్వాల్ టైగర్ జోన్ విస్తరించి ఉన్న ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్ అటవీ ప్రాంతాలు, ప్రాణహిత నదీ పరివాహక ప్రాంతాలు, బెల్లంపల్లి ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల ప్రాంతాల్లో సైతం పులుల సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. గూడెం గ్రామానికి మహారాష్ట్ర బార్డర్ ఒకటే కిలోమీటర్ దూరంలో ఉండగా, ప్రాణహిత నదీ పరివాహక ప్రాంతం బార్డర్ 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. తాజాగా గిరిజన యువకుని మృతితో గిరిజనులు జనాల భయాందోళనకు గురవుతున్నారు. -
పులి పయనం ఎందాక?
సాక్షి, జ్యోతినగర్(రామగుండం): పక్షం రోజులుగా జిల్లాలో తిరుగుతున్న పులి అనువైన ఆవాసం దొరకక ప్రయాణం కొనసాగిస్తోంది. జిల్లాలో రోజుకో ప్రాంతంలో అడుగులు దర్శనమిస్తున్నాయి. స్థానికుల సమాచారంతో అడుగులు కనిపించిన ప్రాంతానికి అటవీశాఖ అధికారులు చేరుకుని పులివే అని నిర్ధారించి వదిలేస్తున్నారు. పులిని పట్టుకుని తరలించే ప్రయత్నంకానీ, అనువైన ఆవాసం కల్పించే ప్రయత్నంకానీ, జిల్లా దాటించే ప్రయత్నం కానీ చేయడం లేదు. దీంతో ప్రజలు ఏరోజు ఎక్కడ పులిని చూడాల్సి వస్తుందో.. ఎవరిపై దాడిచేస్తుందో అని ఆందోళన చెందుతున్నారు. ఆరు మండలాల్లో సంచారం.. ఈనెల 7వ తేదీన ముత్తారం మండలం ఓడేడు శివారులో భూపాల పల్లి జిల్లా నుంచి పెద్దపల్లి జిల్లాలోకి ప్రవేశించింది. అప్పటి నుంచి ప్రయాణం నిరంతరం కొనసాగిస్తోంది. ముత్తారం, రామగిరి, కమాన్‌పూర్, పెద్దపల్లి, పాలకుర్తి మండలాల మీదుగా, రామగుండం మండలం ఎన్టీపీసీ రిజర్వాయర్ వరకు సాగింది. అయితే ముత్తారం మండలం మచ్చుపేట శివారులోని బగుళ్ల గుట్ట అడవుల్లో ఆవుల మందపై దాడిచేసిన సమయంలో మాత్రమే పెద్దపులి పశువుల యజమానికి కనిపించింది. గురువారం రాత్రి 10 గంటల సమయంలో మంథని–పెద్దపల్లి రహదారి మీదుగా కారులో వెళ్తున్న యువకులు పులి రోడ్డు దాటుతుండగా చూశామని చెబుతున్నారు. ఈరెండేసార్లు మినహా ఎక్కడా ఎవరికీ పులి కనిపించలేదు. బగుళ్ల గుట్టవద్ద మినహా ఎక్కడా పశువులకు, మనుశులకు ఎలాంటి హాని తలపెట్టకుండా తన ప్రయాణం కొనసాగిస్తోంది. ఎన్టీపీసీ రిజర్వాయర్ సమీపంలో పాద ముద్రలు ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు రిజర్వాయర్ సమీపప్రాంతంలో పులి సంచరించినట్లు అటవీ అధికారులు తెలిపారు. పుట్నూరు ప్రాంతంలో నుంచి పులి శనివారం తెల్లవారుజామున బుగ్గ గుట్ట మీదుగా భామ్లా నాయక్ తండా గుండా ఎన్టీపీసీ రిజర్వాయర్ అటవి ప్రాంతానికి చేరుకుందని పేర్కొన్నారు. అక్కడి నుంచి మళ్లీ ఇంధన నిల్వల కేంద్రం, గాడిదల గండి వైపు వెళ్లిందని అడుగుల ఆధారంగా గుర్తించామని అటవీ శాఖ సెక్షన్ అధికారి రహ్మతుల్లా, బీట్ అధికారులు నరేశ్, రమేశ్ వివరించారు. వీరితోపాటు భీమ్లా నాయక్ తండా సర్పంచ్ రాజు నాయక్ కూడా ఉన్నారు. రాజీవ్ రహదారి ఎలా దాటింది..? పులి పుట్నూరు నుంచి బుగ్గ గుట్ట మీదుగా ఎన్టీపీసీ రిజర్వాయర్‌కు చేరుకునే క్రమంలో నిత్యం రద్దీగా ఉండే రాజీవ్ రహదారిని దాటాలి. రోడ్డు దాటే క్రమంలో ఎవరికీ కనిపించకపోవడం ప్రశ్నగా మారింది. పులి సంచరించినట్లు తెలు పుతున్న అధికారులు పులి ఏ వైపుకు వెళుతుందో.. అటవీ ప్రాంతం వివరాలు అధికారులకు తెలిసినా రాత్రి సమయంలో కాపు కాయకపోవడంతోనే పులి సంచారాన్ని కనుక్కోలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవేళ పులి బుగ్గ గుట్ట నుంచి రైల్వే అండర్ బ్రిడ్జి నుంచి వెళ్లిందా అనే విషయాలపై కూడా పూర్తి స్పష్టత కనిపించడం లేదు. రెండేళ్ల క్రితం కూడా పులి సంచారం.. ఎన్టీపీసీ రిజర్వాయర్ సమీప అటవీ ప్రాంతంలోకి 2018, జూన్‌లో రెండు పులులు సంచిరించినట్లు అధికారులు ధ్రువీకరించారు. రెండు పులులలో ఒకటి చిన్నది, మరొకటి పెద్దదిగా ఉన్నాయని పాద ముద్రల ఆధారంగా నిర్ధారించారు. ఆ తర్వాత పులులు ఎటు వెళ్లాయో కూడా పూర్తి సమాచారం లేదు. రెండేళ్ల వచ్చిన చిన్న పులి పెరిగి పెద్ద అయి మళ్లీ ఈ ప్రాంతంలో సంచరిస్తుందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎన్టీపీసీ రిజర్వాయర్ ప్రాంతం పూర్తి రక్షిత ప్రాంతం అందులోకి అనుమతి లేకుండా ఎవరు ప్రవేశించరు. ఈ నేపథ్యంలో ఇక్కడ అనువుగా ఉంటే పులి ఆవాసం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ధర్మారం క్రాస్‌రోడ్డు సమీపంలో.. పాలకుర్తి(రామగుండం): మండల పరిధిలో శుక్రవారం పుట్నూర్ గ్రామంలోని అల్లం రవి పొలంలో పెద్దపులు పాదముద్రలు కనిపించగా, శనివారం ధర్మారం క్రాస్‌రోడ్డు సమీపంలోని ముత్యాల లింగయ్య పొలం వద్ద పాద ముద్రలను బోడగుట్టపల్లి గ్రామస్తులు గుర్తించారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించగా రామగుండం సెక్షన్ అధికారి రహ్మతుల్లా వచ్చి పరిశీలించి పెద్దపులివే అని నిర్ధారించారు. నాగులగుట్ట సమీపంలోని పత్తి చేలల్లో కూడా పులి పాదముద్రలను స్థానికులు గుర్తించారు. బుధవారం కన్నాల గ్రామ శివారులోని నాగుల గుట్ట నుంచి రాఘావాపూర్ రైల్వేస్టేషన్ సమీపంలోని గుప్తా కోల్వాషరీష్ మీదుగా ఎస్సారెస్పీ డి–83 కాలువ వెంబడి పయనించి బుగ్గగుట్టకు చే రుకుని అక్కడి నుంచి ఈసాలతక్కళ్లపల్లి మీదుగా పుట్నూర్ గ్రామ శివారుకు గురువారం రాత్రి చేరి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. శుక్రవారం బుగ్గగుట్ట నుంచి కుందనపల్లి ఐవోసీ ఇంధన నిల్వల కేంద్రాల సమీపం నుంచి ఎన్టీపీసీ రిజర్వాయర్ ప్రాంతానికి వచ్చి ఉంటుందని పేర్కొంటున్నారు. -
అది చిరుత కాదు.. పెద్దపులి!
సాక్షి, మంచిర్యాల(హాజీపూర్): హాజీపూర్ మండలంలోని గుడిపేట–నంనూర్ అటవీ శివారు ప్రాంతంలో గేదెల మందపై చిరుత పులి దాడి చేసి ఓ గేదెను గాయపరచినట్లు ప్రత్యక్ష సాక్షి తెలిపిన వివరాల మేరకు సోమవా రం అటవీ శాఖ అధికారులు అటవీ ప్రాంతంలో విస్తృత తనిఖీలు చేశారు. ఆదివారం గుడిపేట–నంనూర్ అటవీ శివారులోని గేదెల మందపై జరిగిన దాడి ప్రాంతంతో పాటు పరిసర ప్రాంతాల్లో చిరుతపులి అడుగుజాడల కోసం పరిశీలించారు. అయితే అవి చిరుత పులి అడుగులు కాదని.. చిరుత అడుగులు చిన్నవిగా ఉంటాయని లక్సెట్టిపేట అటవీరేంజ్ అధికారి స్వామి తెలిపారు. నాగారం, ర్యాలీ అటవీ ప్రాంతాల్లో దట్టమైన అటవీ ప్రాంతం, గుట్టలు, గుహలు ఉన్నాయని ఈ క్రమంలోనే ఇక్కడ పులి తలదాచుకుంటుందని పేర్కొన్నారు. అడుగుల పరిశీలనలో డెప్యూటీ అటవీ రేంజ్ అధికారి జమీల్ అహ్మద్, ఎఫ్ఎస్ఓ అతావుల్లా, బీట్ అధికారులు రత్నాసింగ్, రాజమణి, తిరుపతి పాల్గొన్నారు. అంతా అప్రమత్తంగా ఉండాలి గుడిపేట, ర్యాలీ, నాగారం అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు ప్రాథమిక సర్వే ప్రకారం స్పష్టంగా తెలుస్తోందని లక్సెట్టిపేట అటవీ రేంజ్ అధికారి నాగవత్ స్వామి తెలిపారు. ఈ క్రమంలో గుడిపేట, నంనూర్ గ్రామ పరిసరాల ప్రజలు, రైతులు జాగ్రత్తగా ఉండాలన్నారు. రైతులు పశువుల్ని మేతకు అటవీ ప్రాంతాలకు వెళ్లకుండా చూడాలని తెలిపారు. పులి దాడిలో మృతి చెందితే పశువైద్యాధికారుల నిర్ధారణ మేరకు సంబంధిత రైతులకు నాలుగు రోజుల్లో నష్టపరిహారం అందేలా చూస్తామన్నారు. పులికి హాని జరగకుండా చూడాలని స్పష్టంగా చేశారు. -
ఆడతోడు కోసమేనా..?
సాక్షి, జన్నారం(మంచిర్యాల) : కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌తో అడవిప్రాంతంలోని వన్యప్రాణులకు స్వేచ్ఛాయుత వాతావరం నెలకొంది. ప్రజలు లాక్‌డౌన్‌తో ఇళ్లకే పరిమితమయ్యా రు. రోడ్లపై రాకపోకలు నిలిచిపోగా అడవి ప్రాంతం ప్రశాంత వాతావరణం నెలకొంది. కవ్వాల్ టైగర్‌జోన్‌లోని జన్నారం అటవి డివిజన్లోని తాళ్లపేట్, జన్నారం, ఇందన్పల్లి అటవి రేంజ్లలోని అడవి ప్రాంతాల్లో అలజడి తగ్గడంతో వన్యప్రాణులు స్వచ్ఛాయుత వాతావరణంలో విహరిస్తున్నాయి. గతంలో దట్టమైన అడవిలో బిక్కుబిక్కుమంటూ ఉండే వన్యప్రాణులు కాస్త ఊరటగా బయటకు వస్తున్నాయి. అడవి వదులకపోయిన స్వచ్ఛగా తిరుగుతున్నా యి. ఈక్రమంలో‘సాక్షి’ గురువారం జన్నా రం అటవిడివిజన్లో అధికారులతో డుగా పర్యటించగా పలుచిత్రాలు కనిపించాయి. పక్షుల సందడి... అడవిలో వన్యప్రాణులే కాకుండా రకరకాల పక్షలు సందడి చేస్తున్నాయి. ఉదయం అడవిలో అడుగుపెడితే పక్షుల కిలకిల రావాలు చెవులకు వింపుగా వినిపిస్తాయి. సుదూర ప్రాంతాల నుంచి రకరకాల పక్షులు కవ్వాల్‌లోని కుంటల వద్ద పర్యటిస్తున్నట్లు అటవిశాఖ అధికారులు చెబుతున్నారు. ఇండియన్ స్పాట్ బిల్డ్ డక్, యూరేషియన్ వైజన్ పక్షి, గార్గానీడక్, కామన్‌టీల్ డక్, ఆసియన్ ఓపెన్‌బిల్, రెడ్ నాపెడ్ ఐపిస్ పక్షి, గ్రేహెరన్ పక్షి, బ్లాక్ వింజ్డ్ స్టిల్ట్ పక్షి, కామన్ స్టాండ్ పైపర్ పక్షి, పీఏడ్ కింగ్ ఫిషర్, క్రేస్టెడ్ ట్రీస్వీఫ్ట్, బ్లాక్ నెక్డ్, వుల్లి నెక్డ్ పక్షులు ఈ కవ్వాల్‌లో విహారిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. రోడ్డును వదిలి అడవుల్లోకి... ప్రతి రోజు అడవి సమీపంలో ప్రధాన రహదారిపై రోడ్డుకు ఇరువైపులా ఉంటూ వాహనదారులు వేసే పండ్లు, వేరుశనగా, మొక్కజొన్న కంకులు తదితర వాటిని కోతులు తింటూ ఉండేవి. అదే విధంగా ఇందన్పల్లి, చింతగూడ, పొనకల్ తదితర గ్రామాల్లో కోతులు అనేకంగా ఇబ్బందులు పెట్టేవి. లాక్డౌన్ కారణంగా వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో కోతులకు ఆహారం కరువైంది. దీంతో కోతులు ఊర్లను వదిలి అడవిబాట పట్టాయి. కోతులు ఒకసారి అడవి రుచి మరిగితే ఇక జనావాసాల్లోకి రావని, ఇది కొంత ఊరట నిచ్చే విషయమని అటవి అధికారులు చెబుతున్నారు. బెల్లంపల్లి: బెల్లంపల్లి చుట్టుపక్కల మండలాల్లో తిరుగుతున్న పులి గ్రామీణులతోపాటు అటవీ శాఖ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. సాధారణంగా పులి ఒక్కచోట ఉండదు. అలాంటిది ఐదురోజులుగా ఒకే ప్రాంతంలో ఉంటూ.. ప్రజల అలికిడి ఉన్నప్పటికీ అదరకుండా తిరుగుతుండడంతో ఇదే ప్రాంతంలో ఆవాసం ఏర్పాటు చేసుకుంటుందా..? లేదా మరో ప్రాంతానికి వెళ్లిపోతుందా అనేది అంతుచిక్కడం లేదు. చెర్లపల్లి శివారులో అడుగుపెట్టగానే ఓ గేదెను హతమార్చిన పులి రోజువారీ కదలికలు అటవీ అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. సూర్యస్తమయం కాకముందే.. దర్జాగా తన స్థావరాన్ని వదిలి బయటకు వస్తోంది. దీంతో పులిని కాపాడుకునేందుకు అటవీ అధికారులు నానాయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో పది సీసీ కెమెరాలు, నాలుగు బేస్‌క్యాంపులు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా గస్తీ కాస్తున్నారు. వేటగాళ్లు విద్యుత్ తీగలు అమర్చకుండా, అటువైపు జనసంచారం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రైతులు పొలాల వద్దకు వెళ్లకుండా కట్టడి చేస్తున్నారు. యవ్వన దశలో పులి.. మహారాష్ట్రలోని తడోబా ప్రాంతం నుంచి వచ్చిన ఈ మగపులి యవ్వన దశలో ఉన్నట్లు తెలుస్తోంది. దీని వయసు నాలుగేళ్ల వరకు ఉంటుందని అటవీశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కండపుష్టి కలిగి.. బలిష్టంగా ఉన్న పులి కదలికలను సీసీ కెమెరాల్లో బంధిస్తున్న అధికారులు.. ఆడతోడు కోసం ఆరాటపడుతున్నట్లు అంచనావేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో నాలుగు పులులు సంచరిస్తున్నాయి. బెల్లంపల్లి పులితో ఆ సంఖ్య ఐదుకు చేరిందని చెబుతున్నారు. వీటన్నింటిలోనూ ఈ పులి వయస్సే తక్కువని పేర్కొంటున్నారు. జోడుకోసం వెంపర్లాడుతున్న ఈ పులి కొద్దిరోజులపాటు ఇదే ప్రాంతంలో ఉంటుందా..? లేక తోడు వెదుక్కుంటూ మరో ప్రాంతానికి వెళ్తుందా.. తేలాల్సి ఉంది. బెంబేలెత్తిస్తున్న బెబ్బులి తాండూర్: మండలంలో పులి హడలెత్తిస్తోంది. బుధవారం రాత్రి గోలేటి వన్ ఇంక్లైన్ గని హోటల్ వెనకాలలోని అటవీ ప్రాంతంలో, రెబ్బెన మండలం కైరిగూడ గ్రామానికి చెందిన కోటేష్‌కు చెందిన ఎద్దును హతమార్చింది. ఆ ప్రాంత ప్రజలు భయందోళనకు గురవుతున్నారు. గోలేటి వన్ ఇంక్లైన్ గని నుంచి బీపీఏ ఓసీ –2 మధ్యలో పులి సంచారం చేస్తున్నట్లు చూపరులు చెబుతుండగా, అర్ధరాత్రి అచ్చులాపూర్ గ్రామ శివారు ప్రాంతంలో పులి గాండ్రింపులు వినిపించినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. రెండు పులులు తిరుగుతున్నాయా.? ఒకే పులినా అనేది అటవీ అధికారులు ఇంకా ఓ అభిప్రాయానికి రాలేకపోతున్నారు. -
రహదారిపై పెద్దపులి కలకలం
సాక్షి, నిజాంసాగర్(జుక్కల్): నాందేడ్–సంగారెడ్డి జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి పెద్దకొడప్గల్, బిచ్కుంద మండలాల పరిధిలోని శాంతాపూర్ గండి పరిసరాల్లో పెద్ద పులి సంచరించింది. నేషనల్ హైవే పై పెట్రోలింగ్ కోసం వెళ్లిన జుక్కల్ పోలీసులకు పెద్దపులి కనిపించడంతో 15 నిమిషాల పాటు వాహనాన్ని రోడ్డుపై నిలిపివేశారు. పెద్దపులి రోడ్డు దాటేంత వరకు పోలీసులు వాహనంలోనే ఉన్నారు. జుక్కల్, బిచ్కుంద, పెద్దకొడప్గల్ మండలాల్లోని అడవుల్లో రాత్రి వేళ ప్రయాణించే ద్విచక్రవాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని జుక్కల్ ఎస్సై ఎండీ. రఫీయోద్దిన్ సూచించారు. జాతీయ రహదారిపై పెద్దపులి సంచరించడంతో ప్రయాణికులు, వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. -
గిరిపల్లెల్లో పులి సంచారం!
నార్నూర్(ఆసిఫాబాద్): వారంరోజులుగా గిరి పల్లెల్లో పులి సంచరిస్తుండడంతో గిరి జనులు భయాందోళనకు గురవుతున్నారు. ఐదురోజుల క్రితం మండలంలోని మల్కుగూడ శివారులో పత్తి ఏరేందుకు వెళ్లిన విజయలక్ష్మి అనే గిరిజన యువతికి పులి కనిపించడంతో తప్పించుకుని ఇంటికి పరుగులు తీసింది. ఈ సంఘటన మరువకముందే ఆదివారం మండలలోని ఎంపల్లి కొలాంగూడ గ్రామ శివారులో పత్తి చేనులోని పత్తి ఏరేందుకు వెళ్లిన గిరిజన మహిళ నీలాబాయితో పాటు మరో ఆరుగురు మహిళలకు పులి కనిపించడంతో ఇళ్లకు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న ఎస్సై విజయ్‌కుమార్ గ్రామానికి చేరుకుని అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. గిరిజనులు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని సూచించారు. పులి సంచరిస్తున్న ప్రాంతాన్ని ఎఫ్ఎస్వో ప్రకాష్ సందర్శించి పులిని చూసిన గిరిజన మహిళల ద్వారా సమాచారం సేకరించారు. పులి ఆనవాళ్లను పరిశీలిస్తున్నామన్నారు. గిరిజనులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అటవీశాఖ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. పులి సంచరిస్తున్న విషయం తెలియడంతో అటవీ ప్రాంతంలో ఉన్న గిరిజనులు కర్రలతో గస్తీ నిర్వహిస్తున్నారు. అటవీశాఖ అధికారులు పులి సంచారంపై ప్రత్యేక నిఘా ఉంచి ప్రాణాలు కాపాడాలని గిరిజనులు కోరుతున్నారు. -
అమ్మో పులి..
సాక్షి, కోటపల్లి(ఆదిలాబాద్) : మండలంలోని ఎదులబంధం అడవుల్లో పులి కదలికలు వెలుగులోకి వచ్చాయి. ఇంతకాలం చెన్నూర్, వేమనపల్లి మండలాల్లోని అడవుల్లో పులి సంచరించగా.. తాజాగా కోటపల్లి మండల కేంద్రం, కోటపల్లి మండలంలోని ఎదులబంధం, లింగన్నపేట అటవీ ప్రాంతంలో పులి కదలికలను గుర్తించారు. పులి సంచారం విషయం తెలియగానే గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈనెల8న మండల కేంద్రానికి చెందిన కాశెట్టి తిరుపతి, రాళ్లబండి శ్యాంసుందర్ అనే వ్యక్తులకు చెందిన గేదెలపై పులి దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డాయి. అయితే గేదెల మంద ఎదురుతిరగడంతో పాటు చెల్లాచెదురై గ్రామాల వైపు పురుగెత్తడంతో పులి వెనుకడుగు వేసిందని పశువుల కాపరులు పేర్కొన్నారు. కాగా ఆదివారం కే4 ఎదులబంధం లింగన్నపేట గ్రామాల సమీపంలో దట్టమైన అటవీప్రాంతం కావడం.. చిన్న చిన్న అడవి జంతువులు ఎక్కువగా ఉండటంతో వాటిని వేటాడుతూ పులి సంచరిస్తున్నట్లు సమాచారం. అయితే మండలంలో ఇప్పటికే కే4, కే6 పులులు ఉండగా తాజాగా ఇంకో పులి వచ్చినట్లు సమాచారం కానీ పులికి రక్షణ దృష్ట్యా అధికారులు ఎవరూ కూడా ఇప్పటివరకు ధ్రువీకరించలేదు. మండలంలో కే4 ఆనవాళ్లు లభ్యమైనా.. అటవీ ప్రాంతంలోని సీసీ కెమెరాల్లో మాత్రం కే6 ఎక్కడా కనిపించలేదు. చెన్నూర్ మండలంలో సంకారం బుద్దారం అటవీ ప్రాంతంలో తిరిగిన పులి ప్రస్తుతం కోటపల్లి మండలంలో సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఎవరైనా పులికి హాని తలపెడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలను హెచ్చరించారు. -
నీలగిరితోటల్లో పులి సంచారం
సాక్షి, బెల్లంపల్లి: బెల్లంపల్లి అటవీ డివిజన్ పరిధి కుశ్నపల్లి రేంజ్లో పులి సంచారిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల నుంచి పులి విస్తారంగా అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఆనవాళ్లు (పాద ముద్రలను) అటవీశాఖకు చెందిన ఫారెస్టు డెవలాప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) అధికారులు గుర్తించారు. ఈ పాదముద్రలతో పులి సంచారం జరుగుతున్నట్లు ప్రస్పుటమైంది. బెల్లంపల్లి నుంచి నెన్నెల మండల కేంద్రానికి వెళ్లే మార్గంలో బొప్పారం గ్రామం ఉంది. ఆ గ్రామ శివారు ప్రాంతంలో అటవీ శాఖకు చెందిన నీలగిరి ఫ్లాంటేషన్‌ను పెంచుతున్నారు. ఆ ఫ్లాంటేషన్ పక్కన కడమడుగుల వాగు ఉంది. ఆ వాగు, నీలగిరి ఫ్లాంటేషన్ మధ్యలో నుంచి అటవీ ప్రాంతం లోనికి వెళ్లడానికి ఓ రహదారి ఉంది. అక్కడి నుంచి దట్టమైన అటవీ ప్రాంతం నెలకొంది. దాదాపు పది కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతాన్ని ఆనుకుని కొన్ని రోజుల నుంచి ఎఫ్డీసీ ఆధ్వర్యంలో అటవీశాఖ పనులు జరుగుతున్నాయి. కూలీలు రోజువారీగా అటవీ ప్రాంతం మధ్యలో నుంచి పనులు జరుగుతున్న స్థలి వరకు రాకపోకలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఆకస్మికంగా పులి అడుగులు దర్శనమిచ్చాయి. ఆ అడుగులను చూసి ఒక్కసారిగా భయపడిన కూలీలు పులి సంచారం జరుగుతున్నట్లు గ్రహించారు. విషయాన్ని వెంటనే ఎఫ్డీసీ బెల్లంపల్లి రేంజ్ ఫ్లాంటేషన్ మేనేజర్ జీ.సురేష్ కుమార్‌కు సమాచారం అందించారు. స్పందించిన సురేష్‌కుమార్ శనివారం ఆ ప్రాంతానికి వెళ్లి పులి పాదముద్రలను పరిశీలించి నిర్ధారించారు. సంచారం చేస్తున్న ఆ పులి కే–4 అయి ఉంటుందని అటవీ శాఖ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దట్టమైన అటవీ ప్రాంతాన్ని ఎంచుకుని.. కుశ్నపల్లి అటవీ రేంజ్ పరిధిలో విస్తారంగా అటవీ సంపద కేంద్రీకృతమైంది. నలువైపుల నాలుగు గ్రామాలు ఉండటంతో ఆ అటవీ ప్రాంతం ఇప్పుడిప్పుడే దట్టంగా విస్తరిస్తోంది. తూర్పున ఘన్పూర్ గ్రామం, పడమర ప్రాంతంలో దుగినేపల్లి, ఉత్తరం వైపు బొప్పారం, దక్షిణం దిశలో జోగాపూర్ గ్రామాలు ఉన్నాయి. ఆ నాలుగు గ్రామాల మధ్యన ఎటుచూసిన వందలాది మైళ్ల దూరం వరకు అటవీ సంపద పెనవేసుకుని ఉంది. ప్రస్తుతం విస్తారంగా కురుస్తున్న వర్షాలతో అటవీ ప్రాంతంలో వృక్షాలు మరింత ఏపుగా ఎదిగి కుమ్ముకుని ఉన్నాయి. ఆ ప్రాంతం సంచారానికి అన్ని విధాలా అనుకూలంగా ఉండటంతో పులి ఆవాసం చేసుకోవడానికి యత్నిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు అభిప్రాయ పడుతున్నారు. గ్రామాల్లో భయం భయం... పులి సంచిరిస్తున్న విషయం వెలుగులోకి రావడంతో సమీప గ్రామాల ప్రజలు తీవ్రంగా భయపడుతున్నారు. అటవీ ప్రాంతానికి వెళ్లడానికి జంకుతున్నారు. ముఖ్యంగా దుగినేపల్లి , పెర్కపల్లి, గుండ్ల సోమారం, బొప్పారం, ఘన్పూర్, జోగాపూర్ తదితర ప్రాంతాల ప్రజలు పులి కంట కనబడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అడవి నుంచి పులి ఏవైపునకు వస్తుందోనని అభద్రతాభావానికి గురవుతున్నారు. పులి అడుగులు కనిపించడంతో అప్రమత్తమైన అటవీ అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. ముఖ్యంగా వన్యప్రాణుల వధ కోసం సంచరిస్తున్న వేటగాళ్లు ఎక్కడా అటవీ ప్రాంతంలో విద్యుత్ తీగలతో ఉచ్చులు బిగించకుండా నివారణ చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. కారిడార్ కోసమేనా..? అటవీ ప్రాంతాన్నీ కారిడార్‌గా మల్చుకోవడానికి పులి తీవ్రంగా తాపత్రయ పడుతున్నట్లు తెలుస్తోంది. వేమనపల్లి మండలంలోని అటవీ ప్రాంతంలో కొన్నాళ్లుగా సంచరించిన పులి ఆ తర్వాత కోటపల్లి మండలంలోనూ కాలు కదిపింది. ఆ పిమ్మట క్రమంగా నెన్నెల మండలంలో అడుగుపెట్టింది. ఆయా ప్రాంతాలన్నీ కూడా కల గలిసి ఉండటం, అటవీ ప్రాంతం దట్టంగా విస్తరించడంతో కారిడార్ ఏర్పాటుకు పులి పాకులాడుతున్నట్లు తెలుస్తోంది. సరిగ్గా ఏడాది క్రితం బెల్లంపల్లి మండలం గుండ్ల సోమారం గ్రామ పొలిమేరల్లో నుంచి పులి సంచారం చేసినట్లు వదంతులు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తదుపరి మూడు నెలల క్రితం నెన్నెల అటవీ ప్రాంతంలో సంచరించిన పులి తాజాగా మరోమారు అడుగులతో ఉనికిని చాటుకుంది. ఆవాసం కోసం అనువైన ప్రాంతాన్నీ ఎంచుకోవడానికి పులి వేట సాగిస్తున్నట్లు అటవీ అధికారులు అనుమానిస్తున్నారు. -
కడెం డివిజన్లో పులి సంచారంపై అప్రమత్తం
సాక్షి, జన్నారం(ఖానాపూర్): కడెం డివిజన్లోని పాడ్వాపూర్ బీట్ ప్రాంతంలో పులి సంచారం నేపథ్యంలో కవ్వాల్ టైగర్‌జోన్ పరిధిలోని జన్నారం అటవీ డివిజన్ అధికారులు అప్రమత్తం అయ్యారు. పాడ్వాపూర్ బీట్ పరిధిలోని గంగాపూర్ ప్రాంతం, ఇస్లాంపూర్ అడవి నుంచి కవ్వాల్ సెక్షన్లో పులి పర్యటించే అవకాశం ఉంది. దీంతో ఆదివారం ఇందన్పల్లి రేంజ్ అధికారి శ్రీనివాసరావు అధ్వర్యంలో అధికారులు కవ్వాల్ టైగర్‌జోన్ పరిధిలోని కవ్వాల్ సెక్షన్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. పులి అడుగులు, ఇతర గుర్తింపులు ఏమైనా ఉన్నాయా అని పరిశీలించారు. అటవీ ప్రాంతంలో రహదారులు, వాగులు, ఇతర ప్రాంతాల్లో అధికారులు పులి అడుగుల కోసం అన్వేషించారు. ఎక్కడా అడుగులు కనిపించలేదు. గంగాపూర్ మీదుగా కవ్వాల్కు వచ్చే అవకాశం ఉన్నందున ముందస్తుగా ఎలాంటి అలజడి లేకుండా, పశువులు రాకుండా జాగ్రత్తలు వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పులి కవ్వాల్ సెక్షన్లో ప్రవేశిస్తే ఇక్కడి సౌకర్యాల దృష్ట్యా తిరిగి వెళ్లే పరిస్థితి ఉండదనే ఆశాభావం అధికారులు వ్యక్తం చేస్తున్నారు. కవ్వాల్ అభయారణ్యాన్ని 2012 జనవరి 10న కేంద్ర ప్రభుత్వం టైగర్‌జోన్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి అసెంబ్లీ స్పీకర్ మనోహర్ కవ్వాల్ అభయారణ్యంలో పర్యటించి ఆయన చేసిన సూచన మేరకు 49వ టైగర్‌జోన్‌గా ఏర్పాటు చేశారు. టైగర్‌జోన్ ఏర్పాటు నుంచి పులి రాక కోసం అధికారులు అన్నిరాకాలుగా ప్రయత్నాలు చేసినా ఫలితం రాలేదు. మూడేళ్ల క్రితం కొన్ని రోజులు రాకపోకలు కొనసాగించింది. ఈ క్రమంలో హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ సభ్యులు, అటవీశాఖ అధికారులు పులికి రక్షణ కల్పించారు. కొంత అలజడి వల్ల వచ్చిన పులి మూడు సంవత్సరాలుగా కనిపించకుండా పోయింది. ఎట్టకేలకు ఈ నెల 15 న కడెం రేంజ్ పరిధిలోని పాడ్వాపూర్ బీట్, గంగాపూర్ పరిధిలో బేస్‌క్యాంపు సిబ్బందికి పులి కనిపించింది. వారు అప్రమత్తమై ఉన్నత అధికారులకు తెలియజేయడంతో కెమరాలు అమర్చడం వల్ల పులి కెమెరాకు చిక్కింది. దీంతో అధికారుల అనుమానం నిజమైంది. అడుగుల సేకరణలో సిబ్బంది కవ్వాల్ అభయారణ్యం పరిధిలో ఇటీవలే పెద్ద పులి కనిపించడంతో అధికారులు వాటి సంఖ్యను క్షేత్రస్థాయిలో గుర్తించేందుకు ఆదివారం అడుగుల సేకరణ నిర్వహించారు. శనివారం కడెం ఆటవీ రేంజ్ ఫరిధిలోని పాండ్వపూర్, బీట్ల ఫరిధిలో అటవీ అధికారులు ఏర్పాటు చేసిన కెమెరాల్లో పెద్ద పులి కనిపించడంతో అంతకుముందు దాని పాదలు గుర్తించిన అధికారులు వాటి సంఖ్యను గుర్తించేందుకు ఆదివారం అడుగుల సేకరణ పనిలో ఉన్నారు. కడెం రేంజ్ ఫరిధిలోని పాండ్వపూర్ బీట్లతోపాటు ఇతర బీట్లలో వాటి అనవాళ్లు ఉన్నాయా అనే కోణంలో పరిశీలించారు. అధికారులు బృందాలుగా ఏర్పడి వాటిని గుర్తించే పనిలో ఉన్నారు. ఆదివారం హైదరాబాద్ అటవీ శిక్షణ ఎఫ్ఆర్ఓలు శిక్షణకు రావడంతో ఈ ప్రాం తం, జంతువుల వివరాలను అటవీ అధికారులు తెలియజేశారు. ఎఫ్ఆర్వో రమేశ్ రాథోడ్, ఎఫ్‌ఎస్‌ఓలు ప్రభాకర్, మమత పాల్గొన్నారు. -
బెజ్జూర్ అడవుల్లో పులి సంచారం
బెజ్జూర్: కుమ్రం భీం జిల్లా బెజ్జూర్ మండలం గుండపెల్లి అటవీ ప్రాంతాల్లో ప్రధాన రోడ్డుపై కెమెరాకు పులి చిక్కింది. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు పులి జాడను తెలుసుకోవడానికి ప్రత్యేక నిఘా కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రధాన నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో కెమెరాలు ఏర్పాటు చేయడంతో గత జనవరి నెల 29న బెజ్జూర్ అటవీ ప్రాంతంలోని చిన్నసిద్ధాపూర్ శివారు ప్రాంతంలోని స్ప్రింగ్ ఆనకట్ట వద్ద నిఘా కెమెరాకు పెద్ద పులి నీరు తాగుతూ కనిపించింది. అదే నెల 30వ తేదీ సాయంత్రం స్ప్రింగ్ ఆనకట్ట ప్రాంతంలో మరో పులి కెమెరాకు చిక్కింది. దీంతో బెజ్జూర్ అడవుల్లో పెద్ద పులుల సంచారం ఎక్కువైంది. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న పులులను వేటగాళ్ల బారిన పడకుండా వాటిని రక్షించాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు. -
అమ్మో పులి.. వచ్చెను మళ్లీ
* భిక్కనూరులో చిరుత సంచారం * భయాందోళనల్లో ప్రజలు భిక్కనూరు : నియోజకవర్గ ప్రజలను కొంతకాలంగా చిరుత పులి భయపెడుతూనే ఉంది. ఏదో ఒక ప్రాంతంలో పులి సంచారం కనిపిస్తుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మండల కేంద్రంలోని ఎల్లాడి చెరువు సమీపంలో ఉన్న అవ్వగారి మామిండ్ల వద్ద శనివారం వేకువ జామున చిరుతపులి కనిపించిందని రైతులు గూడూరి తిరుపతి, శ్రీకాంత్ పేర్కొన్నారు. వేకువజామున పొలం వద్దకు వెళ్లామని, దూరంలో చిరుత కనిపించడంతో పరుగెత్తుకుంటూ వచ్చేశామని తెలిపారు. అనంతరం ఈ విషయాన్ని సర్పంచ్ నర్సింహారెడ్డికి తెలిపారు. ఆయన ఫారెస్టు అధికారులకు సమచారం అందించారు. ఫారెస్టు సెక్షన్ అధికారులు వే ణు, భీంరెడ్డి, బీట్ అధికారులు ఫారూఖ్, బాబు తదితరులు సంఘటన స్థలానికి వచ్చారు. రైతుల నుంచి వివరాలు సేకరించారు. పులి అడుగు జాడల కోసం వెతికారు. సెక్షన్ అధికారులు వేణు, భీంరెడ్డి మాట్లాడుతూ రైతులు ఒంటరిగా పొలాల వద్దకు వెళ్లవద్దన్నారు. ఇద్దరు ముగ్గురు రైతులు కలిసి, చేతిలో కర్రలు ధరించి చప్పుడు చేస్తూ పొలాలవద్దకు వెళ్లాలని సూచించారు. భిక్కనూరులో పులి కనిపించిందన్న సమాచారం తెలుసుకున్న లక్ష్మీదేవునిపల్లి, భిక్కనూరు గ్రామాలకు చెందిన ప్రజలు అవ్వగారి మామిండ్ల వద్దకు భారీగా తరలివచ్చారు. పులి సంచరించిన చోటును పరిశీలించారు.