బషీరాబాద్ : అత్యాచార బాధితురాలికి న్యాయం చేయాలని దళిత స్త్రీ శక్తి న్యాయవాది భాగ్యలక్ష్మి, మానవ హక్కుల పరిరక్షణ బృందం సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. గురువారం వారు మండల పరిధిలోని మంతన్‌గౌడ్ తండాను సందర్శించి బాధితురాలి(13)తో మాట్లాడి వివరాలు సేకరించారు. ఇటీవల బాలికపై జీవన్గి గ్రామానికి చెందిన ఓ యువకుడు అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. వారు బాలిక కుటుంబీకులతో పాటు స్థానికులతో మాట్లాడి ఘటనపై ఆరా తీశారు. బాలిక శారీరకంగా, మానసికంగా బలహీనంగా ఉండడంతో ఆవేదన వ్యక్తం చేశారు.
ఘటనను అధికారులు తీవ్రంగా పరిగణించి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకొని బాధితురాలికి సత్వరమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా చైతన్యవేదిక జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి పండిత్, మానవ హక్కుల పరిరక్షణ సంఘం సభ్యులు అనిత, తాండూరు మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఆరీఫాబేగం ఉన్నారు.
బాధితురాలికి న్యాయం చేయాలి
Published Fri, Jul 17 2015 1:13 AM | Last Updated on Sat, Jul 28 2018 8:43 PM
Advertisement
Advertisement