- రైతుకు భరోసా కల్పించే లక్ష్యంగా
- కామారెడ్డికి నేడు పొంగులేటి శీనన్న
- రైతు దీక్షను స్వాగతిస్తున్న జిల్లా ప్రజలు
- వైఎస్‌ఆర్‌సీపీ పోరుకు జనం మద్దతు
- స్వచ్ఛందంగా తరలి రానున్న అన్నదాతలు
- అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన పార్టీ శ్రేణులు
కామారెడ్డి: వైఎస్‌ఆర్ సీపీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం చేపట్టే ఒక్కరోజు రైతుదీక్షకు కామారెడ్డి ముస్తాబైంది. రైతు సమస్యలపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జరుపతలపెట్టిన రైతు దీక్షకు సర్వం సిద్ధమైంది. కామారె డ్డి పట్టణంలోని సీఎస్‌ఐ గ్రౌండ్స్ వేదికగా రైతు దీక్ష చేపట్టనున్నారు. ఆదివారం ఉద యం 10 గంటల నుంచి సాయంత్రం వరకు దీక్ష కొనసాగనుంది. ఈ దీక్షకు వైఎస్‌ఆర్ సీపీ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల ముఖ్యనేతలు తరలి రానున్నారు.
కాగా, రైతుల సమస్యలపై చేపట్టిన దీక్షకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా రైతులు పెద్ద ఎత్తున తరలిరావడానికి సన్నద్ధమ య్యారు. వైఎస్‌ఆర్ సీపీ నేతలు ఊరూరా తిరుగుతూ, రైతుల పక్షాన పార్టీ చేస్తున్న పోరాటాన్ని వివరిస్తూ మద్దతు కోరుతున్నారు. రైతులు సంసిద్ధమై మీ వెంట నడు స్తామంటూ ముందుకు వస్తున్నారు. దీంతో ఆ పార్టీ నేతల్లో ఉత్సాహం వ్యక్తమవుతోంది. రైతుదీక్ష వేదిక వద్ద వేలాది మంది రైతులు కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు.
దీక్షను స్వాగతిస్తున్న రైతులు
దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో ప్రజల మద్దతు రోజు రోజుకు పెరుగుతోంది. రైతు బాంధవుడిగా పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న వైఎస్‌ఆర్ పేరును ఇప్పటికీ జిల్లా ప్రజలు జపిస్తున్నారు.ఆయన ఆశయాల సాధ న, ప్రజలకు అండగా నిలవడమే లక్ష్యంగా వైఎస్‌ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అనేక ప్రజాఉద్యమాలు నిర్వహించారు. ఇదే సమయంలో ఆరుగాలం శ్రమిం చినా గిట్టుబాటు ధర లభించక అప్పుల ఊబిలోకి కూరుకుపోయిన రైతులకు ‘నేనున్నాను..’ అంటూ 2012 జనవరిలో 10, 11, 12 తేదీలలో మూడు రోజుల పాటు జిల్లాలో రైతుదీక్ష నిర్వహించిన రైతులకు భరోసా కల్పించారు. మరోసారి తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డిలో ఆదివా రం రైతుదీక్ష చేయడం రైతువర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా రైతు సంక్షేమాన్ని విస్మరించిన తరుణంలో వైఎస్‌ఆర్ సీపీ రైతుదీక్ష లు చేపట్టడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు భరోసా ఇచ్చేందుకు శీనన్న చేపట్టిన రైతుదీక్షను జిల్లా ప్రజలు స్వాగతిస్తున్నారు.
‘పొంగులేటి’ పర్యటన సాగేది ఇలా
వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం ఉదయం కామారెడ్డి పట్టణానికి చేరుకుని నిజాంసాగర్‌చౌరస్తాలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేస్తారని పార్టీ జిల్లా అధ్యక్షుడు సిద్దార్థరెడ్డి తెలిపారు. అక్కడ మహిళలు మంగళహారతులతో స్వాగతం పలుకుతారని, వేలాది మంది రైతులు పాల్గొంటా రని పేర్కొన్నారు. యువకులు బైకులపై ర్యాలీ నిర్వహిస్తారని, అక్కడి నుంచి సీఎస్‌ఐ గ్రౌండ్ వేదికగా రైతు దీక్ష ప్రారంభమవుతుందని చెప్పారు. గ్రా మాల నుంచి పెద్ద ఎత్తున రైతులు తరలివస్తారని పేర్కొన్నారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టే రైతుదీక్షలో రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొననుండగా. దీక్షకు హాజరయ్యే రైతులకు కోసం సభాస్థలి వద్ద ఏర్పాట్లు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
నేడే దీక్ష
Published Sun, May 10 2015 2:19 AM | Last Updated on Fri, Mar 22 2019 6:25 PM
Advertisement
Advertisement