సంగారెడ్డి క్రైం : ఆ.. ఒక్క క్షణం ఆలోచిస్తే భవిష్యత్ అంతా బంగారు మయ మే.. కానీ క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు వారి బతుకులను బుగ్గిపాలు చేస్తున్నాయి. విద్యార్థి టెన్త్ పరీ క్షలో తప్పిందనో.. భర్త భార్యను తిట్టాడనో.. భార్య కాపురానికి రాలేదనో.. తెలిసీ తెలియని వయస్సులో ప్రేమ విఫలమైందనో.. యువత జల్సాలకు డబ్బులు ఇవ్వలేదనో.. ఇ లా అనేక కారణాల వల్ల ప్రతి ఏడాది వందల సంఖ్యలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
కాగా కుటుంబ తగాదాలు, ఆర్థిక ఇబ్బందులే ఎక్కువగా ఆత్మహత్యలకు ఎక్కువ కారణాలవుతున్నట్లు తెలుస్తోంది. ఒక్క క్షణం ఆలోచించి ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు తెలుసుకుని వాటి పరిష్కార మార్గాలను వెతుక్కుంటే భవిష్యత్ అంతా బంగారు భవితగానే ఉంటుందన్న విషయం తెలుసుకోవాలి. ఇదిలా ఉంటే 2012 సంవత్సరంలో 321 మంది పురుషులు, 125 మంది మహిళలు వివిధ కారణాల వల్ల ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 2013లో 417 మంది పురుషులు, 133 మంది మహిళలు, 2014 ఆగస్టు నెల వరకు 221 మంది పురుషులు, 59 మంది మహిళలు ఆత్మహత్యలకు పాల్పడిన వారిలో ఉన్నారు.
చట్టం ఏం చెబుతోంది..
చట్టప్రకారం ఆత్మహత్యకు పాల్పడ డం, ఆత్మహత్యకు యత్నించడం, అందుకు ప్రోత్సహించడం నేరం. భారతీయ శిక్షా స్మృతి విభాగంలో 309 ద్వారా ఆత్మహత్యకు ప్రయత్నిం చిన వారికి ఏడాది సాధారణ శిక్షతో పాటు జరిమానా విధించబడుతుం ది. ఈ కేసు ప్రథమ శ్రేణి న్యాయాధిపతి న్యాయస్థానంలో విచారింప బడుతుంది. ఆత్మహ త్యాయత్నానికి పాల్పడితే ఏ న్యాయవాది కూడా వాదించబోరు.
అంతేగాక బెయిల్ కూడా మంజూరు కాదు. రాజీ కూడా కుదుర్చుకోవడానికి అవకాశం లేనిది. ఆత్మహత్యకు ప్రోత్సహించే వారికి విభాగం 306 ప్రకారం పదేళ్ల కఠిన కారాగార శిక్ష, జరిమానా విధించడం జరుగుతుంది. ఈ కేసు విచారణ సెషన్స్ కోర్టులో జరుగుతుంది. ఈ కేసు రాజీ కుదుర్చుకోవడానికి అవకాశం లేకపోవడంతో పాటు నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ అయ్యేందుకు అవకాశం ఉంది.
నేడు ఆత్మహత్యల నివారణ దినం
Published Tue, Sep 9 2014 11:45 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement