స్వైన్‌ఫ్లూపై టోల్ ఫ్రీ నంబర్ | Toll-free number to States | Sakshi
Sakshi News home page

స్వైన్‌ఫ్లూపై టోల్ ఫ్రీ నంబర్

Published Fri, Jan 23 2015 1:49 AM | Last Updated on Thu, Mar 21 2019 8:22 PM

స్వైన్‌ఫ్లూపై టోల్ ఫ్రీ నంబర్ - Sakshi

స్వైన్‌ఫ్లూపై టోల్ ఫ్రీ నంబర్

18004250095

అందుబాటులో మందులు, వైద్య సేవలు
{పత్యేక గ్రామ సభల నిర్వహణకు ఆదేశం
15 రోజులపాటు వైద్య శాఖలో సెలవుల రద్దు
సమీక్షలో ప్రత్యేక అధికారి బీపీ.ఆచార్య,
కలెక్టర్ కరుణ

 
హన్మకొండ అర్బన్ : ప్రజలను వణికిస్తున్న స్వైన్‌ఫ్లూపై జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. జిల్లాలో స్వైన్‌ఫ్లూ ప్రభావం ఇప్పటివరకు లేనప్పటికీ.. అన్నిరకాలుగా ముందస్తు చర్యలు చే పట్టింది. జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలు, యూహెచ్‌సీలలో మం దులను అందుబాటులో ఉంచారు. జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య, అవగాహన కార్యక్రమాల కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. జిల్లాలోని వైద్య శాఖ అధికారులకు 15 రోజులపాటు సెలవులను రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ వా కాటి కరుణ ప్రకటించారు. వైద్యాధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి అవసరమైన వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. అదేవిధంగా స్వైన్‌ఫ్లూపై ప్రజల సందేహాలను నివృత్తి చేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కం ట్రోల్ రూం ఏర్పాటుచేసి 18004250095 టోల్ ఫ్రీ నంబర్ కే టారుుంచారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గురువారం దీ న్ని ప్రారంభించారు. స్వైన్‌ఫ్లూ సహాయక చర్యలకు జిల్లాకు ప్రత్యేకంగా నోడల్ అధికారిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సీనియర్ ఐఏఎస్ అధికారి, రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బీపీ ఆచార్య, కలెక్టర్ వాకాటి కరుణ గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్య శాఖ, ఇతర ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు.

స్వైన్‌ఫ్లూ నివారణకు చేపడుతున్న చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భం గా బీపీ ఆచార్య మాట్లాడుతూ జిల్లాలో స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఇప్పటివరకు గుర్తించనప్పటికీ... యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలకు ప్రభుత్వం ఉందన్న భరోసా కల్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. స్వైన్‌ఫ్లూ బారిన పడకుండా ప్రజలు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై అవగాహన కల్పించేందుకు కరపత్రా లు, ఇతర ప్రచార సాధనాల ద్వారా విసృ్తత ప్రచారం చేయాలని ఆదేశించారు. బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లలో సహాయక కేంద్రాలు ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా పారిశుద్ధ్య కార్యక్రమాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఆరోగ్య శాఖతోపాటు అందుబాటులో ఉన్న అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

గ్రామ సభల ద్వారా అవగాహన : కలెక్టర్ కరుణ

జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పిం చేందుకు అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ వాకాటి కరుణ ఆదేశించారు. సభల్లో స్వైన్‌ఫ్లూ వ్యాధి ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలు, పారిశుద్ధ్య కార్యక్రమాలపై ప్రజల్లో విసృ్తత అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలు, అర్బన్ హెల్త్ కేంద్రాల్లో స్వైన్‌ఫ్లూ మందులు అందుబాటులో ఉన్నాయన్న విషయూన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు. ఎంజీఎం ఆస్పత్రిలో 30 పడకలతో స్వైన్‌ఫ్లూ ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశామని, మహిళలకు 15, పురుషులకు 15 పడకలు అందుబాటులో ఉన్నాయని తెలి పారు. లక్ష కర పత్రాలు, గోడప్రతులు అందుబాటులో ఉన్నాయని, వాటిని ప్రచారానికి వినియోగించుకోవాలని సూచిం చారు. ఎంజీఎం సూపరింటెండెంట్ మనోహర్ మాట్లాడుతూ ప్రజలు దగ్గు, జలుబు, జ్వరం, తలనొప్పి వంటివి ఐదు రోజులకు మించి ఉన్నట్లయితే వెంటనే స్థానిక వైద్యులను సంప్రదించాలని, స్వైన్‌ఫ్లూకు మందులతోపాటు పూర్తి స్థాయి వైద్యసేవలు జిల్లాలో అందుబాటులో ఉన్నాయన్నారు. ఏజేసీ కృష్ణారెడ్డి, ఆర్డీ నాగేశ్వర్‌రావు, ఆర్‌ఎంఓ దయానందస్వామి, డీఐఓ జయప్రకాశ్ , డాక్లర్లు వ్యాకరణ నాగేశ్వర్‌రావు, రోసలిన్, నాగరాజు, స్వరూప పాల్గొన్నారు. కాగా, సమావేశంలో వాల్‌రైటింగ్ పోస్టర్లను ఆవిష్కరించారు.

స్వైన్‌ప్లూ వార్డులో ఆచార్య పరిశీలన
 
ఎంజీఎం : వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో స్వైన్ ప్లూ బాధితుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డును స్వైన్‌ఫ్ల్లూ జిల్లా ప్రత్యేకాధికారి ఆచార్య, కలెక్టర్ కరుణ గురువారం పరిశీలించారు. ఆస్పత్రిలో 15 పడకలతో కూడిన రెండు గదులను స్వైన్‌ ఫ్లూ బాధితులకు కేటాయించామని ఎంజీఎం సూపరింటెండెం ట్ మనోహర్ వారికి వివరించారు. మెడిసిన్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ నేతృత్వంతో సిబ్బంది స్వైన్‌ప్లూ బాధితులకు సేవలందిం చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ సందర్భంగా ప్రత్యేకాధికారి ఆచార్య మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు ఒక్క కేసు నమోదు కాలేదన్నారు. స్వైన్‌ప్లూ బాధితులకు చికిత్స అందించేందుకు పూర్తిస్థారుులో మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. కేఎంసీ ప్రిన్సిపాల్ రమేశ్‌కుమార్, ఆర్డీ నాగేశ్వర్‌రావు, ఇన్‌చార్జ్ డీఎంహెచ్‌ఓ శ్రీరాం, పిడియాట్రిక్ హెచ్‌ఓడీ బలరాం, ఆర్‌ఎంఓ హేమంత్, డాక్టర్ సురేందర్ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement