రైతులందరి రుణాలు రద్దు చేయాలి | total Farmers loans to be canceled | Sakshi
Sakshi News home page

రైతులందరి రుణాలు రద్దు చేయాలి

Published Sat, Jun 7 2014 3:27 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

రైతులందరి రుణాలు రద్దు చేయాలి - Sakshi

రైతులందరి రుణాలు రద్దు చేయాలి

ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు

అశ్వారావుపేట, న్యూస్‌లైన్: బ్యాంకుల్లో వ్యవసాయ రుణాలు తీసుకున్న రైతులందరి అప్పులను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. శుక్రవారం అశ్వారావుపేటలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. అందరి రుణాలు రద్దు చేస్తామని ఎన్నికలకు ముందు హామీనిచ్చిన టీఆర్‌ఎస్ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కొత్తగా నిబంధనలు పెట్టడం సరికాదని అన్నారు.

తమ రుణాలన్నీ మాఫీ అవుతాయని రైతులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారని, కేసీఆర్ రుణమాఫీకి కొర్రీలు పెట్టడం పద్ధతి కాదని విమర్శించారు. అర్హులందరి రుణాలు రద్దు చేయాలని వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో పోరాడుతామని, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని అన్నార. సమావేశంలో వైఎస్‌ఆర్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు, ఎంపీటీసీ కొల్లు వెంకటరమణ, నాయకులు అల్లాడి వెంకటరామారావు, రాయి రవీందర్ ఉన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement