సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో లైట్ క్రాఫ్ట్ ఫౌండేషన్ సహకారంతో జాతీయ బతుకమ్మ ఫొటోగ్రఫీ పోటీలు జరగనున్నాయి. ‘మహిళలు-పూలు’ అనే ఇతివృత్తంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 16 నుంచి 31 వరకు ఈ పోటీలుంటాయని తెలిపింది. ఫొటోగ్రాఫర్లు వారి ఫొటోలను www.bathukamma photo.com, bathukammaphoto@gmail.com కు పంపించాలని పేర్కొంది.
ఈ నెల 31లోగా ఎంట్రీ చేసుకోవాలని సూచించింది. వివరాలకు 99633 71314 నంబర్‌ను సంప్రదించాలని పేర్కొంది. మొదటి బహుమతి కింద రూ.1.5 లక్షలు, రెండో బహుమతిగా రూ.75 వేలు, మూడో బహుమతిగా రూ.50 వేలు, కన్సోలేషన్ బహుమతిగా రూ.25 వేలు అందజేస్తామన్నారు.