
పర్యాటక అభివృద్ధికి కృషి: కేసీఆర్
యాదగిరిగుట్ట : తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని పెద్దఎత్తున అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి ఉన్న సన్‌సిటీ రియల్ ఎస్టేట్ వెంచర్‌ను ఆయన ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యాటక రంగం అభివృద్ధి చెందేందుకు వ్యాపారులు, పెట్టుబడిదారులు సహకరించాలని కోరారు. ఆంధ్రా పెట్టుబడిదారులకు అన్నివిధాలుగా సహకరిస్తామని చెప్పారు.