సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో జనజీవనం స్తంభించింది. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారులపైకి భారీగా వర్షపు నీరు చేరడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, బంజారాహిల్స్, పంజాగుట్ట మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జూబ్లీహిల్స్-పంజాగుట్ట మార్గంలో ప్రయాణించవద్దని వాహనదారులకు జీహెచ్‌ఎంసీ అధికారులు ముందస్తుగా సూచిస్తున్నారు. కేబీఆర్ పార్క్ వద్ద భారీగా వర్షపు నీరు నిలిచింది. దీంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలుగుతోంది.
మాదాపూర్, గచ్చిబౌలిలో కురిసిన వర్షానికి ప్రధాన రహదారులు, కాలనీ అంతర్గత రోడ్లు జలమయమయ్యాయి. మాదాపూర్‌లో పలు అపార్ట్‌మెంట్ సెల్లార్లలోకి వరద నీరు చేరి వాహనాలు మునిగిపోయాయి. ఉదయం నుంచి కొండాపూర్, మాదాపూర్, అయ్యప్పసొసైటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment