20 ఆటోలు సీజ్
రూ.40 వేల జరిమానా
కోల్‌సిటీ : గోదావరిఖనిలో ట్రాఫిక్ పోలీసులు నిబంధనలు ఉల్లంఘించిన ఆటోలను సీజ్ చేశారు. డీఎస్పీ ఎస్.మల్లారెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు శనివారం స్పెషల్‌డ్రైవ్ చేపట్టారు. ఆటోలలో పరిమితికి మించి విద్యార్థులను చేరవేస్తూ తరుచూ ప్రమాదాలకు కారణమయ్యే ఆటో డ్రైవర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. లెసైన్స్, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్, పొల్యూషన్, పరిమిట్ తదితర డాక్యుమెంట్లను సీఐ వెంకటేశ్వర్లు తనిఖీ చేశారు. డాక్యుమెంట్లు సరిగాలేని 20 ఆటోలు స్టేషన్‌కు తరలించారు. నిబంధనలు అతిక్రమించిన ఆటో డ్రైవర్ల నుంచి సుమారు రూ.40 వేల జరిమానా వసూలు చేశారు. పరిమితికి మించి విద్యార్థులను తరలించే ఆటోల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను పంపకూడదని సూచించారు.
ఆటోలపై ట్రాఫిక్ పోలీసుల కొరడా
Published Sun, Jun 14 2015 12:49 AM | Last Updated on Fri, May 25 2018 5:50 PM
Advertisement
Advertisement