ట్రాన్స్‌కోకు బకాయిల షాక్
నల్లగొండ : జిల్లా విద్యుత్ శాఖకు బకాయిల షాక్ తగులుతోంది. ప్రతినెలా సుమారుగా రూ.43 కోట్ల విద్యుత్‌చార్జీలు వసూలు చేయాల్సి ఉండగా కేవలం 37 కోట్ల రూపాయలు మాత్రమే వసూలవుతున్నాయి. దీంతో ప్రతినెలా బకాయిల జాబితాలోకి ఆరు కోట్ల రూపాయలు చేరుతున్నాయి. జిల్లాలో అన్ని రకాల విద్యుత్ కనెక్షన్లు 11,70,414 ఉండగా వాటికి సంబంధించి ఇప్పటివరకు 238.15 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. వీటిని వసూలు చేయడం.. అధికారులకు తలకు మించిన భారమైంది.
వసూలుకు ప్రత్యేక చర్యలేవీ?
విద్యుత్ బకాయిల వసూళ్లకు విద్యుత్‌శాఖ అధికారులు ఎలాంటి ప్రత్యేక చర్యలూ చేపట్టడం లేదు. గృహ అవసరాలకు సంబంధించిన వాటితోపాటు పరిశ్రమలు, కమర్షియల్ భవనాలకు కూడా విద్యుత్ బిల్లుల బకాయిలు భారీగా ఉన్నా అధికారులు మాత్రం వసూలు చేయలేకపోతున్నారు. స్పెషల్ డ్రైవ్ చేపడితే తప్ప బిల్లులు వసూలు చేసే పరిస్థితి లేదు.
బకాయి బిల్లులు మొత్తం చెల్లించాల్సిందే : బాలస్వామి, ట్రాన్స్‌కో ఎస్‌ఈ, నల్లగొండ
విద్యుత్ చార్జీల బకాయిలు ఉన్న వారంతా పూర్తిస్థాయిలో చెల్లించాల్సిందే. బకాయిలు ఎక్కువగా ఉన్న వారిపై దృష్టి పెడతాం. పూర్తిస్థాయిలో వసూలు చేస్తాం.