సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులకు రవాణా భత్యం (టీఏ) ఇవ్వాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. అందుకు సంబంధించి సీఎం కేసీఆర్ ఆమోదం తర్వాత ఉత్తర్వులు జారీ చేస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బోధన వైద్యులకు టీఏ ఇవ్వాలని నిర్ణయించినా ఇప్పటివరకు అమలు కాలేదు. తాజాగా దాన్ని అమలుచేసేందుకు సర్కారు ముందుకు వచ్చింది. దీంతో హైదరాబాద్‌లోని బోధనాసుపత్రుల్లో పనిచేస్తున్న 1,361 మందికి, జిల్లాల్లో పనిచేస్తున్న 755 మందికి మొత్తంగా 2,116 మంది వైద్యులకు టీఏ అందనుంది.
హైదరాబాద్‌లో పనిచేసే వైద్యులకు నెలకు రూ.800, మిగిలిన ప్రాంతాల వారికి రూ.400 చొప్పున టీఏ చెల్లించనున్నారు. టీఏ కోసం నెలకు రూ.1.66 కోట్లు అదనంగా అందజేయడంతో పాటు 2009 అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకు అర్హులైన ఆయా వైద్యులకు ఎరియర్స్ కింద బకాయిలు చెల్లిస్తారు. బకాయిల కింద రూ.14.19 కోట్లు అందనున్నాయి.
ప్రభుత్వ బోధనా వైద్యులకు రవాణా భత్యం
Published Sat, Jun 30 2018 1:26 AM | Last Updated on Wed, Aug 15 2018 9:10 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment