
ఖమ్మం మామిళ్లగూడెం:ఈ ఫొటోలో కనిపిస్తున్నది రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్. ముఖ్య మంత్రి కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగులకు వరాలు ప్రకటించిన నేపథ్యంలో సోమవారం ఖమ్మం ఆర్టీసీ డిపోలో ఉద్యోగులు సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి స్వయంగా డ్రైవర్ డ్రెస్ కోడ్‌ను పాటిస్తూ బస్సు నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. అక్కడున్న డ్రైవర్లు, కండక్టర్లతో కాసేపు ముచ్చటించారు.
Comments
Please login to add a commentAdd a comment