'మా భూములు మాకిచ్చి కదలండి' | tribes protest on lands in aswaraopeta | Sakshi
Sakshi News home page

'మా భూములు మాకిచ్చి కదలండి'

Published Fri, Sep 4 2015 1:04 PM | Last Updated on Sun, Sep 3 2017 8:44 AM

tribes protest on lands in aswaraopeta

అశ్వారావుపేట: మా భూములను మాకు అప్పగించి ఇక్కడి నుంచి కదలండంటూ ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం వాగొడ్డుగూడెం గ్రామానికి చెందిన గిరిజనులు ఫారెస్టు, పోలీసుల వాహనాలను అడ్డుకున్నారు. ఈ గ్రామంలో సుమారు 100 ఎకరాల భూమి గిరిజనుల ఆధీనంలో ఉంది. ఎన్నో ఏళ్లుగా ఈ భూమలల్లో సాగు చేసుకుంటున్నామని, ఇప్పుడు అధికారులు వచ్చి ఇవి ప్రభుత్వ భూములని మొక్కలు నాటడం ఎంతవరకు సబబు అని వాపోయారు.

మొక్కలు నాటే కార్యక్రమాలు ఆపేసి ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని గిరిజనులు అధికారులను కోరారు. దీంతో ఇరు పక్షాల మద్య స్వల్ప వాగ్వాదం జరిగింది. కొంత మంది గిరిజనులు వాహనాలకు అడ్డుగా బైఠాయించారు. మరికొంత మంది ఆందోళనతో రహదారిపై రాకపోకలు స్తంభించాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement