సులోచనారాణికి నివాళులర్పిస్తున్న సాహితీ వేత్తలు, రచయిత్రులు
వివేక్‌నగర్ : తెలుగు నవలా సాహిత్యంలో యద్దనపూడి సులోచనారాణిది ఒక శకమని, 1960 నుంచి 80 వరకు రచయిత్రుల స్వర్ణయుగమైతే అందులో ప్రధాన పాత్ర సులోచనారాణి దేనని వక్తలు అన్నారు. ప్రముఖ నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి సంస్మరణ సభ మంగళవారం సాయంత్రం కళా సుబ్బారావు కళావేదికలో జరిగింది. ఆమె రాసిన ప్రతి నవలా మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని రాసిందేనన్నారు.
నవలలోని ప్రతి స్త్రీ పాత్ర ఆత్మాభిమానానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. రచయిత్రి డా.వాసా ప్రభావతి çమాట్లాడుతూ సులోచన రచన సున్నితమైన, అందమైన భాషతోపాటు వర్ణనలు నాటి యువతను ఊహాలోకాల్లోకి తీసుకెళ్ళేవన్నారు. రచయిత్రి డా.ముక్తేవి భారతి మాట్లాడుతూ అప్పట్లో సెక్రటరి నవల సంచలనం సృష్టించిదని, సినిమాగా గొప్ప విజయం సాధించిదన్నారు.
ఎన్నో నవలలు సినిమా లుగా , టీవీ సీరియల్స్‌గా ప్రజాదరణ పొం దాయన్నారు. సభలో రచయిత్రులు స్వాతి శ్రీపాద, శైలజామిత్ర, కళా జనార్దనమూర్తి. యం.కెరాము, డా.కె.వి.కృష్ణకుమారి, డా. శాస్త్రి, తెన్నేటి సుధాదేవి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment