టీఆర్‌ఎస్ అహంకారానికి ఖేడ్‌లో చెక్ | TRS arrogance in Khed Czech | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్ అహంకారానికి ఖేడ్‌లో చెక్

Published Tue, Feb 9 2016 3:58 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

టీఆర్‌ఎస్ అహంకారానికి ఖేడ్‌లో చెక్ - Sakshi

టీఆర్‌ఎస్ అహంకారానికి ఖేడ్‌లో చెక్

పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

 పెద్దశంకరంపేట: టీఆర్‌ఎస్ అహంకారాన్ని నారాయణఖేడ్ ప్రజలు దించుతారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలంలోని రామోజిపల్లి, వీరోజిపల్లి, జూకల్, కొత్తపేట, బూర్గుపల్లి గ్రామాల్లో ఆయన ఉప ఎన్నిక ప్రచారం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ టీఆర్‌ఎస్ నాయకులు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాల్లో వచ్చిన కమీషన్ల ద్వారా సంపాదించిన సొమ్ముతోనే పోటీ చేస్తున్నారన్నారు.

అధికారంలోకి వచ్చి 20 నెలలైనా ఏ ఒక్క పేదవాడికీ రాష్ట్రంలో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టివ్వలేదన్నారు. సంప్రదాయాలను గౌరవించని టీఆర్‌ఎస్‌ని ప్రజలే ఓడిస్తారన్నారు. ఇటీవల జరిగిన జీహెచ్‌ఎంసీ, వరంగల్ ఎన్నికల్లో ఈవీఎంలలో ట్యాంపరింగ్ జరిగినట్లు తమకు అనుమానాలు ఉన్నాయని, దీనిపై ఢిల్లీలో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు ఉత్తమ్ తెలిపారు. నారాయణఖేడ్ ఉప ఎన్నికలో ఈవీఎం పద్ధతిలో కాకుండా బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement