
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ వైఖరి ఇక నడవదంటూ టీఆర్‌ఎస్ ఎంపీలు పార్లమెంటు ఆవరణలో నినదించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు రిజర్వేషన్ల పెంపు అమలు కావాల్సిందేనని, రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన బిల్లును అనుసరించి 9వ షెడ్యూలులో రిజర్వేషన్లను చేర్చాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై బుధవారం లోక్‌సభలో టీఆర్‌ఎస్ ఎంపీలు నిరసన తెలిపారు. వెల్‌లో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. సభ వాయిదా పడిన తర్వాత అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. ఎంపీలు జితేందర్‌రెడ్డి, కల్వకుంట్ల కవిత, బి.వినోద్‌కుమార్, సీతారాం నాయక్, బీబీ పాటిల్, నగేశ్, బాల్క సుమన్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, సి.హెచ్.మల్లారెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, పసునూరి దయాకర్ ధర్నాలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఆర్థిక బిల్లు ప్రవేశపెట్టినపుడు టీఆర్‌ఎస్ ఎంపీలు సభలో లేరు.
అన్యాయం చేయాలని చూస్తున్నరు: సీతారాం
ధర్నా సందర్భంగా ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ మీడియాతో మాట్లాడారు. ‘జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఉండాలని మేం ధర్నా చేస్తున్నాం. కాంగ్రెస్ గానీ, అధికార బీజేపీ గానీ ప్రజల ఆకాంక్షలను పట్టించుకోలేదు. రిజర్వేషన్లను సుప్రీంకోర్టు 50 శాతానికి పరిమితం చేసిందంటూ ఎస్సీ, ఎస్టీలకు అన్యా యం చేయాలని చూస్తున్నారు. ఇది మంచిది కాదని హితబోధ చేస్తున్నాం’అన్నారు. ‘మిజో రంలో 94.8%, లక్షద్వీప్‌లో 94, నాగాలాండ్‌లో 86.8, మేఘాలయలో 86 %రిజర్వేషన్ ఉంది. ఆ రాష్ట్రాల్లో 90 శాతానికి పైగా గిరిజన జనాభా ఉంది. అక్కడ మీరనుకుంటున్నట్లు ఎస్సీలకు 15%, ఎస్టీలకు ఏడున్నర శాతమే ఉండాలిగా, ఎందుకు లేదు. రాజ్యాంగం ఇచ్చిన హక్కును ఎందుకు హరిస్తున్నారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అడిగితే కేంద్రం స్పందించలేదు. వారు మా నాయకులతో మాట్లాడకపోవడం దురదృష్టకరం. ఇది బీజేపీ ఆడుతున్న నాటకం’అని అన్నారు.
ఏం మాట్లాడుతున్నరు..?
రిజర్వేషన్లపై మంగళవారం ఓ నాయకుడిని కలిస్తే రాబోయే తరాలకు అన్యాయం చేస్తారా అన్నారని ఎంపీ సీతారాం చెప్పారు. ‘ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఇస్తే రాబోయే తరాలకు అన్యాయం చేసినట్టా? ఏం మాట్లాడుతున్నరు ? మీ ఒళ్లు దగ్గర పెట్టుకునే మాట్లాడుతున్నరా? దేశంలోని 18% ఎస్సీలు, 10%ఎస్టీలు, బీసీలు మిమ్మల్ని క్షమించరు. గుణపాఠం చెబుతారు’అని హెచ్చరించారు. టీఆర్‌ఎస్ చేస్తున్న పోరాటానికి కేంద్రం స్పందించి రిజర్వేషన్ల పెంపును ఆమోదించాలని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు.
మీలా చిల్లర వేషాలు వేయం: బాల్క సుమన్
పార్లమెంటులో టీఆర్‌ఎస్ ఎంపీలు చేస్తున్నట్లే అసెంబ్లీలో ఆందోళన చేస్తున్నామని, తమను ఎందుకు సస్పెండ్ చేశారని టీపీ సీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించడంపై ఎంపీ బాల్క సుమన్ మండిపడ్డారు. ప్రజాస్వామ్య పద్ధతిలో టీఆర్‌ఎస్ ఎంపీలం నిరసన తెలుపుతున్నామని.. అంతేగానీ చి ల్లర వేషాలు వేయ మన్నారు. ‘పోలవరం ముంపు మండలాలు, హైకోర్టు విభజన, విభజన చట్టం ప్రకారం రావాల్సిన హక్కుల విషయాల్లోగానీ, ఇప్పుడు చేస్తున్న రిజర్వేషన్ల పోరాటంలో గానీ మూడే ళ్లలో పార్లమెంటులో ఎప్పుడూ మీలా మైకులు విరగ్గొట్టి, పేపర్లు చించి స్పీకర్‌పై విసిరేయ లే దు. మీరు చేసిందంతా అరాచకం, ఉన్మా దం. ఇప్పటికైనా తప్పును ఒప్పుకొని స్పీక ర్, గవర్నర్‌కు క్షమాపణ చెప్పండి’అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment