ప్రజా సమస్యలపై చర్చకు దిగకుండా సభకు అడ్డుతగులుతున్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని అసెంబ్లీ నుంచి బర్తరఫ్ చేయాలి.
ప్రజా సమస్యలపై చర్చకు దిగకుండా సభకు అడ్డుతగులుతున్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని అసెంబ్లీ నుంచి బర్తరఫ్ చేయాలి. గతంలో వారు చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికే ప్రజా సమస్యలపై చర్చించకుండా అడ్డుతగులుతున్నారు.
- టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
తెలంగాణపై చంద్రబాబు అక్కసు చాటారు
విద్యుత్ విషయంలో తమ రెండు కళ్ల ధోరణి ఎక్కడ బయటపడుతుందోనని భయపడే టీడీపీ సభ్యులు సభలో గందరగోళం సృష్టించారు. కొత్త రాష్ట్రంలో తొలి సభను సజావుగా నిర్వహించనీయకుండా బాబు తెలంగాణ పట్ల తన అక్కసును చాటారు.
- టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
టీడీపీ వాళ్లు.. కావాలనే అడ్డు తగిలారు
తెలుగుదేశం సభ్యులు ఒక పథకం ప్రకారమే మాటిమాటికీ సభ జరగకుండా అడ్డుతగిలారు. కరెంట్ కావాలన్న రైతులపై బషీర్‌బాగ్‌లో విచక్షణారహితంగా కాల్పులు జరిపిన తెలుగుదేశం పార్టీ వాళ్లే.. ఇప్పుడు రైతుల కోసం మాట్లాడటం చిత్రంగా ఉంది.
- టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు
సభలో పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. సభలో ఏపార్టీకీ చెందని వారు ఉన్నారు. వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. మొదటగా క్వశ్చన్ అవర్ ఇవ్వడం ఆశ్చర్యకరం. ఇందుకు ప్రోత్సాహం ఇవ్వడం సంప్రదాయం కాదు. ప్రతిదానికీ కాంగ్రెస్‌ను విమర్శించే నైతిక హక్కు టీఆర్‌ఎస్ నేతలకు లేదు.
- కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉందా?
దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన ఇందిరాగాంధీ విగ్రహాన్ని మెద క్‌లో దహనం చేస్తే.. వారిని ఇప్పటికీ అరెస్ట్ చేయలేదు. రాష్ట్రంలో అసలు పోలీసు వ్యవస్థ ఉందా? నిందితులను పట్టుకునేలా చర్యలు తీసుకోవాలి.
- ఎమ్మెల్సీ ఫరూఖ్ హుస్సేన్