'నాకేమైనా జరిగితే టీఆర్‌ఎస్‌దే బాధ్యత'
వరంగల్: టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావుకు తెలంగాణ ప్రభుత్వం ఎస్కార్ట్ తొలగించింది. దీనికి నిరసనగా ఆయన
గన్‌మెన్‌లను నిరాకరించారు. కావాలనే టీఆర్‌ఎస్ తనపై కక్షసాధింపు చర్యలకు దిగుతోందని ఎర్రబెల్లి ఆరోపించారు.
తనకేమైనా జరిగితే టీఆర్‌ఎస్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అవలంబిస్తున్న విధానాలు తుగ్లక్ పరిపాలనను గుర్తుకు తెస్తున్నాయని అంతకుముందు విమర్శించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ నెరవేర్చకుండా... ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబును దూషించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గవర్నర్ పాలనపై మోడీని, చంద్రబాబు నాయుడిని కేసీఆర్ దూషించడం సరి కాదన్నారు. కేసీఆర్‌ను కేంద్రం బఫూన్‌లా చూస్తోందన్నారు. ఈ నెల 19న ప్రభుత్వం నిర్వహించనున్న సర్వే వారం రోజులు నిర్వహించాలని డిమాండ్ చేశారు.