'టీఆర్ఎస్ సర్కార్ ఐదేళ్లు ఉండబోదు'
నిజమాబాద్: తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఐదేళ్ల పాటు కొనసాగబోదని ఏఐసీసీ కార్యదర్శి కుంతియా జోస్యం చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎవరూ కూల్చాల్సిన అవసరం లేదని కుంతియా అన్నారు. నిజమాబాద్లో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయనతో పాటు పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, మాజీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని పొన్నాల విమర్శించారు. టీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన హామీలను మరచిపోయిందని, కాంగ్రెస్ నేతలను టీఆర్ఎస్లోకి చేర్చుకోవడం సరికాదని డీఎస్ అన్నారు.