kuntia
-
ఏపీ, తెలంగాణకు నూతన కాంగ్రెస్ ఇన్చార్జిలు..
న్యూఢిల్లీ: ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిలను నియమించింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా ఉన్న కుంతియా స్థానంలో మాణిక్యం ఠాగూర్‌ను అధిష్ఠానం నియమించింది. ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా ఊమెన్‌చాందీ నియమితులయ్యారు. జనరల్ సెక్రటరీ పదవి నుంచి గులాబ్ నబీ ఆజాద్‌ను తొలగించింది. కాగా సీడబ్ల్యూసీ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా కాంగ్రెస్ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే పార్టీ వ్యవహారాల నిర్వహణలో భాగంగా అధ్యక్షురాలికి సహాయ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఏకే ఆంటోనీ, అహ్మద్ పటేల్, అంబికా సోనీ, వేణుగోపాల్, ముకుల్ వాస్నిక్, రణదీప్ సుర్జేవాలా తదితరులు ఉన్నారు. -
ఏం జరిగింది.. ఏం చేద్దాం?
సాక్షి, హైదరాబాద్: ఓట్ల లెక్కింపునకు ఒక్కరోజు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ప్రజాఫ్రంట్ నేతలు హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ ఇన్చార్జి కార్యదర్శి పల్లా వెంకటరెడ్డిలతోపాటు కాంగ్రెస్ ముఖ్య నేతలు వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, సర్వే సత్యనారాయణ, అజారుద్దీన్, షబ్బీర్ అలీ, సంపత్‌కుమార్ తదితరులు ఆదివారం సాయంత్రం పార్క్ హయాత్ హోటల్లో సమావేశమై పోలింగ్ సరళిని సమీక్షించారు. ఫలితాల అనంతరం ఏం చేయాల న్న దానిపైనా చర్చించారు. కూటమిలోని భాగస్వామ్య పార్టీల అభ్యర్థులు పోటీ చేసిన స్థానాల్లో పరస్పర ఓట్ల బదిలీ ఎలా జరిగిందన్న దానిపై ప్రధానంగా సమీక్షించారు. కూటమి స్ఫూర్తి క్షేత్రస్థాయికి వెళ్లిందని, అన్నిపార్టీల కార్యకర్తలు సమష్టిగానే ఎన్నికల్లో పోరాడారనే అభిప్రాయానికి వచ్చా రు. ఎన్నికల ఫలితాలను బట్టి కూటమిగా ఏ విధంగా ముందుకు పోవాలనే దానిపై కూడా నేతలు కార్యాచరణ రూపొందించారు. ఎన్నికల్లో సానుకూల ఫలితాలు వస్తే ఎవరి గౌరవానికి భంగం కలగకుండా వ్యవహరించాలని, అన్ని పార్టీలకు ప్రాధాన్యత కల్పించాలనే నిర్ణయానికి వచ్చారని సమాచారం. ప్రతికూల ఫలితాలు వస్తే నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ప్రజల సమస్యలపై పోరాడాలని, అది కూడా కూటమి స్ఫూర్తితోనే సాగాలనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. ఇండిపెండెంట్ల పరిస్థితేంటి... సమీక్షలో భాగంగా కొన్ని ఆసక్తికర అంశాలపై కూడా కూటమి నేతలు చర్చించినట్టు తెలుస్తోంది. ముఖ్యం గా ఐదు నుంచి ఏడుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఈసారి ఎన్నికల్లో గట్టెక్కే అవకాÔ¶శముందన్న పరిస్థితుల్లో వారిని తమ వైపునకు ఎలా తిప్పుకోవాలన్న దానిపై కూడా చర్చించారు. కూటమి పక్షాన రెబెల్స్‌గా ఉన్న వారు గెలిచినా ఎలాగూ తిరిగి వస్తారని, టీఆర్ఎస్ రెబెల్స్లోని గెలుపుగుర్రాలను తమ వైపునకు తిప్పుకుని ముందుగానే ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమై ఉండాలనే చర్చ కూడా జరిగింది. కూటమి పక్షాలు ఆశించిన ఫలితాలు రాకుండా ప్రభుత్వ ఏర్పాటుకు ఎంఐఎం సహకారం అవసరమయ్యే పక్షంలో ఏం చేద్దామన్న దానిపై కూడా నేతలు చర్చించినట్టు తెలుస్తోంది. అవసరమైతే ఎంఐఎంతో మాట్లాడాలా వద్దా అన్న దానిపై నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్టు సమాచారం. అందరం ఒక్కటే... ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్థానాలు తమకు వస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని, మిశ్రమ ఫలితాలు వస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కాకుండా ఎలా అడ్డుకోవచ్చన్న దానిపై కూడా చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్కు సొంతంగా మెజార్టీ రాకపోయినా అతిపెద్ద పార్టీగా అవతరించిన పక్షంలో గవర్నర్ ఆ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించే అవకాశం ఉందనే అభిప్రాయం భాగస్వామ్య పక్షాల సమావేశంలో వ్యక్తమైంది. కూటమిలోని అన్ని పార్టీలకు కలిపి టీఆర్ఎస్ కన్నా ఎక్కువ స్థానాలు వస్తే కూటమినే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ముందుగానే గవర్నర్‌ను కోరాలని ఆయా పార్టీలు ఉమ్మడిగా నిర్ణయించారు. ఎన్నికలకు ముందే పొత్తు కుదుర్చుకున్నందున సుప్రీంకోర్టు తీర్పు మేరకు కూటమికే అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను కోరాలని, ఈ విషయంలో పకడ్బందీగా వ్యవహరించాలని నిర్ణయించారు. -
రాహుల్‌తో ఉత్తమ్ మరోసారి భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి కుంతియా మరోసారి భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు రాహుల్ వీరితో చర్చించారు. ఈ భేటీలో ఉత్తమ్‌తో పాటు భక్తచరణ్‌దాస్, శర్మిష్ఠ ముఖర్జీ, జ్యోతిమణి పాల్గొన్నారు. సీట్ల సర్దుబాటు, టికెట్ల పంపిణీపై రాహుల్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఎన్నికల నామినేషన్ల పర్వం ప్రారంభమైనా అభ్యర్థులను ఇంకా ఖరారు చేయకపోవడంపై రాహుల్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. సీట్ల సర్దుబాటు వివాదం, సీపీఐ డిమాండ్ చేస్తున్న మునుగోడు, కొత్తగూడెం స్థానాల అంశంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారుపై ఫిర్యాదులు, బీసీలకు సీట్ల కేటాయింపు, కూటమి పార్టీలకు సీట్ల పంపకం తదితర అంశాలను రాహుల్‌కు ఉత్తమ్ వివరించారని సమాచారం. గంట వ్యవధిలో రాహుల్‌లో ఉత్తమ్ సమావేశమయ్యారు. అభ్యర్థుల ఎంపికపై ఎడతెగని కసరత్తు జరుగుతుండటంతో ఆశావహుల్లో ఆందోళన తారాస్థాయికి చేరింది. మహాకూటమిలో సీట్లపంపకం కొలిక్కి వచ్చి ఆయా స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను కూటమిలోని పార్టీలు సోమవారం ప్రకటిస్తాయని ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఆశావహులకు నిరాశే మిగలనుంది. అభ్యర్థుల ప్రకటన ఈ రోజు వెలువడే అవకాశాలు కనిపించడం లేదు. ఇతర పార్టీలతో ఇంకా ఏకాభిప్రాయం కుదరకపోవడంతో కాంగ్రెస్ జాబితా కూడా మంగళవారం వెలువడే అవకాశం ఉంది. మరో పక్క టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన మీడీయా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ అభ్యర్థుల జాబితా ప్రకటన మంగళవారం ఉంటుందని తెలిపారు. గత అనుభవాల వల్లే అభ్యర్థుల ప్రకటన విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నామని, గత సంప్రదాయాలకు భిన్నంగా ఈసారి అభ్యర్థుల ప్రకటన ఉంటుందని రమణ తెలిపారు. సీట్ల సర్దుబాటుపై ఈ రోజు సాయంత్రానికి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో కూటమి నేతలంతా కలిసి ఒకే వేదికపై అభ్యర్థులను ప్రకటిస్తామని ఆయన చెప్పారు. -
‘రఫేల్’ను తొక్కిపట్టేందుకే సీబీఐ డైరెక్టర్ తొలగింపు
హైదరాబాద్: రఫేల్ స్కాంపై దర్యాప్తు చేస్తున్నారనే అక్కసుతో సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను ప్రధాని నరేంద్ర మోదీ తొలగించారని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా ధ్వజమెత్తారు. రాజ్యాంగ స్ఫూర్తిని అవమానించిన మోదీకి అధికారంలో కొనసాగే హక్కులేదని స్పష్టం చేశారు. అలోక్ వర్మ తొలగింపును నిరసిస్తూ శుక్రవారం ఇక్కడ కోఠిలోని సీబీఐ కార్యాలయం ముందు వందలాది మంది మహాకుటమి కార్యకర్తలు, నేతలు ధర్నాకు దిగారు. పోలీసులు సీబీఐ కార్యాలయ గేట్లను మూసివేసి బారికేడ్లను ఏర్పాటు చేశారు. కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, మాజీ ఎంపీలు వీహెచ్, మధుయాష్కి, పొన్నం ప్రభాకర్, సర్వే సత్యనారాయణ, అంజన్ కుమార్ యాదవ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, టీజేఎస్ నేత దిలీప్‌కుమార్ అక్కడికి రావడంతో కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో గేట్లు ఎక్కేందుకు ప్రయత్నించారు. పోలీసులు అప్రమత్తమై అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. కుంతియా, ఉత్తమ్, వీహెచ్, పొన్నం ప్రభాకర్, అంజన్ కుమార్‌యాదవ్‌లను అరెస్టు చేసి మలక్‌పేట్ పోలీసుస్టేషన్‌కు, మిగతావారిని కంచన్‌బాగ్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం వారిని సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. కుంతియా, ఉత్తమ్ మాట్లాడుతూ న్యాయవ్యవస్థను, సెక్యులరిజాన్ని కేంద్రం నిర్వీర్యం చేస్తోందనీ, ఇలాంటి ప్రభుత్వం దేశంలో ఉండటం ప్రమాదకరమన్నారు. రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్న మోదీ సర్కార్‌కు అధికారంలో కొనసాగే హక్కులేదన్నారు. రఫేల్ కుంభకోణాన్ని తొక్కి పట్టేందుకే ప్రధాని నరేంద్ర మోదీ న్యాయవిరుద్ధమైన చర్యలకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. ముఖేశ్‌గౌడ్ డుమ్మా గోషామహాల్ నియోజకవర్గంలోని కోఠి ప్రాంతంలో కుంతియాలాంటి జాతీయ నేతల సమక్షంలో జరుగుతున్న ధర్నాకు ఆ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ముఖేశ్‌గౌడ్ డుమ్మా కొట్టడం గమనార్హం. ముఖేశ్‌గౌడ్ కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తారా, లేదా ఇతర పార్టీల వైపు చూస్తున్నారా.. అని స్థానిక నాయకులకు సందేహం వ్యక్తం చేస్తున్నారు. -
కాంగ్రెస్‌లోకి టీఆర్ఎస్ ముఖ్య నేతలు: కుంతియా
సాక్షి, కామారెడ్డి: టీఆర్ఎస్ పార్టీకి చెందిన పెద్ద నాయకులు తమ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని, శనివారం నుంచి వలసలు ఉంటాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా వెల్లడించారు. శుక్రవారం కామారెడ్డిలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ఓ మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ కూడా పార్టీలో చేరుతారని చెప్పారు. మహాకూటమిలో సీట్ల గురించి చర్చలు జరుగుతున్నాయని, శుక్రవారం కూడా చర్చలు సానుకూలంగా జరిగాయని పేర్కొన్నారు. సీట్ల సర్దుబాటు విషయంలో ఏ ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. తమ పార్టీలో టికెట్ల కోసం తీవ్ర పోటీ ఉందన్నారు. అయినప్పటికీ పొత్తులో భాగంగా ఎవరికెన్ని సీట్లు అన్నదాని ప్రకారంగా స్థానాలు కేటాయిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యార్థులు, నిరుద్యోగులను మోసం చేశారని, వారు టీఆర్ఎస్కు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. మహిళలు, దళితులు, మైనారిటీలు, గిరిజనులను వంచించాడని మండిపడ్డారు. రాష్ట్రంలో కనీసం ప్రశ్నించే పరిస్థితి లేకుండా నియంత పాలన సాగించారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. -
కాంగ్రెస్ విజయాన్ని ఎవరూ ఆపలేరు: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాన్ని ఎవరూ ఆపలేరని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ నాయకుల అణచివేత ధోరణిపై ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారని, ప్రజలు తిరగబడే రోజులు ఎంతో దూరంలో లేవని పేర్కొన్నారు. శనివారం గాంధీభవన్‌లో మహబూబాబాద్‌కు చెందిన సీనియర్ నేత రాజవర్ధన్‌రెడ్డి, కార్వాన్కు చెందిన ఎంఐఎం నేత బందూలాల్ తమ అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉత్తమ్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఉత్తమ్ మాట్లాడుతూ, ప్రజా పాలన తెచ్చేందుకు, కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టేందుకు జనం ఎదురు చూస్తున్నారని అన్నారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ కుటుంబంలోని నలుగురే బాగుపడ్డారని వ్యాఖ్యానించారు. ప్రజల ధనాన్ని దోచుకుని కేసీఆర్ కుటుంబం విలాస జీవితం గడుపుతుంటే, తెలంగాణ కోసం త్యాగాలు చేసిన కుటుంబాలు కష్టాలు అనుభవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికలు కేసీఆర్ కుటుంబానికి, తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డి.కె.అరుణ తదితరులు పాల్గొన్నారు. దూకుడుగా వెళ్లండి ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూ, దూకుడుగా ప్రజల్లోకి వెళ్లాలని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్.సి.కుంతియా సూచించారు. శనివారం గాంధీభవన్‌లో దక్షిణ తెలంగాణకు చెందిన పార్టీ అసెంబ్లీ కోఆర్డినేటర్లతో ఆయన సమావేశమయ్యారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన హామీలను స్థానిక నాయకులు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఈ సందర్భంగా కుంతియా సూచించారు. ఓటర్ల జాబితాలో అనేక అవకతవకలు జరిగాయని, ఆ జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించి కాంగ్రెస్ కార్యకర్తల ఓట్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సలీం మహ్మద్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి తదితరులు పాల్గొన్నారు. -
‘నిరుద్యోగ భృతి రూ. 3 వేలు’
సాక్షి, హైదరాబాద్ : ముందస్తు ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్‌లో ముందస్తు ఎన్నిలు జరిగినా సిద్ధంగా ఉండాలని, ఈ లోపు టికెట్ల కేటాయింపు కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసుకోమని రాహుల్ గాంధీ సూచించారన్నారు. పొత్తులపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రాహుల్ పర్యటన విజయవంతం తెలంగాణలో గాంధీ కుటుంబానికి ప్రత్యేక స్థానముంది. అందువల్ల పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారని.. రాహులగాంధీ పర్యటన విజయవంతం అయ్యిందని ప్రకటించారు. రాహుల్ మాట్లాడి 24 గంటలు కూడా గడవకముందే ప్రభుత్వం మహిళల కోసం 970 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది రాహుల్ పర్యటన ఫలితమేనని తెలిపారు. విభజన బిల్లులో ఉన్న హామీలన్ని నెరవేరే విధంగా ముందుకు పోతాం అని రాహుల్ హామీ ఇచ్చారని ఉత్తమ్ పేర్కొన్నారు. పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన టెలి కాన్ఫరెన్స్‌పై రాహుల్ సంతోషం వ్యక్తం చేశారు. మరో వారంలోనే రాహుల్ ఢిల్లీ నుంచి 31, 656 బూత్ అధ్యక్షులతో మాట్లాడతారని తెలిపారు. పారిశ్రామికవేత్తలతో జరిగిన సమావేశం కూడా విజయవంతంగా ముగిసిందని ప్రకటించారు. సరూర్ నగర్లో రాహుల్ ప్రసంగం అద్భుతంగా సాగిందంటూ కొనియాడారు. మీడియాతో కూడా మంచి ఇంటరాక్షన్ అయ్యిందన్నారు. రాహుల్ పర్యటనలో సహకరించిన మీడియాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. నిరుద్యోగ భృతి రూ. 3 వేలు సరూర్ నగర్ సభలో రాహుల్ గాంధీ ప్రసంగంలో చర్చించిన అంశాలన్ని తమ మ్యానిఫెస్టోలో చేరుస్తామని ఉత్తమ్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పెన్షన్లు పెంచుతామని, అలానే పెన్షన్ వయసును 65 నుండి 58 సంవత్సరాలకు తగ్గిస్తామన్నారు. అంతేకాక ఇప్పుడు 1500 రూపాయలుగా ఉన్న పెన్షన్‌ను 3000 రూపాయలకు, 1000 రూపాయలుగా ఉన్న పెన్షన్‌ను 2000 రూపాయలకు పెంచుతామని ప్రకటించారు. రాష్ట్రంలో మొత్తం15 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 10 లక్షల నిరుద్యోగ యువతకు నెలకు 3000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించారు. కేటీఆర్ చిన్న పిల్లగాడు.. అమెరికా నుండి వచ్చి రాష్ట్రాన్ని దోచుకోవచ్చని అనుకుంటున్నాడని విమర్శించారు. హైదరాబాద్‌లో సభ పెట్టుకునే స్వేచ్ఛ కూడా లేదా : కుంతియా హైదరాబాద్‌లో సభ పెట్టుకునే స్వేచ్ఛ కూడా లేదు.. ప్రజాస్వామ్యం అంటే ఇదేనా అని తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జీ కుంతియా ప్రశ్నించారు. వచ్చే పర్యటనలో అయిన రాహుల్‌కు ఓయూలోకి వెళ్లడానికి పర్మిషన్ ఇచ్చినందుకు హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి హైదరాబాద్ పర్యటన సందర్భంగాల గతంలో కన్నా ఇప్పుడు ఘనమైన స్వాగతం లభించిందని పేర్కొన్నారు. రాహుల్ ఎవరికో భయపడే వ్యక్తి కాదన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. -
దేశ ప్రజలను బీజేపీ మోసం చేసింది
సాక్షి, హైదరాబాద్ : అధికార బీజేపీ, టీఆర్ఎస్లపై కాంగ్రెస్ నేతలు మాటలదాడి చేశారు. ప్రజావ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నాయని మండిపడ్డారు. శుష్క వాగ్దానాలు, కల్లబొల్లి మాటలతో అధికారంలోకి వచ్చిన బీజేపీ దేశ ప్రజలను మోసం చేసిందని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా ఆరోపించారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నియంతృత్వ, ప్రజావ్యతిరేక పోకడలకు నిరసనగా సోమవారం గాంధీభవన్‌లో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘భారత్ బచావో ఆందోళన్’సభ జరిగింది. అంతకుముందు యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. సభకు ముఖ్య అతిథిగా హాజరైన కుంతియా మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని కాషాయ కూటమి ఓటమి పాలు కావడం ఖాయమని, రాహుల్‌గాంధీ సారథ్యంలోని లౌకిక ప్రజాస్వామ్య కూటమి అధికారంలోకి వస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో యువతకు ప్రోత్సాహమివ్వాలని రాహుల్ ఆలోచిస్తున్నారని, ప్రజల్లో ఉన్న యువ నేతలకు ఈసారి ఖచ్చితంగా అవకాశం లభిస్తుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం యువత ఎన్నో త్యాగాలు చేసిందని, ఆయితే ఈ త్యాగాల కారణంగా కేసీఆర్ కుటుంబం మాత్రమే లాభపడిందని అన్నారు. టీఆర్ఎస్ కేబినెట్లో దళితులకు, మహిళలకు అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. తెలంగాణ ఇచ్చిన కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని త్యాగం చేసేందుకు సోనియాగాంధీ వెనుకాడలేదని, అలాంటి వ్యక్తిని ఉద్దేశించి రాష్ట్ర మంత్రి కేటీఆర్ సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. కేటీఆర్ వెంటనే ఆ మాటలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 10 సీట్లు కేటాయించాలి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం ద్వారా తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. భారత్ బచావో సభకు హాజరైన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో యువతకు 10 అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని, 65ఏళ్లు పైబడిన వారికి పార్టీ బాధ్యతలు అప్పజెప్పాలని అధిష్టానానికి సూచించారు. యువత అధైర్యపడవద్దని, కోమటిరెడ్డి బ్రదర్స్ వారికి అండగా ఉంటారని చెప్పారు. యూత్ కాంగ్రెస్‌తో పాటు ఇతర యువజన సంఘాలపై తప్పుడు కేసులు పెట్టే అధికారులు, పోలీసుల పేర్లు రాసిపెట్టుకోవాలని, అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సంగతి తానే తేలుస్తానని వ్యాఖ్యానించారు. మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ సోనియా తెలంగాణ ఇచ్చింది ఇక్కడి ప్రజలను చూసే కానీ, కేసీఆర్ కుటుంబాన్ని చూసి కాదని అన్నారు. యువజన కాంగ్రెస్ కార్యకర్తలు నాయకుల వెంట తిరగడం మాని, నియోజకవర్గ స్థాయిలో స్వతహాగా గుర్తింపు తెచ్చుకోవాలని, అప్పుడే పార్టీలో భవిష్యత్ ఉంటుందని చెప్పారు. యువ నాయకత్వంతోనే కాంగ్రెస్ అధికారంలోకి రావడం సాధ్యమవుతుందని అన్నారు. సభలో యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు కేశవ్ చంద్ యాదవ్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్., టీపీసీసీ నేతలు గూడూరు నారాయణరెడ్డి, మల్లు రవిలతోపాటు పెద్ద ఎత్తున యూత్‌కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. చలో ‘ప్రగతి భవన్’ ‘భారత్ బచావో ఆందోళన్’ సభ ముగిసిన తర్వాత నాటకీయ పరిణామం జరిగింది. సోనియా గాంధీని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ‘చలో ప్రగతిభవన్’ కార్యక్రమానికి పిలుపునివ్వడం ఉద్రిక్తతకు దారితీసింది. ‘‘కేటీఆర్.. సోనియా గాంధీ తెలంగాణకు అమ్మ లాంటిది, ఆమెను అమ్మా బొమ్మా అంటావా, నీ ప్రగతి భవన్‌కు వస్తున్నాం.. దమ్ముంటే ఆపు’’ అన్న నేతల ఉపన్యాసం తో సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి, యూత్ కాంగ్రెస్ జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు కేశవ్‌చంద్ యాదవ్, అనిల్‌కుమార్ యాదవ్‌ల నేతృత్వంలో వందలాది మంది కార్యకర్తలు గాంధీభవన్ నుంచి ప్రదర్శనగా బయలుదేరారు. పోలీసులు అప్రమత్తంగా లేకపోవడంతో పెద్దఎత్తున కార్యకర్తలు రోడ్డుపైకి చేరుకున్నారు. పోలీసులు వెంటనే తేరుకుని వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా గాంధీభవన్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు నడుమ పెద్దఎత్తున తోపులాట జరిగింది. దీంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. -
ఉత్తమ్‌పై రాహుల్‌కు ఫిర్యాదు చేయలేదు
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై టీపీసీసీ నేతలు ఫిర్యాదు చేశారన్నది అవాస్తమని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ ఆర్సీ కుంతియా వెల్లడించారు. రాహుల్‌తో జరిగిన భేటీలో తాను కూడా ఉన్నానని, సమావేశంలో ఎవరూ ఎవరికీ వ్యతిరేకంగా ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. ఫిర్యాదు చేశారన్న వార్త కేవలం పుకారు మాత్రమేనని కొట్టిపారేశారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉంటే 15 సీట్లు మాత్రమే వస్తాయని కోమటిరెడ్డి సోదరులు రాహుల్ గాంధీతో చెప్పారన్న విషయంపై తనకు ఎలాంటి సమాచారం లేదని కుంతియా పేర్కొన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ సీనియర్ నేతల సమావేశం ఉంటే తెలియజేస్తానని వివరించారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగిస్తారా? అని మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నకు కుంతియా స్పందించలేదు. -
గల్ఫ్ కార్మికులకు హక్కులు కల్పించాలి: కుంతియా
సాక్షి, హైదరాబాద్: వలస కార్మికులకు అన్ని రకాల హక్కులు కల్పించాలని ఏఐసీసీ కార్యదర్శి ఆర్సీ కుంతియా అన్నారు. గురువారం బేగంపేటలో వలసలపై ప్రపంచ సంఘటిత ఒప్పందం గురించి దక్షిణ భారత స్థాయి సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ కార్యదర్శి ఆర్సీ కుంతియా, సీఎల్పీ నేత జానారెడ్డి, మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కుంతియా మాట్లాడుతూ ఇండియాలో బ్రిటిషర్లు ప్రారంభించిన వలసలు ఇంకా కొనసాగుతున్నాయన్నారు. గల్ఫ్ దేశాల్లో వలస కార్మికులు పడుతున్న ఇబ్బందులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. విదేశాల్లో ఎంత కష్టపడినా వారికి సరైన ఫలితం దక్కడం లేదన్నారు. దళారులు, ఏజెంట్ల చేతిలో మోస పోయి, కుటుంబాలకు దూరంగా కాలం వెళ్లదీస్తున్నారన్నారు. వారి సంక్షేమం కోసం ప్రభుత్వాలు పట్టనట్లు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. గల్ఫ్ దేశాల్లో కొన్ని కంపెనీలు కార్మికులకు రెండేళ్లుగా జీతాలు కూడా చెల్లించడం లేదన్నారు. వలస కార్మికులు గల్ఫ్ దేశాలు వెళ్లి ఇబ్బందులు పడకుండా మన దేశంలోనే వారికి ఉపాధి కల్పించే ప్రయత్నాలు చేయాలన్నారు. ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రం వెళ్లి పనిచేస్తున్న వారికి పనిచేసే చోట ఓటు హక్కు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. రూ.500 కోట్ల హామీ ఏమైంది? జానారెడ్డి మాట్లాడుతూ మూడు కోట్ల మంది భారతీయులు విదేశాల్లో పనిచేస్తుండటం వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉద్యోగభారం తగ్గిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల కోసం రూ.500 కోట్లు ఖర్చు పెడతామని ఇచ్చిన హామీ ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదన్నారు. బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించినా అది ఏ విధంగా ఖర్చు పెడతారనేది స్పష్టత లేదన్నారు. సురేశ్‌రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ నగరం వలసలకు ఒక మంచి ఉదాహరణ అని అన్నారు. 10 లక్షల వలస కార్మికులు తెలంగాణలో ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ వర్కర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలి!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనలో ప్రతి విభాగంలోనూ కమీషన్లు సాధరణమయ్యాయని, స్వయంగా టీఆర్ఎస్ నేతలే ఈ మాట చెబుతున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గతంలో లంచాలు అడిగితే చెప్పుతో కొట్టాలని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడెందుకు కమీషన్లు, అవినీతిపై మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పాలనలో కమీషన్లు సర్వసాధారణమయ్యామని చెప్పారు. ఈ విషయాన్ని స్వయంగా సిరిసిల్ల మున్సిపల్ ఛైర్మనే చెప్పారని ఉత్తమ్ గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ కుటుంబం బాటలోనే టీఆర్ఎస్ నేతలు నడుస్తున్నారని మండిపడ్డారు. ప్రతి పనిలో కమీషన్లు దండుకుంటున్నారని పేర్కొన్న ఉత్తమ్.. సిరిసిల్లలో జరుగుతున్న అవినీతికి నైతిక బాధ్యత వహించి మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ నుంచి ఎంపీగా ఒక్కరూ కూడా గెలవరని ఉత్తమ్ జోస్యం చెప్పారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేసీఆర్ థర్డ్ ఫ్రంట్‌ను తెరపైకి తీసుకొచ్చి డ్రామాలాడుతున్నారని విమర్శించారు. విపక్షంలో చీలిక తెచ్చేందుకే తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జి ఆర్.సి. కుంతియా ఆరోపించారు. అసలు కేసీఆర్.. అధికార పక్షమా, లేక ప్రతిపక్షాల పక్షామా స్పష్టం చేయాలని కుంతియా డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పుతో న్యాయం గెలుస్తుందనే నమ్మకం పెరిగిందని, మమ్మల్ని సస్పెండ్ చేసినంత మాత్రాన మా గళం ఆపలేరని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అన్నారు. -
ప్రభుత్వ విధానాలతోనే రైతు ఆత్మహత్యలు
► కాంగ్రెస్ వ్యవహారాల రాష్ట్ర ఇన్చార్జి కుంతియా ► కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ: ఉత్తమ్ ► త్వరలో కాంగ్రెస్ పత్రిక, టీవీ చానల్ వస్తోంది సాక్షి, వికారాబాద్: రైతు ఆత్మహత్యలకు ప్రభుత్వ విధానాలే కారణమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కుంతియా ఆరోపించారు. ‘ఇందిరమ్మ రైతుబాట’ కార్యక్రమం లో భాగంగా పరిగిలో బుధవారం జరిగిన రెవెన్యూ రికార్డుల అవగాహనా సదస్సులో ఆయన మాట్లాడారు. గిరిజనులు, దళితు లు, బలహీనవర్గాలవారికి ఇందిరాగాంధీ హయాం నుంచి దివంగత వైఎస్ వరకు లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేశారన్నారు. కేసీఆర్ మూడెకరాల భూమి పంపిణీ చేయకుండా, ఉన్న భూములను పట్టాదారులకు యాజమాన్య హక్కులు లేకుండా కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్, మోదీ ఇద్దరూ అబద్ధాలు చెప్పడంలో పోటీపడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సెప్టెంబర్ 30వ తేదీ వరకు 35 వేల బూత్ కమిటీలు వేస్తామని, 10 లక్షల మంది సభ్యులుగా ఉంటారని చెప్పారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి కృతజ్ఞతగా 2019లో పార్టీని అధికారంలోకి తేవడానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. 2019లో మాదే అధికారం: ఉత్తమ్ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఏకకాలం లో ఒక్కో రైతుకు రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని, ఉద్యోగాలు రానివారికి నెలకు రూ. 3 వేల నిరుద్యోగ భృతి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎకరాకు పంటకు రూ.4 వేల పథకం ఎన్నికల స్టంట్ మాత్రమేనన్నారు. టీఆర్ఎస్ నేతలతోనే రైతు కమిటీలా అని ప్రశ్నించారు. నాసిరకం చీరలు ఇస్తున్నారని మహిళలే వాటిని కాల్చేస్తుంటే కాంగ్రెస్‌పై ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. తమ వార్తలు లోపలి పేజీలకే పరిమితంకాగా కేసీఆర్ అబద్ధాలు పతాక శీర్షికలతో వస్తు న్నాయన్నారు. త్వరలో కాంగ్రెస్‌కు చెం దిన పత్రిక, టీవీ రాబోతున్నదని చెప్పారు. ప్రజాధనం దుర్వినియోగం: భట్టి భూసర్వే పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ధనాన్ని వృథా చేస్తోందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రకటనలకే రూ. కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు. బూత్‌స్థాయి నేతలకు సర్వేపై సమాచారం తెలిపేందుకే ఈ సదస్సులు ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వాన్ని నిలదీయండి: జానారెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నిలదీయాలని ఆ పార్టీ శాసనసభాపక్షనేత కె.జానారెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, పరిగి ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి తది తరులు పాల్గొన్నారు. -
డీఎస్‌కూ అదే గతి: కుంతియా
జహీరాబాద్(మెదక్): కాంగ్రెస్‌లో ఉన్నతమైన పదవులను అనుభవించిన పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ పార్టీని వీడి వెళ్లినా ఎలాంటి నష్టం లేదని ఏఐసీసీ కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి రామచంద్ర కుంతియా అన్నారు. శుక్రవారం రాత్రి జహీరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే జె.గీతారెడ్డితో కలసి విలేకరులతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ను వీడిన వారే అన్ని విధాలుగా నష్టపోయారని ఆయన పలువురిని ఉదహరిస్తూ గుర్తు చేశారు. డీఎస్‌కు కూడా అదే గతి పడుతుందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో అనేక కుంభకోణాలు చోటుచేసుకున్నాయన్నారు. బంగారు తెలంగాణగా మారుస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇప్పుడు అన్నింటిని విస్మరించారని విమర్శించారు. -
'టీఆర్ఎస్ సర్కార్ ఐదేళ్లు ఉండబోదు'
నిజమాబాద్: తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఐదేళ్ల పాటు కొనసాగబోదని ఏఐసీసీ కార్యదర్శి కుంతియా జోస్యం చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎవరూ కూల్చాల్సిన అవసరం లేదని కుంతియా అన్నారు. నిజమాబాద్‌లో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయనతో పాటు పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, మాజీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని పొన్నాల విమర్శించారు. టీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన హామీలను మరచిపోయిందని, కాంగ్రెస్ నేతలను టీఆర్ఎస్లోకి చేర్చుకోవడం సరికాదని డీఎస్ అన్నారు.