సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై టీపీసీసీ నేతలు ఫిర్యాదు చేశారన్నది అవాస్తమని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ ఆర్సీ కుంతియా వెల్లడించారు. రాహుల్‌తో జరిగిన భేటీలో తాను కూడా ఉన్నానని, సమావేశంలో ఎవరూ ఎవరికీ వ్యతిరేకంగా ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు.
ఫిర్యాదు చేశారన్న వార్త కేవలం పుకారు మాత్రమేనని కొట్టిపారేశారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉంటే 15 సీట్లు మాత్రమే వస్తాయని కోమటిరెడ్డి సోదరులు రాహుల్ గాంధీతో చెప్పారన్న విషయంపై తనకు ఎలాంటి సమాచారం లేదని కుంతియా పేర్కొన్నారు.
భవిష్యత్తులో కాంగ్రెస్ సీనియర్ నేతల సమావేశం ఉంటే తెలియజేస్తానని వివరించారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగిస్తారా? అని మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నకు కుంతియా స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment