సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లా పరిషత్‌తో పాటు, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, కామారెడ్డి, బోధన్, ఆర్మూరు మున్సిపాలిటీలలో గులాబీ జెండాను ఎగుర వేయడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్ ముందుకు కదులుతోంది. హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో శుక్రవారం నిర్వహించిన టీఆర్‌ఎస్ ముఖ్యనేతల సమావేశం లో ఈ అంశాలపైన సీరియస్‌గా చర్చిం చిన ట్టు తెలుస్తోంది. ఈ సమావేశానికి జిల్లాకు చెందిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు, పార్టీ పొలిట్‌బ్యూరో, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా అధ్యక్షుడు, ఇతర నేతలు హాజరయ్యా రు. తెలంగాణ స్థాయి సమావేశమే అయినప్పటికీ,అనంతరం జిల్లాకు చెందిన నేతలతో కేసీఆర్ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుం ది.మున్సిపల్,పరిషత్ ఎన్నికల ఫలితాలపై చర్చించి న ఆయన కీలక స్థానాలను దక్కించుకోవాలని సూచించడం కేడర్‌లో చర్చనీయాంశంగా మారింది.
వేడెక్కిన రాజకీయాలు
ఈ నెల 12న కార్పొరేషన్, మున్సిపల్, 13న ఎంపీటీసీ, జడ్‌పీటీసీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో కేసీఆర్ తెలంగాణభవన్‌లో సమావేశం నిర్వహిం చారు. ఫలితాల మాట ఎలా ఉన్నా, నిజామాబాద్ కార్పొరేషన్, కామారెడ్డి, బోధన్, ఆర్మూరు మున్సిపాలిటీలు సహా జడ్‌పీ పీఠాన్ని సాధించుకోవాలనే అంశమే ప్రధానంగా మారడంతో జిల్లా రాజకీయాలను వేడెక్కాయి. సార్వత్రిక ఎన్నికలలో తమకే ఆధిక్యం లభిస్తుందన్న ధీమాతో ఉన్న కేసీఆర్ మున్సిపల్, పరిషత్‌లలో పాగా వేసే పనిలో కేడర్‌కు దిశా నిర్దేశనం చేయడం ప్రధాన రాజకీయ పక్షాలను ఆలోచనలో పడేసింది.
జిల్లా పరిషత్ చైర్మన్‌ను జడ్‌పీటీసీ సభ్యులు ఎన్నుకోవాల్సి ఉ న్నా, ఆయా పార్టీలు ఇప్పటికీ చైర్మన్ అభ్యర్థుల పేర్లను ప్రకటించలేదు. మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలను ముందుగానే ప్రకటించే సాహసం ఏ పార్టీ చేయలేదు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ 36 మండలాలలో అభ్యర్థులను బరిలోకి దింపగా, బీజేపీ 31, టీడీపీ 29 మంది అభ్యర్థులను పోటీకి నిలి పాయి. వైఎస్‌ఆర్ సీపీ, సీపీఐ, సీపీఎం, లోక్ సత్తాల అభ్యర్థులు పోటీలో ఉన్నారు. దీంతో పోటీ రసవత్తరంగా మారగా, ఫలితాలను బట్టి పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునేలా కేసీఆర్ నేతలకు మార్గ దర్శనం చేశారని సమాచారం.
శ్రేణులకు మార్గదర్శకాలు
టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో భేటీ జిల్లా నేతలలో ఉత్సాహాన్ని నింపింది. విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న నేతలు, వివరాలను కేడర్‌కు వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామన్న పూర్తి ధీమాను వ్యక్తం చేశారు. మున్సిపల్, ‘స్థానిక’ ఫలితాల తరువాత జరిగే సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కి ంపులో చురుకుగా వ్యవహరించాలని కేసీఆర్ చేసిన సూచనలను కార్యకర్తలకు చేరవేశారు. సమాశానికి ఎంపీ అభ్యర్థులు కల్వకుంట్ల కవిత, భీంరావ్ బస్వంత్‌రావు పాటిల్, ఎమ్మె ల్యే అభ్యర్థులు గంప గోవర్దన్, ఏనుగు రవీందర్‌రెడ్డి, హన్మంత్ సింధే, బాజిరెడ్డి గోవర్ధన్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, బిగాల గణేష్‌గుప్తా, ఆశన్నగారి జీవన్‌రెడ్డితో పాటు జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి తదితరులు హాజరయ్యారు.
గులాబీ జెండా ఎగరాలి
Published Sat, May 10 2014 3:38 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement