నల్లగొండ: నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం పరిధిలో టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు పుస్తకాల పంపిణీ అర్థంతరంగా ఆగిపోయింది. గురువారం పెద్దవూరలో జరిగిన ఒక కార్యక్రమంలో పార్టీ నేతలు సభ్యత్వ పుస్తకాల పంపిణీ చేపట్టారు. అయితే, పెద్దవూర మండలానికి సంబంధించిన పుస్తకాలను ఒక వర్గం వారికే అప్పగిస్తున్నారంటూ మరో వర్గం వారు ఆందోళనకు దిగారు.
జిల్లా నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కార్యక్రమంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గమనించిన పార్టీ నేతలు పెద్దవూర మండలానికి పుస్తకాల పంపిణీని వాయిదా వేసి మిగతా మండలాలకు అందజేశారు.