బీజేపీ ఎమ్మెల్యేల ప్రవర్తన దుర్మార్గం
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ధ్వజం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల ప్రవర్తన దుర్మార్గంగా ఉందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. జాతీయ స్థాయిలో విరోధులుగా ఉండే కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్ర అసెంబ్లీలో కుమ్మక్కు కావడం విచిత్రంగా ఉందని అన్నారు.
బీజేపీ కావాలనే అసెంబ్లీని అడ్డుకోవాలని చూస్తోందని, మంత్రి జగదీశ్‌రెడ్డి మోదీని ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని వారు అన్నారు. మైకు తీసుకుని మాట్లాడే అవకాశమున్నా బీజేపీ సభ్యులు పోడియం దగ్గరకు వచ్చి నానా దుర్భాషలాడారని, మంత్రి జగదీశ్‌రెడ్డికి బీజేపీ సభ్యులు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.