
సాక్షి, సంగారెడ్డి : రిజర్వేషన్ల పేరుతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలను మోసం చేసిందని టీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. మాటలతో మాయ చేసే కేసీఆర్‌ను మైనార్టీలతో సహా, రాష్ట్ర ప్రజలు సైతం నమ్మె పరిస్థితి లేదని ఆయన మండిపడ్డారు. తెలంగాణ వస్తే ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తామని వాగ్దానం ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడెందుకు మాట నిలుపుకోలేదని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై నమ్మకం లేకనే సంగారెడ్డి ముస్లిం డెవలప్‌మెంట్ అసోషియేషన్ నాయకులు లియాఖత్ అలీతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారని శనివారం జరిగిన ఓ సమావేశంలో ఆయన తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం మైనార్టీలు కాంగ్రెస్ పక్షాన నిలబడతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నాలుగేళ్లుగా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ముస్లింలను రాజకీయాల కోసం వాడుకున్నారని అన్నారు. టీఆర్‌ఎస్‌లో ముస్లింలకు సరైన ప్రాధాన్యత లేదని.. కేవలం ఓటే బ్యాంకు కోసమే వాడుకున్నారని ముస్లిం డెవలప్‌మెంట్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇరవై ఏళ్లుగా పార్టీకి కోసం పనిచేసి మాకు.. కనీసం ఈద్గా స్థలం కోసం వెళ్లితే హరీష్ రావు పట్టించుకోలేదని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment