తెలంగాణ స్త్రీశక్తి పురస్కారాలు | TRS will givewomen power awards on International womens day | Sakshi
Sakshi News home page

తెలంగాణ స్త్రీశక్తి పురస్కారాలు

Published Wed, Mar 4 2015 9:11 PM | Last Updated on Tue, Mar 3 2020 7:07 PM

TRS will givewomen power awards on International womens day

హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘తెలంగాణ స్త్రీ శక్తి ’ పురస్కారాలు ఇవ్వనున్నారు. టీఆర్‌ఎస్ మహిళా విభాగం తరఫున ఈ పురస్కారాలను అందించాలని నిర్ణయించినట్లు  ఆ విభాగం రాష్ట్ర కన్వినర్, కరీంనగర్ జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ ప్రకటించారు. పోరాటయోధులతోపాటు క్రీడా, సాహితీ, రచనా, రాజకీయం వంటి పలు రంగాల్లో రాణించిన మహిళలను గుర్తించి ప్రోత్సహించేందుకు ఈ అవార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. మార్చి 8వ తేదీన తెలంగాణ భవన్‌లో నిర్వహించే ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారని వెల్లడించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement