పన్నుల పరేషాన్ | TS govt funds Income Tax Department | Sakshi
Sakshi News home page

పన్నుల పరేషాన్

Published Tue, May 5 2015 12:19 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

TS govt funds Income Tax Department

నామమాత్రపు వసూళ్లతో సరిపెట్టిన అధికారులు
 పన్నుల వసూళ్లలో వెనకబడ్డ వివిధ శాఖలు
 సిమెంట్ ఎగుమతులతో భారీగా పడిపోయిన ఆదాయం
 ఆదాయ పన్ను శాఖ దాడులతో
 దారిలోకి వచ్చిన వ్యాపారులు

 
 నల్లగొండ : ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వానికి నిధుల గండం పట్టుకుంది. అభివృద్ధి సాధించేందుకు రూ.16 వేల కోట్ల అప్పు కోసం వివిధ సంస్థలను, కేంద్రాన్ని ఆశ్రయిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి నిధుల సమస్య కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. పన్నుల రూపంలో ఆదాయాన్ని సమకూర్చే వివిధ ప్రభుత్వ శాఖలను నమ్ముకున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. అవిభాజ్య రాష్ట్రంలో వసూలైన పన్నులు రాష్ట్ర విభజన తర్వాత భారీగా పడిపోయాయి. సంబంధిత శాఖల అధికారులు కూడా నామమాత్రంగానే పన్నులు వసూలు చేస్తూ చేతులుదులుపుకుంటున్నారు. పన్నుల ఆదాయంలో పరమావధిగా భావించే రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోవడం, సిమెంట్ ఎగుమతులు పొరుగు రాష్ట్రాల కు ఎక్కువగా వెళ్తున్నందున పన్నుల వసూళ్లు తగ్గుముఖం పట్టాయని అధికారులు చెబుతున్నారు. ఇక ఆదాయపు పన్ను శాఖ ముమ్మర దాడులు చేయడం వల్ల పన్ను ఎగవేత దారుల ముక్కుపిండి మరీ పన్నులు రాబట్టారు.
 
 కోలుకోని రియల్ దందా...
 రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆశించిన మేర ముందుకు వెళ్లకపోవడంతో స్టాంపులు, రిజిస్ట్రేష న్ల శాఖకు ఆదాయం తగ్గుతోంది. దీంతో ఆ శాఖ ఒకింత అయోమయానికి లోనవుతోంది. గతేడాది నిర్దేశించిన లక్ష్యాని కంటే రూ.82.13 కోట్ల రాబడి తగ్గింది. జిల్లాలో రియల్ ఎస్టే ట్ వ్యాపారం జోరుగా సాగే బీబీనగర్, భువనగిరి, చౌటుప్పుల్, నల్లగొండ ప్రాంతాల్లో వ్యాపారం మందగించింది. అలాగే ఆయకట్టు ప్రాంతాలైన కోదాడ, హుజూర్‌నగర్, మిర్యాలగూడలలో కూడా రియల్ వ్యాపారం స్తబ్దుగానే ఉంది. జిల్లా మొత్తం మీద యాదగిరిగుట్ట  ప్రాంతంలోనే పరిస్థితి మెరుగ్గా ఉంది. ఇక్కడ నిర్దేశించిన లక్ష్యం రూ.13.73 కోట్లు కాగా... రూ.25.44 కోట్ల ఆదాయం సమకూరింది. యాదాద్రి ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది.
 
 వాణిజ్యానికి సిమెంట్ దెబ్బ..
 వాణిజ్య పన్నుల శాఖ ఆదాయం రూ.148.69 కోట్లకు పడిపోయింది. సేల్స్‌టాక్స్, టర్నో వర్ టాక్స్ వసూలు చేయడంలో ఈ శాఖ వెనుకబడింది. ఎక్కువ మొత్తంలో పన్నులు సిమె ంట్ రంగం నుంచే వస్తుంటాయి. అయితే అవిభాజ్య రాష్ట్రంలో సిమెంట్ అమ్మకాలు స్థానికంగా జరిగినందున సీఎస్‌టీ 14 శాతం వసూలు అయ్యేది. రాష్ట్ర విభజన తర్వాత సిమెంట్ ఉత్పత్తులు పొరుగు రాష్ట్రాలకు ఎక్కువగా వెళ్తుండటంతో సీఎస్‌టీ రెండు శాతం మాత్ర మే జిల్లాకు వస్తోంది. దీంతో ఆదాయం తగ్గడానికి ఇదే ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు. టర్నోవర్ టాక్సు వసూళ్లలో సైతం డీలర్లను ఒత్తిడి చేయడం లేదని...స్ట్రీట్ సర్వేల ముసుగులో సొంత ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారనే అపవాదు నుంచి అధికారులు ఇంకా బ యటపడలేదు. జిల్లాలో ఇటీవల టైల్స్ పరిశ్రమకు సంబంధించిన జీరో దందా నడుస్తోం ది. పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా టై ల్స్‌త రలిస్తూ గుట్టుచప్పుకాకుండా వ్యాపా రంచేస్తున్నారు. వీటి పైన అధికారులు ప్రత్యేక దృష్టి సారించడం లేదనే విమర్శఉంది.
 
 గనుల శాఖదీ అదే తీరు...
 సిమెంట్ రంగంలో రారాజుగా భావించే ఐదు ప్రముఖ కంపెనీలు మూతపడటంతో గనుల శాఖకు ఆదాయం తగ్గిందని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి, నార్కట్‌పల్లి-అద్దంకి రహదారుల నిర్మాణాలను దృష్టిలో పెట్టుకుని పన్నుల లక్ష్యాన్ని నిర్దేశించారు. వాస్తవానికి 2012లోనే ఈ రెండు రహదారుల పనులు పూర్తియ్యాయి. కానీ పన్ను వసూళ్ల లక్ష్యంలో ఈ రెండు పనులను కూడా చూపిస్తున్నారు. అయితే జిల్లాలో ఇసుక అక్రమ రవాణా, మైనింగ్ జోరుగా సాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో గతేడాది ఈ శాఖకు రావాల్సిన ఆదాయంలో రూ.52.27 కోట్ల లోటు ఏర్పడింది. వసూలు చేసిన ఆదాయంలో ఎక్కువ భాగం ఇసుక వ్యాపారం నుంచి వచ్చిందే.
 
 రవాణా పన్నులు నామమాత్రం...
 జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం అనుమతి లేని వాహనాలు, పన్ను చెల్లించని వాహనా లు 12 వేల వరకు తిరుగుతున్నాయి. ఇవిగాక తప్పుడు మార్గాల్లో ప్రయాణిస్తున్న వాహనా  లు అనేకం. చెక్‌పోస్టుల వద్ద ఏర్పాటు చేస్తున్న తనిఖీ బృందాల కన్నుగప్పిమరీ దొడ్డిమార్గా న జిల్లా మీదుగా వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో పన్నుల రూపంలో జిల్లాకు రావాల్సిన ఆదాయంలో రూ.31.45 కోట్లు తగ్గింది.
 
 ఐటీ శాఖ మెరుపు దాడులు...
 జిల్లా ఆదాయపు పన్ను శాఖ లక్ష్యం రూ.10 కోట్లుకు గాను రూ.11 కోట్లు వసూలు అ య్యింది. ఐటీ శాఖ కమిషనర్, అదనపు కమిషనర్ రెండు, మూడు సార్లు జిల్లాపై మెరుపు దాడు లు చేశారు. పన్ను ఎగవేత దారులను పసిగట్టి ఐటీ పరిధిలోకి తీసుకొచ్చారు. రియల్ వ్యా పారం, జీరో దందా చేస్తున్న వారిని గుర్తించి పన్నులు చెల్లించేలా చర్యలు చేపట్టారు. అలాగే పన్ను చెల్లింపు దారులతో అవగాహన సదస్సులు నిర్వహించారు. అయితే ఐటీ శాఖ, వా ణిజ్య పన్నుల శాఖ సమన్వయంతో పనిచేసినట్లయితే పన్నుల రాబడి మరింత పెరుగుతుందని ఐటీ శాఖ అభిప్రాయం వ్యక్తం చేస్తోంది.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement