
సాక్షి, హైదరాబాద్ : కాసిస్టేబుల్, ఎస్సై ప్రాథమిక రాత పరీక్షలో పాస్ అయిన అభ్యర్థులకు డిసెంబర్ 17 నుంచి ఫిజికల్ టెస్ట్‌లు(ఈవెంట్స్) నిర్వహించనున్నట్లు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ప్రకటించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. పోలీస్ శాఖలోని వివిధ విభాగాల్లోని పలు పోస్టులకు గాను ఈ ఏడాది ఆగస్ట్, సెప్టెంబర్‌లో ప్రాథమిక పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు డిసెంబర్ 17 నుంచి ఈవెంట్స్ నిర్వహించనున్నట్లుగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది.
ఇందుకు గాను అభ్యర్థులు అప్లికేషన్ పార్ట్ - 2 ను ఫిల్ చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఈ నెల 29(సోమవారం) ఉదయం 10 గంటల నుంచి నవంబర్ 18 రాత్రి 12 గంటల వరకూ ఈ పార్ట్ - 2 అప్లికేషన్‌ను ఫిలప్ చేసి ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయాల్సి ఉంటుందని వెల్లడించింది. ఇందుకు గాను అభ్యర్థులు www.tslprb.in సైట్‌కు లాగిన్ అయ్యి సంబంధిత డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాల్సిందిగా తెలిపింది. పూర్తి వివరాల కోసం పోలీస్ రిక్యుర్మెంట్ బోర్డ్ వెబెసైట్ ను సంప్రదించాల్సిందిగా సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment