సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రావతరణ దినోత్సవ కానుకగా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) శనివారం 2,786 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయనుంది. అందులో 700 వీఆర్వో, 474 మండల ప్లానింగ్, స్టాటిస్టికల్ ఆఫీసర్ (ఎస్‌వో)/అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఏఎస్‌వో), 1,521 గ్రూప్–4 పోస్టులు, ఆర్టీసీలో 72 జూనియర్ అసిస్టెంట్ పర్సనల్, జూనియర్ అసిస్టెం ట్ ఫైనాన్స్ పోస్టులు, రెవెన్యూ విభాగం, హోంశాఖల్లో 19 సీనియర్ స్టెనో పోస్టులు న్నాయి. పోస్టులు, అర్హతలు, పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపర్చనున్నారు.
త్వరలో 20,798 పోస్టుల ఫలితాలు
టీఎస్‌పీఎస్సీ ఇప్పటివరకు 83 నోటిఫికేషన్ల ద్వారా 32,733 పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టింది. అందులో ఇప్పటికే 11,629 పోస్టుల ఫలితాలను వెల్లడించగా.. మరో 20,798 పోస్టులకు సంబంధించిన ఫలితాలను త్వరలో వెల్లడించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మరో 306 పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్ష తేదీలను ప్రకటించింది. మరో 3,386 పోస్టుల భర్తీకి వీలైనంత త్వరగా నోటిఫికేషన్లను జారీ చేస్తామని టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. కొద్దినెలలుగా పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రక్రియలను టీఎస్‌పీఎస్సీ వేగవంతం చేసింది. గత ఏప్రిల్, మే నెలల్లోనే 6,011 ఉద్యోగాల ఫలితాలను ప్రకటించింది. గత నాలుగు నెలల్లో 30 నోటిఫికేషన్లకు సంబంధించి 200 పరీక్షలను నిర్వహించింది.
‘గ్రూప్–1’కూ జారీ చేయాలనుకున్నా..
దాదాపు 125 పోస్టులతో గ్రూప్–1 నోటిఫికేషన్‌ను కూడా జారీ చేయాలని టీఎస్‌పీఎస్సీ తొలుత భావించింది. అయితే జోన్ల వ్యవస్థలో మార్పులు.. కొత్తగా ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ యోచనను విరమించుకుంది. ఒకవేళ ఇప్పుడు పాత రూల్స్‌తో నోటిఫికేషన్ జారీ చేస్తే న్యాయ వివాదంగా మారే అవకాశముందని.. అందువల్ల పూర్తి స్పష్టత వచ్చాక నోటిఫికేషన్ జారీ చేయాలని నిర్ణయించింది.
భర్తీ చేయనున్న పోస్టుల వివరాలివీ..
పోస్టు శాఖ పోస్టుల సంఖ్య
ఎంపీఎస్‌వో/ఏఎస్‌టీవో అర్థగణాంక శాఖ 474
గ్రామ రెవెన్యూ అధికారి రెవెన్యూ 700
సీనియర్ స్టెనో సీసీఎల్‌ఏ, హోం 19
జూనియర్ అసిస్టెంట్ ఆర్టీసీ 72
గ్రూప్–4 పోస్టులు ––––– 1521
మొత్తం –––– 2,786
గ్రూప్–4 పోస్టుల్లో ఏయే శాఖలో ఎన్ని?
పోస్టు శాఖ ఖాళీలు
ఎల్‌డీ/జూనియర్ స్టెనో రెవెన్యూ 15
టైపిస్ట్ రెవెన్యూ 292
జూనియర్ అసిస్టెంట్ రెవెన్యూ 217
జూనియర్ అసిస్టెంట్ పంచాయతీరాజ్ 53
టైపిస్ట్ పంచాయతీరాజ్ 64
జూనియర్ అసిస్టెంట్ వాణిజ్య పన్నులు 231
జూనియర్ అసిస్టెంట్ అటవీశాఖ 32
జూనియర్ అసిస్టెంట్ హోం 22
జూనియర్ స్టెనో హోం 335
టైపిస్ట్ హోం 79
జూనియర్ అసిస్టెంట్ నీటిపారుదల 92
జూనియర్ స్టెనో నీటిపారుదల 09
జూనియర్ అసిస్టెంట్ విపత్తులు, అగ్నిమాపక 02
జూనియర్ స్టెనో విపత్తులు, అగ్నిమాపక 01
––– వైద్య, ఆరోగ్య శాఖ 77
మొత్తం 1,521
Comments
Please login to add a commentAdd a comment