
ప్రసంగిస్తున్న జేఏసీ నాయకుడు చారి
సాక్షి, నారాయణపేట(మహబూబ్‌నగర్) : ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మె సోమవారం 45వ రోజుకు చేరింది. కార్మికులు నిరసనలు, ఆందోళన కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నారు. సోమవారం కార్మికులు మహబూబ్‌నగర్‌లో స్కౌట్స్, గైడ్స్ కార్యాలయం ఆవరణలో నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండివైఖరి వీడాలని కోరారు. ఆర్టీసీ విలీనం డిమాండ్‌ను వదులుకున్నా ప్రభుత్వం చర్చలకు రాకపోవడం సమంజసం కాదన్నారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం మిగతా 5గంటల వరకు నిరాహార దీక్షలు చేపట్టాల్సి ఉండగా సడక్‌బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా శిబిరం వద్ద పోలీసులు గట్టిబందోబస్తు నిర్వహించారు. దీంతో ముందస్తు అరెస్టు చేస్తారేమోన్న ఆందోళనతో ఆర్టీసీ కార్మికులు ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే దీక్షలు చేపట్టారు.
నారాయణపేటలో ఆర్టీసీ కార్మికుల దీక్షలకు సీపీఎం, బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని, ఎంతో మంది ఆర్టీసీ కార్మికులు ప్రాణత్యాగాలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు రఘువీర్‌యాదవ్, కాళీనాధ్, బలరాం, వెంకట్రామారెడ్డి, రాము, ఆర్టీసీ కార్మికులు వహిద్, శ్రీలక్ష్మి, భాగ్యమ్మ, శ్రీదేవి, వెంకట్రామారెడ్డి, గోపీచంద్‌గౌడ్, సురేష్, మధుసూధన్, రవికుమార్, శంకర్, ప్రభాకర్‌రెడ్డి, సిద ్దప్ప, రాజు, రాంచంద్రయ్య, శ్రీశైలమ్మ, అహ్మద్‌ఖాన్ పాల్గొన్నారు. సడక్‌బంద్ నేపథ్యంలో పలువురు ముఖ్య నాయకులు అజ్ఞాతంలోకి పోయారు. శిబిరం వద్దే ఉన్న కొందరు రాజకీయ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమం రద్దు కావడంతో సాయంత్రం వారిని విడిచిపెట్టారు.