హైదరాబాద్ : తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంపై దాఖలైన పిటిషన్పై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఈ కేసులో విచారణ నిమిత్తం అటార్నీ జనరల్ కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున గెలిచి అనంతరం టీఆర్ఎస్లో చేరటంపై టీడీపీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. పార్టీ ఫిరాయించినవారిపై అనర్హత వేటు వేయాలని తెలంగాణ శాసనసభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకరరావు పిటిషన్ వేశారు. మరోవైపు ఇదే విషయంపై ఇప్పటికే టీడీపీ నేతలు స్పీకర్కు ఫిర్యాదు చేశారు.