TTDP MLAs
-
'పార్టీ మారిన వారిపై చర్యలు ఇంకెప్పుడు'
హైదరాబాద్: పార్టీమారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ఛాంబర్లో టీటీడీపీ ఎమ్మెల్యేలు సోమవారం బైఠాయించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ మధుసూదనాచారి వారితో చెప్పారు.ఎప్పటిలోగా నిర్ణయం తీసుకుంటారో కచ్చితంగా తేదీ చెప్పాలని టీటీడీపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. -
టీఆర్ఎస్ నిరంకుశత్వానికి నిదర్శనం
హైదరాబాద్: కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ్యవహారంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై టీటీడీపీ ఎమ్మెల్యేలు నిప్పులు చెరిగారు. గురువారం హైదరాబాద్‌లో టీటీడీపీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకరరావు, రావుల చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ... తమ పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని అరెస్ట్ చేయడం టీఆర్ఎస్ నిరంకుశత్వానికి నిదర్శనమని అన్నారు. కొడంగల్‌లో ప్రభుత్వం చేపట్టిన గ్రామజ్యోతి కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే రేవంత్‌ను ఆహ్వానించలేదని వారు ఆరోపించారు. రేవంత్‌ను అరెస్ట్ చేయడం.. ఆపై లాఠీచార్జీ చేసి.. దౌర్జన్యం చేయడం దారుణమన్నారు. ప్రొటోకాల్ ఉల్లంఘనపై స్పీకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేయాలని వెళ్లాం కానీ వారు అందుబాటులో లేరని ఎర్రబెల్లి, రావుల తెలిపారు. -
తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ
హైదరాబాద్: త్వరలో జరగనున్న శాసన మండలి ఎన్నికలపై టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కసరత్తు ప్రారంభించారు. గురువారం సాయంత్రం తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఎమ్మెల్సీ ఎన్నికలలో పార్టీ వ్యూహాలు, నిర్ణయాలపై చర్చించనున్నట్లు సమాచారం. -
'ఎమ్మెల్సీ ఫలితాలతో ప్రజావ్యతిరేకత బట్టబయలు'
హైదరాబాద్: ఎమ్మెల్సీ ఫలితాలతో ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత బయటపడిందని టీటీడీపీ ఎమ్మెల్యే నరసారెడ్డి ఆరోపించారు. నిన్న లాబీల్లోకి రాకుండా ప్రభుత్వం తమను అడ్డుకుందని, ఈ రోజు అసెంబ్లీ గేటువద్దే అడ్డుకున్నారని, రేపు హైదరాబాద్ లో ఉండనిస్తారో లేదోనని టీటీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. గురువారం వారు మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ...సస్పెండైన ఎమ్మెల్యేలు సభలోకి వెళ్లడానికి మాత్రమే వీళ్లేదని అసెంబ్లీ ప్రాంగణంలోకి రాకుండా ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. సస్పెన్షన్ వ్యవహారంలో ప్రభుత్వ తీరు బాగోలేదన్నారు -
మమ్మల్ని దొంగల్లా చూస్తున్నారు..
-
మమ్మల్ని దొంగల్లా చూస్తున్నారు..
హైదరాబాద్: తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలను మార్షల్స్ మరోసారి అడ్డుకున్నారు. గురువారం ఉదయం టీ.టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఆవరణలోకి వచ్చిన వారిని లోనికి వెళ్లకుండా మార్షల్స్ అడ్డుకోవటంతో తీవ్ర వాగ్వివాదానికి దిగారు. మరోవైపు పోలీసులు కూడా ఎమ్మెల్యేలను అడ్డుకున్నారు. దాంతో తమను దొంగలుగా చూస్తున్నారని తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, గోపీనాథ్, మాధవరం కృష్ణారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సస్పెండ్ అయినంత మాత్రాన తమను అసెంబ్లీ ఆవరణలోకి రానివ్వకపోవడం సరికాదని ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. మార్షల్స్, పోలీసుల తీరుకు నిరసనగా తెలంగాణ టీడీపీ కార్యాలయం ఎదుట బైఠాయించిన ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశారు. -
సొంత ఎమ్మెల్యేలనే కొంటున్న బాబు
* ‘దేశం’లో బ్లాక్‌మెయిలింగ్ ఎమ్మెల్యేలు * ఎమ్మెల్యేగానే పోటీ చేస్తా * మీడియాతో చిట్‌చాట్‌లో మంత్రి తలసాని సాక్షి, హైదరాబాద్: ‘ఏపీ సీఎం చంద్రబాబు పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలనే కోట్ల రూపాయల ప్యాకేజీలు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఇంతకంటే దుస్థితి ఏముంటుంది? తమను టీఆర్ఎస్ పిలుస్తోందంటూ టీడీపీ ఎమ్మెల్యేలు బ్లాక్మెయిల్ చేస్తోంటే వారికి కోట్లకు కోట్ల రూపాయలు ఇచ్చే దుస్థితికి చేరారు..’ అని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావే శాల సందర్భంగా శనివారం ఆయన లాబీల్లో మీడియాతో ‘చిట్‌చాట్’ చేశారు. టీడీపీ శాసన సభ్యత్వానికి తాను రాజీనామా చేశాకే మంత్రి మండలిలో చేరానని, రాజీనామా లేఖ స్పీకర్ వద్ద పెండింగులో ఉందన్నారు. తాను మండలికి వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోందని, కానీ తాను సనత్‌నగర్ నుంచే పోటీ చేస్తానని కుండబద్ధలు కొట్టారు. దమ్ముంటే చంద్రబాబు కూడా తనపై పోటీ చేయొచ్చని, అయితే ఎవరు ఓడిపోతే వారు రాజకీయాలకు దూరంగా ఉండాలని సవాలు విసిరారు. టీడీపీ ఫ్లోర్‌లీడర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు తనకు మంత్రి పదవి ఇస్తే టీఆర్ఎస్లో చేరతానని సీఎంను కలిశారన్నా రు. చంద్రబాబు గతంలో కేసీఆర్‌పై మోత్కుపల్లితో మాట్లాడించి బకరా చేశారని, ఇప్పుడు రేవంత్‌రెడ్డితో మాట్లాడించి బకరా చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేతగా జగన్ సక్సెస్ ప్రతిపక్ష నేతగా గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యవహరించినట్లే.. జగన్ కూడా చేస్తున్నారని కితాబు ఇచ్చారు. రాజశేఖరరెడ్డి ఎన్నడూ మైక్ అడగలేదని, స్పీకర్ తనకు మైక్ ఇచ్చే విధంగా కనుసైగతో తన వాళ్లతో పనిచేయించే వారని, అదే తరహాలో జగన్ ప్రతిపక్ష నేతగా రాణిస్తున్నారని కొనియాడారు. -
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై విచారణ వాయిదా
హైదరాబాద్ : తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఈ కేసులో విచారణ నిమిత్తం అటార్నీ జనరల్ కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున గెలిచి అనంతరం టీఆర్ఎస్లో చేరటంపై టీడీపీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. పార్టీ ఫిరాయించినవారిపై అనర్హత వేటు వేయాలని తెలంగాణ శాసనసభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకరరావు పిటిషన్ వేశారు. మరోవైపు ఇదే విషయంపై ఇప్పటికే టీడీపీ నేతలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. -
ప్రధాన ప్రతిపక్షం తరహాలో వ్యవహరించండి
తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు దిశానిర్దేశం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో ప్రధానప్రతిపక్షం తరహాలోనే పోరాడాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు టీటీడీపీ ఎమ్మెల్యేలకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ అధికార పక్షంతో కుమ్మక్కైనట్టుగానే వ్యవహరిస్తున్నందున టీడీపీ ఎమ్మెల్యేలు మరింత దూకుడుగా వ్యవహరించాలని ఆదేశించారు. పార్టీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ గడువు ముగిసి గురువారం నుంచి శాసనసభకు వెళ్లనున్న నేపథ్యంలో ఏపీ సచివాలయంలోని తన చాంబర్లో టీ.నేతలతో సమావేశమయ్యారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, శాసనసభా పక్షంనేత ఎర్రబెల్లి దయాకర్ రావు, ఉపనేత ఎ.రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆర్. కృష్ణయ్య, జి. సాయన్న, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, మాగంటి గోపీనాథ్ తదితర ఎమ్మెల్యేలు పాల్గొన్న ఈ సమావేశంలో ఆయన సభలో వ్యవహరించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. సస్పెన్షన్‌కు ముందు టీడీపీ ఎమ్మెల్యేలు సభలో వ్యవహరించిన తీరు సంతృప్తికరంగా ఉందని, అధికారపక్షాన్ని ఇరకాటం పెట్టడంలో రేవంత్‌రెడ్డి, దయాకర్‌రావు వంటి నాయకులు సక్సెస్ అయ్యారని అభినందించారు. టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సభ్యత్వాన్ని రద్దు చేయాలని స్పీకర్, మండలి చైర్మన్లను ఎందుకు కలవలేదని ప్రశ్నించినట్లు సమాచారం. స్పీకర్, మండలి చైర్మన్లు స్పందించని పక్షంలో కోర్టుకు వెళ్లాలని సూచించారు. ‘ తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సమస్యకు, సాగునీరు, ఇతర సమస్యలకు ఏపీ ప్రభుత్వమే కారణమని భావిస్తే టీడీపీ తరపున మీరే ఆ ప్రభుత్వంపై కేసు దాఖలు చే యండి. పార్టీ , ప్రాంతం , ప్రభుత్వం వేర్వేరు అనే సందేశాలను పంపండి’ అని ఆదేశించారు. -
ప్రశ్నించినందుకే సస్పెన్షన్
ఆదిలాబాద్ రూరల్ : తెలంగాణలో కరెంటు కోతలతో పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, రైతులకు భరోసా కల్పించాలని తాము అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే టీటీడీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడిన రైతుల కుటుంబాలకు ఎన్టీఆర్ సంక్షేమ నిధి నుంచి రూ.50వేల చొప్పున 74మందికి ఆర్థికసాయం చెక్కులు అందజేశారు. ఆదివారం పట్టణంలోని ఆర్ అండ్ బీ విశ్రాంతి భవనం ఎదుట ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలో 400 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం తరఫున ఒక్క అధికారి గానీ, మంత్రులు గానీ, ఎమ్మెల్యేలు గానీ పరామర్శించలేదని అన్నారు. జిల్లాలో 74మంది ఆత్మహత్య చేసుకుంటే జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు కూడా పరామర్శించకపోవడం బాధాకరమని తెలిపారు. 25 మంది మాత్రమే ఆత్మహత్య చేసుకున్నట్లుగా అధికారుల వద్ద రిపోర్టులు ఉన్నాయని తెలిపారు. రైతు కుటుంబాలకు భరోసా, మనోధైర్యాన్ని కల్పించాలనే ఉద్దేశంతో తమ పార్టీ ఆధ్వర్యంలో యాత్ర చేపట్టినట్లు తెలిపారు. పత్తి పంటకు క్వింటాల్‌కు కనీసం రూ.5వేల మద్ధతు ధరతోపాటు రాష్ట్ర ప్రభుత్వం రూ.500 బోనస్‌గా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లో ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు సీసీఐ చైర్మన్‌ను రప్పించి వారికి మద్దతు ధర దక్కేలా కృషి చేస్తామని అన్నారు. జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు ఆర్అండ్బీ విశ్రాంతి భవనం నుంచి కలెక్టర్ క్యాంప్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. క్యాంప్ కార్యాలయం ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కలెక్టర్ జగన్మోహన్ను కలిసివినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ పశ్చిమ, తూర్పు జిల్లా అధ్యక్షులు లోలం శ్యాంసుందర్, అరిగెల నాగేశ్వర్రావు, ఎమ్మెల్యేలు గోపినాథ్, ప్రకాష్‌గౌడ్, ఎన్నికల కన్వీనర్ పెద్దిరెడ్డి, ఆదిలాబాద్ మాజీ ఎంపీ రాథోడ్ రమేష్, బోథ్ మాజీ ఎమ్మెల్యే సోయం బాపురావ్, యూనుస్ అక్బానీ, రాజేశ్వర్, నైతం వినోద్, బీజేపీ నేత పాయల్ శంకర్ పాల్గొన్నారు. -
బాబు గైడెన్స్‌తోనే గొడవ చేస్తున్నారు: సురేఖ
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో టీటీడీపీ ఎమ్మెల్యేల వ్యవహారాల శైలిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొండా సురేఖ శుక్రవారం హైదరాబాద్‌లో నిప్పులు చెరిగారు. టీటీడీపీ ఎమ్మెల్యేలు పక్క ప్రణాళికతో పాటు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి గైడెన్స్‌తో గొడవ చేస్తోందని ఆరోపించారు. గత టీడీపీ పాలన హయాంలో రైతుల ఆత్మహత్యల విషయంలో తమ బండారం ఎక్కడ బయటపడుతుందోనని ప్రశ్నోత్తరాలు అడ్డుకుంటున్నారని ఆమె విమర్శించారు. సభలో ప్రశ్నోత్తరాలను అడ్డుకోవడం సమంజసం కాదని కొండా సురేఖ అభిప్రాయపడ్డారు. కేంద్రం, పక్క రాష్ట్రంలో ఉన్న బీజేపీ, టీడీపీలు అక్కడి సమస్యలపై ఎందుకు నోరెత్తడం లేదని ఆయా పార్టీల నేతలను కొండా సురేఖ ప్రశ్నించారు. అలాగే తెలంగాణ విద్యుత్ సమస్యలను కేంద్రం దృష్టికి ఎందుకు తీసుకెళ్లడం లేదో వెల్లడించాలని ఆయా పార్టీల నేతలను డిమాండ్ చేశారు. -
కేసీఆర్ బంధువుకు కాంట్రాక్ట్ దక్కలేదనే ...
కరీంనగర్: ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ లైన్ కాంట్రాక్ట్ తమ బంధువుకు దక్కలేదనే సీఎం కేసీఆర్ నక్సల్ సమస్యను తెరపైకి తీసుకువచ్చారని టీటీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. బస్సు యాత్రలో భాగంగా ఆదివారం కరీంనగర్ వచ్చిన టీటీడీపీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్ రెడ్డి ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ... ఆ కారణంగానే ఛత్తీస్‌గఢ్ నుంచి కరెంట్ లైన్ వేసే పనిని ఆపేశారని అన్నారు. అలాగే సెంట్రల్ రిజర్వ్ ఫారెస్ట్‌లో కరెంట్ లైన్ వేసే పనులు ప్రైవేట్ కాంట్రాక్టర్‌కు అప్పగిస్తే బాగుంటుందని తన అభిప్రాయాన్ని తెలిపిన అధికారిని టీఆర్ఎస్ బదిలీ చేసిందని విమర్శించారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలన్నీ టీఆర్ఎస్ సర్కార్ చేసినవేనని అన్నారు. ప్రజల సమస్యల గురించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే బస్సు యాత్ర చేపట్టాం కానీ రాజకీయం చేయడానికి కాదని వారు అన్నారు. ప్రజల సమస్యలపై ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఈ నెల 18, 19, 20 తేదీల్లో ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒత్తిడి తెస్తామన్ని హెచ్చరించారు. -
టిడిపి ఎమ్మెల్యేలకు చంద్రబాబు బిస్కెట్లు!
తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు సైకిల్ దిగి కారు(టిఆర్ఎస్ పార్టీ గుర్తు) ఎక్కకుండా అపేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విశ్వప్రయత్నం చేస్తున్నారు. వారికి అనేక ఆశలు చూపుతున్నారు. టీడీపీలో ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో భారీ కాంట్రాక్టులు, నామినేటేడ్ పదవులు కట్టబెడతామని ఆశ చూపిస్తున్నారు. ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా పార్టీని వీడితే తెలంగాణలో పార్టీ మనుగడకే ప్రమాదమని ఆ పార్టీ గ్రహించింది. దాంతో చంద్రబాబు కోటరి నష్ట నివారణ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. తెలంగాణ టీడీపీకి చెందిన ఎమ్మెల్యేల్లో సగం మంది టీఆర్ఎస్ పార్టీలోకి వెళతారనే వార్తలు చంద్రబాబుకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే పలు మార్లు ఎమ్మెల్యేలతో చంద్రబాబు నాయుడు చర్చలు జరిపి, పార్టీని వీడొద్దని చెప్పారు. టీఆర్ఎస్ ప్లీనరి సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరుతారని వార్తలు వస్తున్న నేపధ్యంలో తెలంగాణలో పార్టీకి ఉన్న 15 మంది ఎమ్మెల్యేలను కాపాడుకొనే ప్రయత్నాలను చంద్రబాబు ముమ్మరం చేశారు. ఈ బాధ్యతను తన కోటరిలోని ముఖ్య నాయకులు ముగ్గురికి అప్పగించారు. దీంతో ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహానరావు రంగంలోకి దిగారు. తెలంగాణ నేతలు పార్టీ వీడకుండా అపే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద పెద్ద కాంట్రాక్టులు ఇస్తామంటూ ఎమ్మెల్యేలకు ఆశచూపుతున్నారు. అంతేకాకుండా కీలకమైన నామినేటెడ్ పోస్టులు ఇస్తామంటూ రాయబేరాలు నడుపుతున్నారు. టీడీపీలో ఉంటే మంచి భవిష్యత్ ఉంటుందని నచ్చచెబుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదురైతే కేంద్రంలో తమకు అనుకూల బీజేపీ ప్రభుత్వం ఉందని ధైర్యం చెబుతున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లినా ఎటు వంటి ప్రయోజనం ఉండదని అంటున్నారు. ఒక వేళ వెళ్లినా కేసీఆర్ అందరికీ పదవులు ఇవ్వలేరని చెబుతున్నారు. కోటరి నేతల సంప్రదింపలు ఫలిస్తాయా? చంద్రబాబు నాయుడు చూపే ఆశలకు ఎమ్మెల్యేలు ఆగుతారా? అనేది తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. **