ప్రభుత్వం తమను దొంగల్లా చూస్తోందని తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యీలు ఆరోపించారు.
హైదరాబాద్: తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలను మార్షల్స్ మరోసారి అడ్డుకున్నారు. గురువారం ఉదయం టీ.టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఆవరణలోకి వచ్చిన వారిని లోనికి వెళ్లకుండా మార్షల్స్ అడ్డుకోవటంతో తీవ్ర వాగ్వివాదానికి దిగారు. మరోవైపు పోలీసులు కూడా ఎమ్మెల్యేలను అడ్డుకున్నారు.
దాంతో తమను దొంగలుగా చూస్తున్నారని తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, గోపీనాథ్, మాధవరం కృష్ణారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సస్పెండ్ అయినంత మాత్రాన తమను అసెంబ్లీ ఆవరణలోకి రానివ్వకపోవడం సరికాదని ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. మార్షల్స్, పోలీసుల తీరుకు నిరసనగా తెలంగాణ టీడీపీ కార్యాలయం ఎదుట బైఠాయించిన ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశారు.