హైదరాబాద్: కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ్యవహారంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై టీటీడీపీ ఎమ్మెల్యేలు నిప్పులు చెరిగారు. గురువారం హైదరాబాద్లో టీటీడీపీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకరరావు, రావుల చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ... తమ పార్టీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డిని అరెస్ట్ చేయడం టీఆర్ఎస్ నిరంకుశత్వానికి నిదర్శనమని అన్నారు.
కొడంగల్లో ప్రభుత్వం చేపట్టిన గ్రామజ్యోతి కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే రేవంత్ను ఆహ్వానించలేదని వారు ఆరోపించారు. రేవంత్ను అరెస్ట్ చేయడం.. ఆపై లాఠీచార్జీ చేసి.. దౌర్జన్యం చేయడం దారుణమన్నారు. ప్రొటోకాల్ ఉల్లంఘనపై స్పీకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేయాలని వెళ్లాం కానీ వారు అందుబాటులో లేరని ఎర్రబెల్లి, రావుల తెలిపారు.