పోటీకి సిద్ధంగా లేని ఇద్దరు మంత్రులు!
హైదరాబాద్ : తెలంగాణలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇద్దరు మంత్రులు ఆసక్తి చూపటంలేదు. హోంమంత్రి కడియం శ్రీహరి, రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. సేఫ్ జోన్ ద్వారా మండలిలో అడుగు పెట్టాలని ఇరువురు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఉద్యోగ సంఘాల నేత దేవీప్రసాద్ కూడా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ను కోరగా... ఆయన మాత్రం పట్టభద్రుల నియోజకవర్గం నుంచే పోటీ చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.
వైద్య ఆరోగ్య శాఖలో అవినీతి ఆరోపణల నేపధ్యంలో తాటికొండ రాజయ్యపై వేటు పడటంతో ఆయన స్థానంలో వరంగల్ ఎంపీ కడియం శ్రీహరికి డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టిన విషయం తెలిసిందే. మరోవైపు టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు కూడా మంత్రి పదవి చేపట్టిన ఆరు నెలల్లో చట్టసభలో అడుగుపెట్టాల్సి ఉంది. ఖమ్మం అసెంబ్లీ నుంచి తెదేపా అభ్యర్థిగా తుమ్మల ఓటమి పాలైన విషయం తెలిసిందే.