నాగార్జునసాగర్ :నాగార్జునసాగర్ జలాశయానికి వచ్చే వరద పెరుగుతూ... మళ్లీ తగ్గుతోంది. వాస్తవానికి కృష్ణానదికి ఎగువన కురుస్తున్న వర్షాలతో కాకుండా, స్థానికంగా కురుస్తున్న వర్షాలతో వరద వస్తోంది. దీంతో ఈ వరద నీటిని అధికారులు అంచనా వేయలేకపోతున్నారు. శ్రీశైలం జలాశయానికి సోమవారం అర్ధరాత్రి దాటేసరికి ఎగువ నుంచి వచ్చే వరద ఒక్కసారిగా తగ్గింది. దీంతో వెంటనే ప్రాజెక్టు క్రస్ట్‌గేట్లు మూసివేశారు. దీంతో దిగువన ఉన్న సాగర్ జలాశయ గేట్లు కూడా మంగళవారం తెల్లవారుజామున మూయాల్సి వచ్చింది. ఉదయానికి వరదఉధృతి పెరగడంతో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రెండుగేట్లు తెరుచుకున్నాయి.
దీంతో మళ్లీ సాగర్‌కు ఇన్‌ఫ్లో భారీగా పెరిగింది. సాయంత్రానికి వరదతగ్గడంతో గేట్లను మూసివేశారు. కేవలం విద్యుదుత్పాదన ద్వారా 75,854క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో సాగర్ ప్రాజెక్టు పది గేట్లను మొదట ఎత్తారు. ఆ తర్వాత ఎనిమిదికి, పెరిగిన పర్యాటకులు గేట్లు ఎత్తడంతో కృష్ణమ్మ పరవళ్లను చూడటానికి పర్యాటకులు తరలివస్తున్నారు. దీంతో కృష్ణాతీరం సందడిసందడిగా మారింది. పర్యాటకులు బారులుదీరి కృష్ణమ్మ అందాలను తనివితీరా చూశారు. చంద్రవంకవాగు పొంగి పొర్లుతుండటంతో ఎత్తిపోతల వద్ద జలపాత దృశ్యం పర్యాటకులకు ఆహ్లాదం కలిగించింది. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా తరలివస్తున్నారు. వీరంతా అత్యధిక సంఖ్యలో వస్తుండడంతో చిరువ్యాపారులకు పండగ వాతావరణం నెలకొన్నది, మొక్కజొన్న కండెలు, వేరుశనగకాయలకు గిరాకీ పెరిగింది.
పెరుగుతూ.. తగ్గుతూ
Published Wed, Sep 17 2014 4:10 AM | Last Updated on Fri, Oct 19 2018 7:22 PM
Advertisement