హైదరాబాద్ సిటీ : బ్రెజిల్ దేశానికి చెందిన కరెన్సీ నోట్లను మార్పిడి చేయడానికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను నగరంలోని నేరెడ్‌మెట్ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి... వీరు ఉప్పల్ లోని భరత్నగర్‌కు చెందిన రియల్టీ వ్యాపారి నక్కా నవీన్(38), సత్య రాఘవేంద్ర కాలనీకి చెందిన ఫణీశ్వరరావు(40)గా పోలీసులు గుర్తించారు.
శనివారం నేరేడ్‌మెట్ చౌరస్తా గ్రీన్ బవార్చి హోటల్ దగ్గర వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి బ్రెజిల్ దేశానికి చెందిన 196 కరెన్సీ నోట్ల(ఒక్కోటీ వెయ్యి రూపాయల విలువైన)ను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.
కరెన్సీ మార్పిడి చేస్తున్న ఇద్దరు అరెస్ట్
Published Sat, Feb 14 2015 9:37 PM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement
Advertisement