రెండు బెడ్‌రూముల ఇళ్ల హామీపై బలరాం నాయక్
నెల్లికుదురు : ‘రెండు బెడ్‌రూముల ఇళ్లు నిర్మించి ఇచ్చేది ఊరుకొకటా...ఇంటి కొకటా’ అని కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ ఎద్దేవా చేశారు. వరంగల్ జిల్లా నెల్లికుదురులో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన అప్పటి సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సంతకం దానిపైనే చేశారని గుర్తు చేశారు. రూ.70 వేల కోట్ల రైతు రుణాలు మాఫీ చేశారన్నారు.
ఊరు కొకటా.. ఇంటికొకటా...
Published Mon, Jul 21 2014 12:23 AM | Last Updated on Thu, Apr 4 2019 4:44 PM
Advertisement
Advertisement