ఇద్దరు రైతులను బలిగొన్న అప్పులు | Two farmers killed debts | Sakshi
Sakshi News home page

ఇద్దరు రైతులను బలిగొన్న అప్పులు

Published Sun, Nov 2 2014 6:11 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

Two farmers killed debts

మునిగలవీడు(నెల్లికుదురు) : ఇద్దరు ఆడపిల్లల పెళ్లికి ఆ రైతు చేసిన అప్పులు ఇంకా తీరలేదు. ఉన్న ఎకరం పొలంలో వరి సాగు చేయగా.. కరెంట్ లేక పంటంతా ఎండిపోరుుంది. అప్పులు తీర్చే మార్గం లేక మనోవేదనకు గురైన ఆ అన్నదాత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని మునిగలవీడులో శనివారం జరిగింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఎస్‌కే ఖాజామియూ(55), మహిబూబా దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అతడు వ్యవసాయంతోపాటు ఐస్‌క్రీమ్, కూరగాయల బేరం చేస్తుండేవాడు. అప్పు తెచ్చి ఇద్దరు కూతుళ్ల పెళ్లి చేశాడు.

ఇటీవల కూతురు పురుడు ఖర్చుకు కూడా అప్పు చేయూల్సి వచ్చింది. ఈ సారి ఎలాగైనా పంట పండించి అప్పులు తీర్చాలని తనకున్న 30 గుంటల పొలంతోపాటు తన అక్క మహిబాకు చెందిన 20 గుంటల పొలంలో వరి సాగు చేశాడు. అరుుతే కరెంట్ రాక.. నీళ్లు లేక పొలమంతా ఎండిపోరుుంది. దీంతో రెండు రోజులుగా దిగాలుగా ఉంటున్న ఖాజామియా లక్షకుపైగా చేసిన అప్పులు ఎలా తీర్చాలని మనోవేదనకు గురయ్యూడు. శనివారం తెల్లవారుజామున ఐదు గంటలకే లేచి మానుకోటకు వెళ్లి ఐస్‌క్రీమ్‌లు తీసుకొస్తానని బయల్దేరాడు. కానీ అతడు పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమీపంలోని రైతులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా వారు చేరుకుని బోరున విలపించారు. మృతుడి భార్య మహిబూబా ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బెల్లం చేరాలు చెప్పారు.
 
గట్టుకిందిపల్లెలో మరొకరు..
గీసుకొండ : పత్తి దిగుబడి రాకపోవడంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలని మనోవేదనకు గురైన ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గీసుకొండ శివారు గట్టుకిందిపల్లెలో శుక్రవారం జరిగింది. పోలీ సుల కథనం ప్రకారం.. గ్రామానికి పులి సారంగం(40) తన ఎకరం భూమితోపాటు గ్రామంలోని మరో రైతుకు చెందిన మరో రెండెకరాల భూమి కౌలుకు తీసుకుని పత్తి పంట సాగు చేశాడు. వర్షాభావ పరిస్థితులతో పంట సరిగా దిగుబడి రాలేదు.

రెండేళ్లుగా పంటలు సరిగా పండక.. పెట్టుబడి రాక అప్పుల పాల య్యూడు. అప్పులు తీర్చలేని స్థితిలో శుక్రవారం సాయంత్రం చేను వద్ద క్రిమిసంహారక మందు తాగగా గమనించిన రైతులు 108లో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్సపొందుతూ అదేరోజు రాత్రి మృతిచెందినట్లు పోలీసులు తెలి పారు. మృతుడికి భార్య పద్మ, పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement