రామగుండం : రామగుండం సమీపంలో.. మల్యాలపల్లి స్టేజీ వద్ద రాజీవ్హ్రదారి బైపాస్‌లో ఆదివారం జరిగిన రోడ్డు ప్ర మాదంలో ఇద్దరు తాపీమేస్త్రీలు దుర్మరణం పాలయ్యారు. ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా లచ్చగూడెం గ్రామానికి చెందిన తోకచచ్చు రవీందర్‌రాజు ఎన్టీపీసీలోని అన్నపూర్ణ కాలనీలో నివాసముంటూ మేస్త్రీగా పనిచేస్తున్నాడు.
ప్రకాశం జిల్లా మద్దెరపాలెం మండలం చేకూర్తికి చెందిన తన్నీరు బాల కోటయ్య రామగుండంలోని అయోధ్యనగర్‌లో ఉంటూ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. ఇద్దరు కలిసి ద్విచక్రవాహనంపై బసంత్‌నగర్ నుంచి రామగుండం వస్తున్నారు. రాజీ వ్హ్రదారి విస్తరణ పనుల్లో భాగంగా మల్యాలపల్లి సబ్‌స్టేషన్ వద్ద వన్‌వే చేశారు. మల్యాలపల్లి స్టేజీవద్దకు రా గానే గోదావరిఖని నుంచి బసంత్‌నగర్ వైపు వస్తున్న కారును వేగంగా ఢీకొట్టారు. ఈ సంఘటనలో రవీందర్‌రా జు(40) అక్కడికక్కడే చనిపోయాడు.
బాలకోటయ్య(42)ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా చనిపోయాడు. ఈ ఘటనలో కారు, ద్విచక్రవాహనం నుజ్జునుజ్జయ్యాయి. తోక చచ్చు రవీందర్‌కు భార్య విజయలక్ష్మి, ఇద్దరు కూతుళ్లు దివ్యజ్యోతి, నాగజ్యోతి ఉన్నారు. బాలకోటయ్యకు భార్య రాధ, ముగ్గురు కూతుళ్లు అఖిల, సంధ్య, పూజ ఉన్నారు. ట్రాఫిక్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రహదారి విస్తరణ పనులు నెమ్మదిగా కొనసాగుతుండడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు పేర్కొనడం గమనార్హం.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
Published Mon, Jan 12 2015 4:00 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement
Advertisement